Drop Down Menus

కార్తీక మాసంలో ఏ రోజు ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసా? Karthika Masam Significance - Hindu Temples


ప‌విత్ర‌మైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించ‌డం ఎంత పుణ్య‌మో... దానాలు చేయ‌డం వ‌ల్ల కూడా అంతే పాప ప‌రిహారం. అందుకే ఈ మాసంలో శ‌క్తి కొల‌దీ దానధ‌ర్మాలు చేయాల‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. ఏదైనా శుభకార్యాలకు, గృహప్రవేశలకు ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కొన్ని దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.అయితే ఏ రోజున ఎటువంటి వస్తువులు ధానం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

*కార్తీక మాసం మొదటి రోజు: నెయ్యి, బంగారాన్ని దానం చేయాలి.

*రెండవ రోజు: కలువ పూలు, నూనె, ఉప్పు ఇతరులకు దానం చెయ్యాలి.

*మూడవరోజు: కార్తీక మాసం మూడో రోజు పార్వతి దేవిని పూజిస్తారు.ఈ రోజు ఉప్పును ఇతరులకు దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

*నాలుగో రోజు: కార్తీక మాసంలో 4వ ఈ రోజైన చతుర్దశి రోజు నాగుల చవితి గా జరుపుకుంటారు.అలాగే వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.

కార్తీక మాసం నాలుగవ రోజు పెసరపప్పును దానం చేయాలి.

*ఐదవ రోజు: కార్తీక మాసంలో వచ్చే 5వ రోజున జ్ఞాన పంచమి అని పిలుస్తారు.ఈరోజు ఆ ఆదిశేషుని పూజించి, పాలను దానం చేయాలి.

*ఆరవ రోజు: ఈ రోజున సంతానంలేనివారు ఎర్రటి కండువాను బ్రహ్మచారికి దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

*ఏడవ రోజు: కార్తీక మాసంలో 7వ రోజు దుర్గా దేవిని పూజించాలి.ఎర్రటి వస్త్రములో కొద్దిగా గోధుమలను మూటకట్టి ఇతరులకు దానం చేయడం ద్వారా ఆయుష్సు పెరుగుతుంది.

*ఎనిమిదవ రోజు: ఈరోజు గోపూజ నిర్వహించి, ఇతరులకు బియ్యాన్ని దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

*తొమ్మిదవ రోజు: కార్తీకమాసంలో ఈ రోజున ఆ విష్ణు భగవానుని పూజించి, ఎర్రటి కంది పప్పును దానం చేయాలి.

*పదవరోజు: కార్తీకమాసంలో పదవరోజు నూనెను, దానం చేయటం వల్ల ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

*పదకొండవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు శివుని ప్రత్యేకమైన పూజలతో పూజిస్తారు.ఈ రోజున పండ్లను దానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

*పన్నెండవ రోజు: కార్తీక మాసంలోఈ రోజు ఉసిరి, తులసి చెట్టు వద్ద ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.ఈరోజు పాల పదార్థాలను దానం చేయడం ఎంతో మంచిది.

*పదమూడవ రోజు: కార్తీక మాసంలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో వనభోజనాలకు వెళ్లి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.ఇటువంటి రోజున బియ్యాన్ని దానం చేయడం ఎంతో శ్రేయస్కరం.

*పధ్నాలుగోవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు యమధర్మరాజును పూజించి దున్నపోతు లేదా గేదెను దానంగా ఇస్తారు.

*పదిహేనవ రోజు: కార్తీక మాసంలో ఈ రోజు ఎంతో ముఖ్యమైనది.కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నదీస్నానమాచరించి, దీపాలు వెలిగించడం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయి.

ఈరోజు సాయంత్రం నదిలో దీపాలను చంద్ర దర్శనం తర్వాత ముత్తయిదువులు ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటారు.ఈ విధంగా కార్తీక పౌర్ణమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

Famous Posts:

పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే  

ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి.. 

కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?

పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? 

అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి 

దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు

శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది? 

అగ్నిసాక్షిగా వివాహం ఎందుకు చేస్తారు..? 

అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు

karthika masam 2020, karthika masam telugu 2020, karthika masam vratham, karthika masam 2020 dates telugu, karthika masam pooja, karthika masam in telugu, karthika masam importance, karthika pournami 2020, కార్తీక మాసం, దానం, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.