Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

భర్త దీర్ఘాయుష్షు కోసం స్త్రీలు పఠించాల్సిన స్తోత్రం | A hymn to preserve the welfare of women for the long life of the husband

సౌభాగ్యం అంటే భర్త మనసులో తన పట్ల సంపూర్ణ ప్రేమను కలిగి ఉండడం. అలాంటి సౌభాగ్యంతో పాటూ సుమంగళియోగం ఉండేందుకు నిత్యం ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే మంచిదని చెబుతారు పండితులు.

స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం

1:: నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే  

నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచll 

2:: నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ 

నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమఃll

3:: పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ  

జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణేll  

4:: పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః  

పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప..నమోస్తుతేll  

5:: క్షమస్వ భగవాన్..దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్  

పత్నిబంధో..దయాసింధో..దాసీదోషం క్షమస్వమేll 

6:: ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం

సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజll

7:: సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః

పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచll

బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ స్తోత్రాన్నిలక్ష్మీ, సరస్వతి, గంగ, భూదేవి, సావిత్రి, పార్వతి మున్నగు దేవతా మూర్తులు పఠించారు.

Click Here More Devotional Stotrams:

sowbhagyastotram, sowbhagya lakshmi ravamma lyrics, sowbhagya lakshmi stotram in telugu, lakshmi stotram pdf, sri lakshmi stotram, shodasa lakshmi stotram in english, vakshasthala lakshmi stotram, soubhagya laxmi ravamma lyrics

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు