Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఎటువంటి సర్పదోషాలు ఉన్నా భస్మం చేసే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి - Kukke Shree Subrahmanya Temple

మట్టిని ప్రసాదం గా ఇచ్చే సుబ్రమణ్యం స్వామి దేవాలయం

మృత్తికా_ప్రసాదం మట్టి_ప్రసాదం

మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .దిన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం.

మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

మృత్తికా ప్రసాదం వివరాలు.....

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

03. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

04. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

05. ఎ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

06. ఎ పిల్లలు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .అటువంటి పిల్లలకు స్తానం చేయిoచే సమయంలో వేడి నీటితో స్తానం చేయిoచిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దించి ఆ నీటితో పిల్లలకు స్నానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది.

07. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.

08. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంత్ర నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.

09. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చితిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రాద్దన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో అయెతే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వదలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభావిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.

సుబ్రహ్మణ్యం స్వామి  పూజించడం వల్ల వివాహం ఆలస్యం అయిన వాళ్ళకి వివాహం అవ్వడం,పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడం. కలసర్ప దోష నివారణ అవ్వుతుంది.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము

Kukke Shree Subrahmanya Temple, kukke subramanya temple online booking, kukke subramanya temple phone number, kukke subramanya temple timings, kukke subramanya pooja list, kukke subramanya temple pooja details, kukke subramanya temple today news

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు