కార్తీక మాసంలో ఈ నాలుగు తప్పకుండా పాటించాలి?
కార్తీక మాసంలో ముఖ్యమైన విషయాలంటే.. నదీ స్నానం, శివారాధన, దీపారాధన-దీపదానం, విష్ణు ఆరాధన-పురాణ పఠనం లేదా శ్రవణం, దానములు చేయడం.
ఈ మాసంలో దీపాలు వెలిగించి శివ కేశవులను ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వారు చేసిన పాపాలు తొలగి, పుణ్యం కలిగి, జ్ఞానం సిద్ధించి, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుంది.
స్నానం..
కార్తీక మాసంలో రవి తుల రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల మానవుడి శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం కలుగుతుంది.
దీపం..
దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే! దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చేటువంటి తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అలాగే, అంధకారం దారిద్ర్యానికి చిహ్నమని, కాంతి లక్ష్మీప్రదమని.. జ్ఞానానికి అభివృద్ధికి చిహ్నమని పెద్దలు చెబుతున్నారు.
ప్రతి మనిషీ నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేస్తే మంచిది. దీపారాధన ఇంటి యజమాని చేయాలి. కలియుగంలోని ప్రస్తుత కాలంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం సాధ్యంకాని వారికి కార్తీక మాసంలో దీపారాధనకు మించిన గొప్ప అవకాశం ఏదీ ఉండదు.
కార్తీక మాసంలోనూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడని వారికి కార్తీక శుక్ల ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ రెండు రోజుల్లో చేయడంతో కలుగుతుంది.
కార్తీక మాసంలో సాయంత్రం పూట ఆలయంలో గానీ, తులసికోట, వద్దా, రావిచెట్టు వద్దా, మేడపైన లేదా ఏదయినా నది వద్ద ఎవరయితే దీపారాధన చేస్తారో వారికి పుణ్య ఫలం లభించి శివసాన్నిధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.
ఉపవాసం..
కార్తీక మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచి జరిగి మనస్సు నిర్మలం చెంది దైవం వైపు, దైవత్వం వైపు లగ్నమవుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండటమంటే, కేవలం ఆహారం మానేయడం కాదు! కోరికలను తొలగించుకొని, సకల ధ్యాస భగవంతుడిపై లగ్నం చేసి ఉండటం. ఉపవసించిన ప్రతిక్షణమూ భగవతారాధనలో గడిపిన వారికి ఉపవాస ఫలితం సిద్ధిస్తుంది. అది పుణ్యప్రదమై, జ్ఞాన ప్రదమై, మోక్ష ప్రదమవుతుంది.
కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం ఆచరించేవారు.. దశమి రోజున ఒకపూటే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానమాచరించి శివకేశవులను పూజించి బ్రాహ్మణులకు/అతిథులకు భోజనం పెట్టి తరువాత ఎవరైతే భుజిస్తారో వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కార్తీక పురాణం యందు స్పష్టంగా చెప్పబడింది.
దానం..
మన సనాతన ధర్మంలో గృహస్థు చేయాల్సిన వాటిల్లో స్నానం, దానం, జపం మరియు తర్పణం ముఖ్యమైనవి. కార్తీకంలో చేసేటటువంటి స్నాన, దాన, జప, తర్పణాలకు అత్యంత అధికమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలిపాయి. అందుచేత కార్తీకమాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణ దానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని కార్తీక, మార్కండేయ, శివ పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
Famous Posts:
> అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?
> మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము
> దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా?
> స్త్రీ మూర్తులకి ఇవి అవసరం..
> శుక్రవారం విడిచిన దుస్తుల్నే_ధరిస్తే..?
> ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి ?
> గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు
కార్తీక మాసం, కార్తీక మాసం విశిష్టత, Karthika Masam, karthika masam in telugu, karthika masam visistatha in telugu, karthika pournami pooja vidhanam in telugu, karthika pournami katha in telugu pdf