Drop Down Menus

కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న - 40 రోజులు పూజ చేస్తే.. సంతాన ప్రాప్తి | Kondagattu Anjaneya Swamy Temple

కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న..

రామభక్త హనుమాన్ కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది.

Also Readనరఘోష తగలకుండా ఉండాలంటే ...ఇవి పాటించండి.

కొండగట్టు మీద ఉన్న ఆజనేయుని ఆలయం నిర్మణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయం భూ గా వెలిశాడని.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం.. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది. ఆ అవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాను. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు.

సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, 'శ్రీ ఆంజనేయుడు' కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాల( నృసింహస్వామి,ఆంజనేయస్వామి) తో కనిపించడం విశేషం. శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీబేతాళ స్వామి. ఈయన ఆలయం కొండపైన నెలకొని ఉంది. ఇక్కడికి ప్రతి మంగళ, శని వారాలలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

ఆంజనేయునికి 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. విశేష పండగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే ఇక్కడ కొలవై ఉన్న ఆంజనేయస్వామిని భక్తులు ప్రేమతో అంజన్న అని పిలుస్తారు.

హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లడానికి హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి.. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్‌ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్‌ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల సౌకర్యం కూడా ఉంది.

Famous Posts:

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

Kondagattu Anjaneya Swamy, kondagattu anjanna temple timings, kondagattu anjanna naa songs download, kondagattu anjanna temple distance, kondagattu anjanna photo, kondagattu anjanna temple contact number, kondagattu anjanna temple history in telugu, kondagattu anjanna images hd, kondagattu anjanna ringtones

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.