Drop Down Menus

దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు... ఎందుకో తెలుసా? The rules to be folowed in temples

 

దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు... ఎందుకో తెలుసా..

పంచమ రకాలు..

దేవాలయాలు పంచ(ఐదు) రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా వెలసినవి.. దివ్య స్థలాలు - దేవతలచే ప్రతిష్టింపబడినవి.. సిద్ధ స్థలాలు - మహర్షులు, తపస్సు చేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్టించినవి.

పౌరాణ స్థలాలు - పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.. మానుష స్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉంటాయి.

Also Readఅన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు

దేవాలయ గోపురాలు..

హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల తదితర విభాగాలు ఉంటాయి.

ఈ పనులు చేయకండి..

దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకారం పూజారులు, భక్తులు, అధికారులు ఏ విధంగా వ్యవహరించకూడదంటే.. ముఖ్యంగా ఆలయం లోపలికి ఎవ్వరూ కూడా వాహనాలలో రావడం.. చెప్పులు, బూట్లతో వంటి వాటితో తిరగడం చేయరాదు.

అప్పుడే లోపలికి ప్రవేశించాలి..

ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాతే గుడి లోపలికి ప్రవేశించాలి. ఆలయంలో లోపలికి తలపాగా ధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు.

తినుబండారాలను తీసుకుని..

ఆలయంలోకి ఒట్టి చేతులతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూ గాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.

నిద్రపోరాదు..

దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత నిద్రపోవడం, కాళ్లు చాపుకుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన వంటి పనులు చేయకూడదు.

వివాదాలు పెట్టుకోరాదు..

ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటికీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయరాదు.

Also Readచేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి?

పరనింద చేయకూడదు..

దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు.

ఆలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు అందరూ సమానులే అని భావించాలి.

Famous Posts:

ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?


పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి..


శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం


ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను |  ధన దేవతా స్తోత్రం


శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ.


దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!


సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్


> చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

దేవాలయాల్లో, నమస్కారం, Temples, The rules to be folowed in temples, dharma sandehalu telugu, dharma sandehalu telugu lo, sanatana dharma telugu, sanatana meaning in telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.