Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి? To Get Money In Hand | Dharma Sandehalu

చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి?

డబ్బు అందరికి ప్రధానమే డబ్బుని నోటి మాటని అదుపుచేయగలిగిన వాడు లోకాన్నే శాసించ కలుగుతాడు ఆ డబ్బుకి ప్రధానదేవత ఆ మహాలక్ష్మి అమ్మవారి గురుంచి తెలుసుకుందామా….!

పురాణాల్లో లక్ష్మీ అమ్మవారు 

లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె ‘నిత్యానపాయిని’ (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.

సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మిని ‘భార్గవి’ అని కూడా అంటారు.

దూర్వాసుని శాపం లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావం ..

ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె ‘సముద్రరాజ తనయ’ అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.

Also Readముగ్గు - రెమెడీస్

విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.

విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారం లో సీత గా, కృష్ణావతారం లో రుక్మిణి గా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి కి తోడు అలమేలు మంగ గా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.

వేదాలలో లక్ష్మీ అమ్మవారు 

వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా).

యజుర్వేదం :

యజుర్వేదం పురుష సూక్తం లో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం , వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది.

మత్స్య పురాణం లో అమ్మవారి రూపం 

లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణం లో ఇలా చెప్పారు – “దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి.

అగ్ని పురాణం లో అమ్మవారు

అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.

మహాలక్ష్మి అమ్మవారికి అనుగ్రహానికి చేయవలసిన కార్యాలు 

దైనందిన జీవితం లో ప్రతి రోజు నిత్యకర్మలను నిర్వర్తించుకొని పూజగది లో నేతి (నెయ్యి ) తో

దీపారాధన …..అమ్మవారికి పరమాన్నం నివేదించటం ఇలాగ 9 శుక్రవారములు అమ్మవారి ఆరాధన చేయటం శుభప్రదం.

ఉసిరికాయ దీపాలను వెలిగిస్తే ఎటువంటి ఫలితం

శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.

శంకరాచార్యులవారు విరచించిన కనకధారా స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

ఉసిరికాయ దీపంతో శ్రీమహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారింపబడుతుంది.

అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీకమాసంలో ధాత్రి హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి.

అప్పుల బాధనుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీమహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్రపూజ చేయాలి.

ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీమహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు వసూలు అవుతాయి.

ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి ‘శ్రీ’ చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

శ్రీమహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు.

శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది.

ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసిన తరువాత నీళ్ళు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

ప్రతిరోజూ రోజూ పూజా చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది.

ఉసిరికాయ ఊరగాయ పక్కన నివశిస్తున్నవారికి లేదా బంధువుల ఇళ్ళకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతవంతమైన జీవనాన్ని సాగిస్తారు.

ఉసిరికాయను చేతపట్టుకుని సంగమ తీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానం ఇస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు.

ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు.

ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది.

ఉసిరికాయ దీపాలను తులసికోట ముందు వెలిగించినట్లయితే దైవ భక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.

శ్రీ గణపతి హోమంలో శక్తిగణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తె అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి.

కమలాక్షి మణితో శ్రీమహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తరువాత పండు ముత్తైదువుకి (60 సంవత్సరాలు పైబడిన) తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

మరి కొన్ని ఆచరించవలసిన నియమాలు 

శుక్రవారం నాడు గృహిణులు మౌనవ్రతం పాటించటం , మగవారు ఇంటిలోని ఆడవారిని సోదరీమణులును దూషించటం(తిట్టడం)ఇంటిలో ఆడవారు కన్నీరు పెట్టించటం ఇటువంటివన్నీ ఇంటిలో లక్ష్మి కళను దూరంచేస్తాయి..

Famous Posts:

నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?


భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి.


ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.


అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.


నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?


భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి.


తుల‌సి_చెట్టు మారే స్థితిని బ‌ట్టి ఆ ఇంట్లో ఏం జ‌రుగుతుందో ముందే చెప్ప‌వ‌చ్చ‌ట‌


చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?


ఇంట్లో పూజ ఎవరు చేయాలి? 

చేతిలోని డబ్బు నిలవాలంటే, To Get Money In Hand, cash in hand formula, Dharma Sandehalu, dharma sandehalu telugu, dharma sandehalu 2020, Dharma Sandehalu In Telugu Pooja,  spiritual story's, 

Comments