Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సింధు నది పుష్కరాలు - భక్తులు మోసపోకండి - అందరూ తప్పకుండా తెలుసుకొండి | Sindhu Nadi Pushkaralu 2021

సింధూ నది టిబెట్ లోని మానస సరోవరం, కైలాస పర్వతాల్లో ఉద్భవిస్తోంది. ఇది కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాక్ లోని డెమ్ చోక్ లో భారత్ లోకి ప్రవేశించి, అక్కడి నుంచి న్యోమ, లెహ్ , నిమూ, కల్సినిము, బాటాలిక్ వరకు భారత్ లో ప్రవహించి, అక్కడి నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా ప్రవహించి ,కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోంది.

సింధూ నది కశ్మీర్ లోయలో ప్రవేశించదు. కానీ సింధునది ఉప నదులు కశ్మీర్ లోయాలో ప్రవహిస్తాయి. అయితే కొన్ని టూరిస్టు ఏజెన్సీలు సింధూ పుష్కరాల సమయంలో ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోనే మార్గ్ లో ఉద్భవించిన ఒక వాగును కశ్మీరీలు సింధ్ గా వ్యవహరిస్తారు. ఈ వాగు షాధిపూరా అనే గ్రామం సమీపంలోని నారాయణ్ భాగ్ వద్ద జీలం నదిలో కలుస్తోంది. రెండు నదు కలిసే సంగమం కావడంతో యాత్రీకులు ఇక్కడే పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నిజానికి సింధునదీ లద్దాక్ మీదుగా పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రవేశిస్తుందనే విషయం మనం మర్చిపోరాదు.

మొన్నటి ఏప్రిల్ ఆరో తేదీన  బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించి రెండు నెలల వరకు ఉన్నాడు. తర్వాత మకర రాశిలోకి ప్రవేశించాడు.తిరిగి నవంబర్ 21న మరోసారి కుంభ రాశిలో ప్రవేశిస్తాడని అంటున్నారు. ఆ సమయంలో కూడా సింధునదికి పుష్కర వేడుకలు నిర్వహిస్తారు. అపుడు వెళ్లి పుష్కర స్నానాలు చేసి రావచ్చు.

ఈ ఏడాది సింధు పుష్కరాలు కావడంతో చాలా మంది యాత్రీకులు లద్దాక్ లో ప్రవహించే సింధునదీలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఇప్పుడు అక్కడ పర్యాటక రంగాన్ని పోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సింధునది పుష్కర స్నానాల కోసం లద్దాక్ బాట పట్టారు.

ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ..భక్తులు ఈ పుష్కరాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. లద్దాక్ ప్రసిద్ధిగాంచిన పర్యాటక క్షేత్రం. చుట్టూ ఎత్తైన పర్వతాలు.. లోయలు .. సరస్సులు .. పచ్చటి ప్రకృతి ఆకట్టుకుంటాయి.ఇక్కడ ఎన్నో మఠాలు, గురుద్వారాలున్నాయి. వాటితోపాటు నుబ్రాలొయ .. జంస్కర్ లోయలను, సరస్సులను చూడవచ్చు. మాగ్నటిక్ హిల్ అదనపు ఆకర్షణ. స్థానికంగా వాహనాలు అందుబాటులో ఉంటాయి. హోటళ్లకు కొదువలేదు. ఆంధ్రా .. తెలంగాణ నుంచి కూడా టూరిస్ట్  బస్సులు వెళుతుంటాయి.

కొంతమంది టూరిస్ట్ ఆపరేటర్లు సింధు పుష్కరాల సమయంలో యాత్రీకులను సింధునది వద్దకు తీసుకు వెళ్లకుండా బురిడీ కొట్టిస్తుంటారు. సోనీ మార్గ్ లో పుట్టిన ఒక వాగును కాశ్మీరీలు సింధుగా పిలుస్తుంటారు. అక్కడకి తీసుకెళ్లి స్నానాలు చేయించి పర్యాటకులను వెనక్కి తీసుకు వస్తుంటారు. గట్టిగా అడిగితే ఇది సింధు పాయ అని వాదిస్తుంటారు. ఇదిలా ఉంటే సింధు నది ఒడ్డున ప్రతి ఏడాది జూన్ లో సింధు దర్శన ఉత్సవం  జరుపుతారు. లద్ధాక్ లో ఈ వేడుకలు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తుంటారు.

అందువల్ల పుష్కర స్నానం చెయ్యడానికి, అవకాశం లేని దానికి పెద్దలు మార్గాంతరాన్ని సూచించారు. దాని ప్రకారము, కాశీకి గాని, హరిద్వార్ గాని వెళ్లి గంగా నదిలో, సింధు నదీ పుష్కర సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే, సింధుగూడ గంగ లోని ఒక పాయే గాబట్టి ఆ పుణ్యం వారికి లభిస్తుంది.

Famous Posts:

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

సింధు నది పుష్కరాలు, Sindhu river pushkaralu, sindhu river pushkaralu 2021 dates, sindhu river pushkaralu places, sindhu river pushkaralu 2021 places, sindhu river pushkaralu ghats, సింధు నది పుష్కరాలు ప్రదేశాలు, which river pushkaralu in 2021, sindhu river pushkaralu location, sindhu river pushkaralu dates

Comments