లక్ష్మీప్రదమైన మాసం శ్రావణం : విశిష్టతలు
ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 29న ప్రారంభమై.. ఆగస్టు 27 వరకు ఉంటుంది. ఈ మాసంలోని (Sravana Masam 2022) సోమవారాల్లో మహిళలు ఉపవాసాలు ఉంటూ.. నోములు, వ్రతాలు, పూజలు చేస్తారు. ఈ ఏడాది శ్రావణంలో 5 సోమవారాలు ఉన్నాయి.
Also Read : శ్రావణ మాసం మొదటి సోమవారం ఈ పనులు చేయకండి.
శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో ఐదో నెల. జులై, ఆగస్టు నెలలో వస్తుంది శ్రావణం. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణం నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు. మరి కొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలు కానుంది. శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మికత వెల్లి విరుస్తుంది. నెల పాటు ఉదయం, సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి.
హిందూ సనాతన ధర్మం ప్రకారం, తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షాలు పడుతుంటాయి. వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణాన్ని చాలా పవిత్రమైన మాసంగా చెబుతారు. లక్ష్మీ దేవికి ప్రీతి పాత్రమైనదని పండితులు అంటారు. కొత్తగా పెళ్లైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును శ్రావణం దూరం చేస్తుంది. శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణం పేరుతో ఉన్న ఈ మాసంలో శ్రీ మహా విష్ణువుకు చేసే పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
అలాగే ఈ నెలను లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనదని కూడా అంటారు. అలాగే శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ నెలలో శివయ్యను పూజిస్తారు. ఈ మాసంలో చేసే పూజలకు, దైవ కార్యాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని అంటారు. పరమ శివుడికి ప్రతీ పాత్రమైన సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి కేశవునికి రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే పాపాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన నెల. మహిళలు పాటించే వ్రతాలు అన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉంటాయి. దీని వల్ల శ్రావణ మాసాన్ని వ్రతాల మాసం అని కూడా అంటారు. అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొంటారు. శ్రావణ మాసంలో ప్రతి రోజుకూ ఒక విశిష్టత ఉందని పండితులు అంటుంటారు. శుక్ల పక్షంలో వచ్చే 15 రోజులు ఎంతో వైశిష్ట్యం కలిగినవని ప్రతీతి. ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో ఉంది.
శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత
ఈ చాలా పవిత్రమైన శ్రావణ మాసంలో, తల్లి లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా ప్రవహిస్తుంది, కాబట్టి ఈ మాసం శ్రీ మహా లక్ష్మీ దేవి ఆరాధనకు అంకితం చేయబడింది.
మంగళవారాలు మరియు శుక్రవారాలు ఏవైనా దైవిక తల్లిని ఆరాధించడానికి రెండు ముఖ్యమైన రోజులు, మరియు శ్రావణ మాసంలో ఈ రోజులను పాటించడం మరింత శక్తివంతమైనది.
శ్రావణ మాసంలో విశేష పర్వదినాలు:
శ్రావణ మాసంలో జరుపుకునే ప్రధాన పండుగలు ఏమిటి?
నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ సోమవరం, మంగళ గౌరీ వ్రతం, శ్రీ కృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య శ్రావణ మాసంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలు.
Famous Posts:
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
శ్రావణ మాసం విశిష్టత, sravana masam, Importance of sravana masam, varalashmi vratam, august, august sravana masam
Good information - https://sakalam.org/shravana-masam/
ReplyDelete