Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

హారతులు ఎన్ని రకాలు? How many types of Arathi?

హారతులు ఎన్ని రకాలు 

సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా సశాసీ్త్రయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. ఇవి పలురకాలు

1. ఏక హారతి

ప్రతిదీ ఒకేవిధంగా ఉండడానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏక హారతి. ఇది నదుల్లోని ఔషధగుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది.

2. నేత్రహారతి

దివ్యస్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి. దీనివల్ల సమస్త దృష్టిలోపాలు తొలగిపోతాయి.

3. బిల్వహారతి

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది. మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తినిస్తుంది.

4. పంచహారతి

ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి. ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి కాపాడబడాలని ఇచ్చే హారతి.

5. సింహ హారతి

ఇది ప్రతి ఒక్కరూ విజయశిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి.

6. రుద్ర హారతి

రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.

7. చక్రహారతి 

చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు.

8. నవగ్రహ హారతి

మన జీవితాల్ని నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ హారతి పడతారు.

9. కుంభహారతి

ప్రతి మంచి పనికీ స్వాగతం పలకడానికి, నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతి పడతారు.

10. నృత్యహారతి

పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. నృత్యం జీవచైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్య హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.

11. రథహారతి

ద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథహారతి.

12. వృక్షహారతి

సమస్త వృక్షసంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి.

13. నాగహారతి

సంతాన లోపాలు, కాలసర్పదోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి.

14. ధూపహారతి

భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమిమీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి.

15. అఖండ కర్పూర హారతి

సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి

16. నక్షత్ర హారతి

ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి..

Famous Posts:

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

హారతులు, how to do aarti at home, aarti, science behind aarti, aarti song, types of aarthi

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు