ఆగస్త్య మహర్షి చే ప్రతిష్టించబడి ఎన్నో అద్బుతాలకు నెలవు అయిన మీనాక్షి ఆగస్తేశ్వర ఆలయం
శివలింగం తల భాగంలో నుంచి దివ్యజలం ఊరుతూ వుంటుంది.
గుంటూరు జిల్లలోని ఉన్న దాచేపల్లి కి అతి దగ్గరలో #తెలంగాణా రాష్ట్ర దామచర్ల మండలం #వాడపల్లే గ్రామంలో #మీనాక్షీ #ఆగస్తేశ్వర #స్వామి వారి ఆలయం ఉంది .. 🙏
ఇక్కడి శివుడిని .. లక్ష్మీనరసింహస్వామి మూర్తులను 6000 సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతోంది.
కృష్ణానది,ముచికుందానది(మూసీ)ప్రవహించే పవిత్ర సంగమ ప్రాంతాన్ని 6000 సంవత్సరాల క్రితం ఆగస్త్య మహర్షి తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతాన్ని చూసి రెండు నదుల సంగమ ప్రదేశం అతి పవిత్ర స్థలంగా భావించి నదిలో స్నానమాచరించి శివలింగాన్ని,లక్ష్మీ నృసింహ స్వామి వార్ల కు నది ఒడ్డున 120 అడుగుల ఎత్తులో ప్రతిష్టించి పూజించాడట. అప్పట్లో అటవీప్రాంతం కావటంతో ఆగస్త్యడు ప్రతిష్టించిన విగ్రహాలు ను ఎవరూ చూడక వాటిపై క్రమేణా పుట్టలు వెలిసాయి
14 వశతాబ్దంలో రెడ్డి రాజులు (అన వేమారెడ్డి.భీమా రెడ్డి పరిపాలనా కాలంలో) ఈ ప్రాంతాన్ని సందర్శించి నదీ తీరంలో కోట నిర్మించుకోవచ్చని త్రవ్వకాలు చేపట్టగా పుట్టలో కనిపించిన శివలింగం,నృసింహ స్వామి వార్ల విగ్రహాలు చూసి ఆశ్చర్యం పొంది భక్తితో దేవాలయాన్ని నిర్మించి పూజలు చేయనారంభించారు
ఆ కాలంలో ఈ గ్రామాన్ని ఆగస్త్యపురం,నరసింహపురం,వీరభధ్రపురం అని పిలిచేవారట.
కాలక్రమేణా నైజాం నవాబ్ మేనల్లుడు నజీర్ సుల్తాన్ ఈ ప్రాంతం పై దండెత్తి రెడ్డి రాజుల కోటలను ద్వంసం చేసారు,కాని పవిత్ర ఆలయం అని తెలిసి ఆలయం ను ఏమి చెయలేదట
ఇక శివలింగం తల భాగంలో నుంచి దివ్యజలం ఊరుతూ వుంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నది ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కలేదు. శివలింగం తల భాగంలో రెండు వైపులా నీరు ఊరటం వెనుక ఒక చారిత్రక కధనం ఉంది:
ఒక రోజు ఒక బోయవాడు బాగా ఆకలిగా ఉండి ఒక పావురం ను తన బాణం తో వేటాడుతూ రాగా ఆ పావురం ఈ ఆలయంలో శివలింగం వెనుక దాక్కునగా,బోయవాడు అప్పటికి వేటాడబోగా స్వామి వారి ఆ పావురం నా రక్షణలో ఉంది దానిని వదులుము అని తన వాక్కు వినిపించారట.
బోయవాడు అది నమ్మక మరి నా ఆకలి ఎవరూ తీర్చుతారు దానిని వదిలితే అని ఎదురు ప్రశ్న వేయగా నా తలలో మెదడు భాగం స్వీకరించమని వినిపించగా బోయవాడు వెళ్లి శివలింగం తలపై తన రెండు చేతులతో గట్టిగా లాగగా కొంత మాంసం వచ్చిందట.. వెంటేనే తలపై ఉన్న గంగమ్మ పైకి ఉబికింది.
అప్పటి నుండి ఈ ఆలయంలో శివలింగం పై తల భాగాన చేతి వేళ్ళ గుర్తులు, రెండు వైపులా వేళ్లు పట్టే చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. శివలింగం తలపై రెండు వైపులా ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరు ను తోడివేసినా మరలా వెంటేనే ఊరుతూ ఉంటుంది.అది ఈ నాటికి జరుగుతూ ఉంది
1524 వ సంవత్సరంలో శంకరాచార్యులు ఈ ఆలయం దర్శించి శివలింగంపై నీరు ఎలావస్తుందో స్వయంగా పరిక్షించ దలచి ఒక ఉద్దరిణి కి దారం కట్టి ఆ బిలంలో వదిలారట. ఆ దారం ఎంత వదిలినను లోపలికి వెళ్తూ ఉందట,చివరికి పైకి లాగి చూడగా ఆ ఉద్దరిణి చివర రక్తపు మరకలు కనిపించగా,స్వామివారిని పరీక్షించి తప్పు చేసానని శాంతి హోమం చేసి క్షమించమని స్వామి వారిని కోరి ఇదే విషయం ను ఆలయం లో పాళీ భాషలో శాసనం వేయించారు.అది ఇప్పటికి మనం చూడవచ్చు
ఒక వైపున మూసీ నదీ .. మరో వైపున కృష్ణా నది ప్రవహిస్తూ ఉండగా, మధ్యలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. మూసీ నది ఒడ్డున లక్ష్మీ నరసింహస్వామి ఆలయం .. కృష్ణా నది ఒడ్డున శివాలయం దర్శనమిస్తూ ఉంటాయి. ఈ రెండు నదుల సంగమ క్షేత్రం కావడం వలన భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి శ్వాస తీసుకుంటున్నట్టుగా ఆయన నాసిక ఎదురుగా వున్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ దీపానికి కాస్త కిందగా వున్న మరో దీపం నిశ్చలంగా ఉంటుంది. స్వామి వారికి నిత్యపూజలతో పాటు,శివరాత్రి,కార్తీక మాసంలో గొప్ప ఉత్సవాలు చేస్తారు. ఈ ఆలయ్యంలో మీనాక్షి అమ్మవారు,నాగదేవత లు విగ్రహాలు ఉంటాయి.అలనాటి పురాతన రాతి స్తంభాలు,పురాతన మర్రి చెట్టు మనం చూడవచ్చు
ఈ ఆలయంలో స్వామి వార్లను ఆరాధించిన వారికి కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు చెపుతారు..
ఆలయ సమయాలు ;-
ఉదయం 6 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
తిరిగి సాయంత్రం 4 గంటలు నుండి రాత్రి 8 గంటల వరకు.
మిర్యాలగూడ నుండి 25 km దూరం లో కలదు ..
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment