Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం - అన్ని మతాల,కులాల వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం - Importance Of Bhagavad Geetha | Bhagavad Gita Slokas

భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అన్ని మతాల,కులాల వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. 

మన దేశంలో ఒక్కొక్క మతానికి ఒక్కో దేవుడు,ఒక్కొక్క కులానికి ఒక్కో కుల దేవతలు ఉన్నారు. ఇలా ఎవరి దేవుళ్ళను వారు ప్రార్థించడం మంచిదే,తప్పు లేదు. అయితే మా దేవుడే నిజమైన దేవుడు,మీ దేవుడు కాదు అని వాదిస్తే అది పెద్ద తప్పు. ఇలాంటి వాదనలు,గొడవలు రాకుండా ఉండాలి అంటే మీరు భగవద్గీతలోని 5 వ అధ్యాయములో ఒక శ్లోకాన్ని చదవాలి.అదేమిటంటే..

||ఇహైవ తైర్జిత సర్గో

  ఏషాం సామ్యే స్థితం మనః

  నిర్దోషం హి సమం బ్రహ్మ

  తస్మాత్ బ్రహ్మణి తే స్థితః || (5:19)

అంటే ఎవరి మనసు సమ దృష్టితో ఉంటుందో,అన్ని ప్రాణులను,అందరి మనుషులను ఎవరైతే సమానంగా చూస్తూ ఉంటాడో అతడు జీవించి ఉండగానే తన జన్మను జయించి, బ్రహ్మమును (అసలైన దేవుడిని) తెలుసుకుని ఆ తత్త్వంలో 

ఉండిపోతాడు.బ్రహ్మము అంతటా,అందరిలో సమానంగా వ్యాపించి ఉంటుంది.దోషం లేకుండా ఉంటుంది అని శ్రీకష్ణుడు చెబుతాడు.

ఇదండీ,జ్ఞానం అంటే ఇదండీ..శ్రీకృష్ణుడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూశారా..ఆ దేవుడు అందరిలో సమానంగా వ్యాపించి ఉన్నాడంట. కాబట్టి ఆ దేవుడిని చూడాలి అంటే ముందు మనం అందరినీ సమానంగా చూడడం అలవాటు చేసుకోవాలి. సమ దృష్టి మనకు రావాలి.

కానీ మనది భేద దృష్టి,అంటే వీడు మా కులం వాడు కాదు,మా మతం వాడు కాదు అని చూసే దృష్టి మనది. ఇలాంటి దృష్టి ఉంటే మానవత్వాన్నే చూడలేం ఇక దైవత్వాన్ని,దేవుడిని ఎలా చూడగలం. ఒక్కసారి ఆలోచించండి..

మీరు శివుడిని పూజించండి,బయటికి వచ్చి అందరిలో శివుడిని చూడండి.. ఓ ముస్లింలారా మీరు అల్లాను పూజించండి,బయటికి వచ్చి అందరిలో అల్లాను చూడండి.. ఓ క్రైస్తవులారా మీరు జీసేస్ ను పూజించండి,బయటికి వచ్చి అందరిలో జీసెస్ ను చూడండి.

ఇదేనండీ సమ దృష్టి అంటే.ఇదే నిజమైన భక్తి. ఇలాంటి సమ దృష్టి ఎవరిలో ఉంటుందో వాళ్ళే నిజమైన భక్తులు. వాళ్లనే దేవుడు ఆశీర్వదిస్తాడు.వాళ్ళకే దేవుడు కనిపిస్తాడు.సమ దృష్టి లేకుండా మా దేవుడే గొప్ప,మా మతమే గొప్ప అని అహంకారంతో బతికే వాళ్లకు దేవుడు కనిపించడు,వాళ్ల పై ఏ మాత్రం దయ చూపడు.

చూశారా గీత లోని (5:19) శ్లోకం లో ఎంత గొప్ప అర్థం ఉందో.

ఈ శ్లోకం గురించి మన లాయర్లకు,జడ్జ్ లకు తెలియాలి. మన

రాజ్యాంగం లో కొన్ని అసమానతలు ఉన్నాయి.వాటిని తుడిచి వేయాలి అంటే ఈ శ్లోకాన్ని మన రాజ్యాంగంలో స్వర్ణాక్షరాలతో.

Famous Posts:

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

Importance Of Bhagavad Geetha, Bhagavad Gita Slokas, bhagavad gita slokas in telugu lyrics, iskcon bhagavad gita in telugu pdf, important bhagavad gita slokas in telugu, భగవద్గీత

Comments