Drop Down Menus

మొధెరా సూర్య దేవాలయం, గుజరాత్ - Sun Temple, Modhera - Interesting Facts About Modhera Sun Temple Gujarat

 

మొధెరా సూర్య దేవాలయం, గుజరాత్.

గుజరాత్ లో మహసానా జిల్లాలో కల మొధెరా ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెకు కొద్ది దూరంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది. ఇది ఉత్తర గుజరాత్ లో గల సరస్వతీ నదిలో కలిసి పడమరగా నున్న రణ్ ఆఫ్ కచ్ లోనికి పోయి కలుస్తుంది. ఇది మొహసానా కు 18 మైళ్ళ పడమరగా ఉన్నది. పాటన్ శివారుకు చెందినది. పాటన్ అసలు పేరు అంహిలవడి పాటన్. ఇది సోలంకి రాజుల ముఖ్య పట్టణం. వారి కాలంలో బంగారం, ముత్యాలు, రత్నాలు మొదలగునవి రోడ్డుమీద గుట్టలుగా పోసి అమ్మెడివారట. ఈ పట్టణానికి 8 మైళ్ళ దక్షిణంగా ఒక మహారణ్యం ఉండేదట. దాని పేరు ధర్మారణ్యం. సోలంకిరాజుల కాలములో పాటన్ లో రాజాదరణలో వున్న కొద్దిమంది బ్రాహ్మణులకు, ధర్మారణ్యంలొ కొంతభాగం బాగు చేయించి వసతులు కల్పించి దాన మిచ్చారట. పాటన్ నుంచి వచ్చిన బ్రాహ్మణులు మొధ్ లేదా యొఢ్ బ్రాహ్మణులట. వారికి ఇక్కడ వసతులు కల్పించబడినవి కావున దీనికి యొఢెరా లేదా మొధెరా అనే పేరు వచ్చినది.

Also Readహనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి..? ఎలా చేయాలి?

అహ్మదాబాద్‌నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్ సోలంకి-I నిర్మించారు.

క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించు కోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు.

సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్‌వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడు కునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో మూడు సూర్యదేవుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం.

శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశేషం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్ నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది.

మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు‌ రామాయణం, మహాభారతం లోని ప్రధానమైన విషయాలను కూడా చెక్కారు. స్థంభాల కింది భాగంలో చూస్తే అష్ట‌కోణాకారం లోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి.

సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. సభామండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.

చరిత్రలో మోఢేరా మందిరం...

స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మరన్య' అని పిలిచేవారు.  శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపంనుంచి బయట పడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెపుతున్నాయి. అప్పుడు గురువైన వశిష్ట మహర్షి ' ధర్మరన్య' వెళ్ళమని శ్రీరామ చంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలవబడుతోంది.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం :

 మోఢేరా సూర్యదేవుని ఆలయం అహ్మదాబాద్‌నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్‌నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది.

రైలు మార్గం : 

అహ్మదాబాద్ వరకు రైలు మార్గంగుండా ప్రయాణించి ఆ తర్వాత బస్సు లేదా టాక్సీలలో ప్రయాణించాలి.

వాయు మార్గం : 

అహ్మదాబాద్ విమానాశ్రయం.

Also Readకాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు.. 

సూర్యారాధన  ప్రపంచ వ్యాప్తంగా, విభిన్న నామాలతో అనాది కాలం నుంచీ జరుగుతూనే వుందన్నది అక్షర సత్యం. సూర్య ఆత్మా జగత్ స్తస్థు షస్చ ...రుగ్వేదం సూర్యుణ్ణె జగదాత్మ అంటున్నది. పూష్ణ, భగ, మిత్ర, అర్యమన్, విస్వత్..రవి, సూర్య, ఇవన్నీ ఆ భాస్కరుని నామాలే. రామాయణ, మహాభారతాల్లో, సూర్య సంబంధమైన వివరణలనేకం ఉన్నాయి. సూర్యొపాసన గురించిన అనేక ప్రమాణాలూ పురాణల్లో చాలా ఉన్నాయి. విస్ణు పురాణం సూర్యుని రథ విస్తారమే, నూరు వేల యోజనాలంటున్నది. దీనికి రెండింతలు దీనీ ఈషా దండము. దీని ఇరుసు (ధుర) ఒకటిన్నర కోటీ, యేడు లక్షల యోజనాల పొడుగు అని పేర్కొన్నది. దీనికే ఈ రథ చక్రమున్నది. ఆ అక్షయ రూపమైన సంవత్సరాత్మక చక్రములో సంపూర్ణ కాలచక్రమున్నది. గాయత్రి, బృహతి, వుష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అన్న యేడూ సూర్య రధాశ్వాలు. మత్స్య, భవిష్య, విష్ణుధర్మోత్తర, అగ్ని పురాణదులలో సూర్య మూర్తికి సంబంధించిన అనేక విశేషాలు లభ్యాలు. భారతీయ శిల్ప కళల్లో, సూర్యుని రూపాలు ప్రాచీన కాలం నుంచే కనిపిస్తున్నాయి.

Famous Posts:

మొధెరా సూర్య దేవాలయం, Sun Temple, Modhera, modhera temple, modhera sun temple timings, modhera sun temple upsc, konark sun temple, places near modhera sun temple, modhera sun temple built by


ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.