Drop Down Menus

దేవుడికి ఏ నైవేద్యం పెడితే.. మనకు ఏ ప్రతిఫలం లభిస్తుంది | Devotional Story's - Dharma Sandehalu Telugu

దేవుడి నైవేద్యం.. ప్రతిఫలం

దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళ్తే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయంటారు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు, పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండు తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.

చిన్న అరటి (యాలకి అరటి) :

నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.

అరటిగుజ్జు :

రుణ విముక్తి, రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను, డబ్బు సైతం తిరిగి వస్తుంది. పెండ్లి తదితర శుభ కార్యాలయాల కు సకాలంలో నగదు అందుతున్నది. హఠాత్తుగా నగదు మంజూరవుతున్నది.

పూర్ణఫలం/కొబ్బరికాయ :

పనులు సులభ సాధ్యం. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పైఅధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి.

సపోటా పండు :

వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి.

కమలా ఫలం :

చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు.

మామిడి పండు :

ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి.బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి.

ఇష్టదైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచిమీరు కూడా సేయిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతున్నది. ఇష్టదైనానికి మామిడి పండు అంజూరపండ్లను నైవేద్యంగా సమర్పించి దాన్ని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వల అవుతారని నమ్మకం. ఎటువంటి సమస్యలు రావంటారు.

అంజూర పండు :

అనారోగ్య సమస్యలు తీరతాయి.స్వల్పరక్తపోటు (లోబీపీ) ఉన్న వారికి మంచిది.కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారణ సంకల్పాన్ని చెప్పుకుని సుమంగళీలకు తాంబూలంలో సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంకల్పం ఎవరి పేరున చెబుతారో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలాలు పొందుతారు.

నేరేడుపండు :

నేరేడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. రోజూ నేరేడుపండును తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు.

పనస పండు :

శతృజయం కలుగుతుంది. శత్రవులు, మిత్రులుగా మారుతారు. రోగ నివారణతో పాటు కష్టాలు తొలగుతాయి.

యాపిల్ పండు :

సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు...

ద్రాక్షపండ్లు :

దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి. దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి..

జామపండు :

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ నైవేద్యంగా ఉంచితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం. సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి. పెడ్ల్లికాని యువతులతో ముత్తయిదువులకు పెడితే పెండ్లి ఆటంకాలు సమసిసోతాయి. జామ, కమలాపండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది....

Famous Posts:

dharma sandehalu telugu pdf, dharma sandehalu'' questions, dharma sandehalu online, dharma sandehalu telugu, dharma sandehalu about death, sutakam rules in telugu pdf,  dharma sandehalu about periods, god prasadam, నైవేద్యం

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.