Drop Down Menus

స్త్రీకి సౌభాగ్యాన్నిచ్చే ఉండ్రాళ్ళ తద్ది నోము ఎలా చేయాలి? ఉండ్రాళ్ళ తద్దె విశిష్టత పూజ విధానం - Undralla Thaddi | Vundralla Thaddhi Gowri Puja Vidhanam

భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు, సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే 'ఉండ్రాళ్ళ తద్ది'. 

భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము 'ఉండ్రాళ్ళ తద్ది' ఈ నోముకు 'మోదక తృతీయ' అనే మరోపేరు కూడా కొన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే 'తద్ది' అనుమాట మూడవ రోజు 'తదియ' అనే అర్థంతో వాడబడినది కనుక 'తదియ', 'ఉండ్రాళ్ళ తద్ది'గా పిలువబడుతున్నది. పూర్వము ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగియున్నా, ఓ వేశ్యయైన 'చిత్రాంగి'పై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి భార్యలందరూ 'ఉండ్రాళ్ళ తద్ది' అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి, రాజుగారితో ''నీవు వివాహం చేసుకున్న భార్యల చేత 'ఉండ్రాళ్ళ తద్ది' నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు.

నీ భార్యలమీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్దెనోము జరుపుకోవటానికి అవసరమైన సరకులను సమకూర్చమని'' రాజు తనవద్దకు వచ్చిన సమయంలో అడిగింది. రాజు అట్లేయని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయనాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి, చీకటి పడగానే గౌరిదేవికి బియ్యపుపిండితో ఉండ్రాళ్ళను చేసి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి, మరో అయిదు ఉండ్రాళ్ళను ఒక పుణ్యస్త్రీ కి వాయనమిచ్చి, నోము ఆచరించి గౌరిదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్ళు నిర్విఘ్నంగా నోమునోచుకుని, ఉద్యాపన చేసిన ఫలితంగా ఆపవిత్రయైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. పూర్వం ఓ వేశ్య తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దెనాడు, రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారముతో దైవ నింద చేసేసి నోముకో లేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు. మహా వ్యాధి బారాన పడ్డది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపదని తిరిగి పొంది, ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి, మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.

ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తనతో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి. హిందు సాంప్రదాయములో నోములు, పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను. అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి, మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ, ఆకులు అలంకరించి, ధూప దీప నైవేద్యాల తో పూజించి, ముత్తైదువులకు, తాంబూల మిచ్చి, ఆశీస్సులు తీసుకోవటముతో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసులో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మికానందం కలుగుతుంది.

ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును పెళ్ళయిన ఏడాది నుండే ప్రారంభించి, ఐదు సంవత్సారాలు నోచుకుంటారు. తమ భర్త, సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతానం లేనివారు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ నోము నోచుకుంటారు. ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు, ముద్దాపసుపు కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వులనూనె వారికి ఇచ్చి, మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి.

విదియనాడు తలంటి స్నానాలు చేసి మధ్యాహ్నం గోరింటాకు రుబ్బి పెట్టుకుంటారు. వివాహం కాని ఆడపిల్లలు ఆ రోజు తెల్లవారుఝామున తలంటు పోసుకోవాలి. తలంటు అనగానే ఏదో షాంపూతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి. ఆ కుంకుడులోని దేదుతనం క్రిమికీటకాలని జుట్టులోకి రానివ్వదు. జుట్టులోని తడిని తరువాత మెత్తని టవల్ తో చుట్టుకోవాలి. తరువాత బాగా పీల్చుకునేలా చేసి సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి. దీంతో జుట్టు అంతా సువాసనతో నిండిపోవడమే కాకుండా తల తడవడంతో జుట్టు మూలాల దగ్గర ఉన్న తడి పూర్తిగా ఆరిపోతుంది. ఇక ఉదయం ఆరు గంటలకు ముందే గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి.

రెండవ రోజు ఉండ్రాళ్ళ తద్దెలోని ప్రత్యేకత ఏమిటంటే తెల్లవారు ఝామునే భోజనాలు చేయడం. ఈ రోజు కూడా గోంగూర లేదా ఆవకాయ నంచుకుని పెరుగు అన్నం తిని అలసిపోయేవరకు దగుడుమూతలూ మొదలైన ఆటలు ఆడతారు. ముగ్గురి ఇళ్ళలో ఊయల ఊగుతారు. ఆటలు పూర్తయిన తరువాత ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తీసుకువచ్చిన ఉండ్రాళ్ళని వాళ్ళ కూతురికి ఇస్తే ఆ తల్లీ కూతురూ ఆ ఉండ్రాళ్ళని తల్లీ కూతుళ్ళకి ఇస్తారు. ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికి, యా కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు.

మధ్యాహ్నం గౌరీ పూజ. గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఐదు దారపు పోగులు, ఐదు ముడులు వేసో. ఏడు తోరాలను అమ్మవారి ప్రక్కనే పెట్టి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోము చేసుకున్న వారికి, మిగిలిన ఐదు, ఐదుగురు ముత్తైదువులకు పూజ తరువాత కట్టాలి. బియ్యపుపిండిలో బెల్లం కలిపి, పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాళ్ళను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి.

పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరచుకుంది. ఒక ఉండ్రాళ్ళ తద్దె రోజు, రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరాడు. ఆమె అహంకారంతో దైవ నిండా చేసి నోము చేయలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకుపోయారు. మహా వ్యాధి బారిన పడింది. తరువాత రాజ పురోహితుడి సలహాపై ఉండ్రాళ్ళ తద్దె నోము నోచుకుని, తన సంపదని తిరిగి పొంది, ఆరోగ్యవంతురలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి, మరణానంతరం గౌరీ లోకానికి చేరుకుంది. అక్షింతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గరవి తీసుకుని తలపై చల్లుకోవాలి. కొబ్బరికాయ కొట్టి, నైవేద్యాలు నివేదించాలి. ఈ కథలోని నీతి ఏమిటంటే గర్విష్టి అయిన వారికి ఇంతటి కఠినమైన శిక్షకు గురైంది కదా అందుకే సత్ప్రవర్తనతో నోము నోచినవారికి ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు. అందుకే సన్మార్గంలో నడవండి.

*_ఉండ్రాళ్ళ తద్దె నోము_*

వివాహం అయిన సంవత్సరం వచ్చే ఉండ్రాళ్ళ తద్దె రోజున నోమును పట్టుకుంటారు. ముందురోజు గోరింటాకు పెట్టుకోవాలి. ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి గోంగూర పచ్చడితో భోజనం చేయాలి. తెల్లవారిన తరువాత స్నానం చేసి మూడు ఇళ్ళలో ఉయ్యాల ఊగాలి. గౌరీపూజ చేసి వాయనం ఇచ్చుకోవాలి. గౌరీపూజ పూర్తయిన తరువాత ఉండ్రాళ్ళ తద్దె వ్రతకథ చదవాలి. అక్షింతలు చేతిలో పెట్టుకుని, కథ పూర్తైన తరువాత అక్షింతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గరనుండి కొన్ని అక్షితలు తలపై చల్లుకోవాలి. ఒక పళ్ళెంలో ఐదు పూర్ణాలు లేకపోతే ఐదు ఉండ్రాళ్ళు, పండు తాంబూలం, ఐదు పోగుల తోరం, దక్షిణ వీటిని రెండు ప్లేట్లలో సర్థుకోవాలి. ఒకటి గౌరీదేవికి నైవేద్యం. తోరం చేతికి చుట్టుకుని ఎవరైనా ముత్తైదువ ఉంటే ఆమెకు వాయనం ఇవ్వవచ్చు లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టాలి. వాయనం ఇచ్చిన తరువాత ఇచ్చినవాళ్ళు తినకూడదు. వాయనం ఇచ్చిన తరువాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి.

ఉండ్రాళ్ళ తద్దె నోము చెల్లించడం :

ఐదుగురు ముత్తైదువులను పిలుచుకోవాలి వారు ఆ రోజు తలస్నానం చేసి భోననానికి రావాలి. వాయనం ఆరు ప్లేట్లలో సర్థాలి. ఐదు పూర్ణాలు లేక మూడు పూర్ణాలు, రెండు గారెలు పెట్టవచ్చు. ఐదు పోగుల తోరం, ఒకటి వాయనం గౌరీదేవికి, పొంగలి, టెంకాయ, నైవేద్యం నివేదించి గౌరీదేవి షోడశోపేతంగా పూజ చేసి వ్రత కథ చదువుకుని అక్షింతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్నవి తీసుకుని తలపై వేసుకోవాలి. పూజ పూర్తయిన తరువాత నైవేద్యం గౌరీదేవి దగ్గర పెట్టిన ప్లేటులోని తోరం చేతికి కట్టుకుని ఇదుగురికి భోజనం వడ్డించి తరువాత ఒక్కొక్కరికి ఒక వాయనం ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు, తీసుకునేటప్పుడు.

ఇచ్చేవారు తీసుకునేవారు

ఇస్తి వాయనం పుచ్చుకుంటి వాయనం

ఇస్తి వాయనం పుచ్చుకుంటి వాయనం

ముమ్మాటికి ఇస్తి వాయనం ముమ్మాటికి పుచ్చుకుంటి వాయనం

వాయనం తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని

ఈ విధంగా ఐదుగురికి ఇవ్వాలి, అందరికీ తోరములు చేతికి చుట్టాలి, ముడి వేయకూడదు.

బియ్యంపిండితో ముద్దతో కుందిలా చేసి దాంట్లో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి, ఐదుగురి విస్తరాకుల ముందు పెట్టి వెలిగించాలి. అవి కొండెక్కిన తరువాత జ్యోతితో సహా చలిమిడిని తినాలి. నోము చెల్లించుకునే ముత్తైదువ నెయ్యి వడ్డించిన తరువాత భోజనం చేయాలి. ఐదు పోగులకు పసుపు రాసి, మూడు చోట్ల పూలు ముడివేసి, రెండు చోట్ల ముడి వేసి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ నోము పట్టడానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కాని పట్టవచ్చు. ఇలా పది సంవత్సరాలు చేసి ఉద్యాపన చెయ్యాలి.

Famous Posts:

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి

 

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

ఉండ్రాళ్ళతద్ది నోము, undralla taddi, undralla taddi telugu, undralla taddi date, undralla taddi katha in telugu pdf, thadiya nomu in telugu pdf, gowri pooja

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.