Drop Down Menus

జాతకంలో రవిగ్రహ దోష నివారణకు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం..| Aditya Hrudayam With Telugu Lyrics ana Meanings

జాతకంలో రవిగ్రహ దోష నివారణకు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం..

సూర్యరశ్మి సోకకపోతే చర్మ వ్యాధులు ప్రబలుతాయి. ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిష్టగా ప్రతిరోజూ పఠిస్తారో వారికి ఎటువంటి రుగ్మతలు కలగవు. సమస్త గ్రహ దోష నివారణార్ధం ఆదిత్య హృదయం చదవాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల జాతకంలో సూర్య సంబంధిత దోషాలు నివారించుకోవచ్చు. రోగములు తగ్గి పూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయారుచేసిన ఆహారప దార్థములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

పాపాలను, శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుశ్యును పెంచే అమోగమైన అక్షర సాధనం అదిత్య హృదయం. ఈ అమోగమైన స్తోత్రరాజాన్ని శ్రీ రామ చంద్రునికి ఆగస్త్యమహర్షి మంత్రాల వంటి మాటలతో వివరించాడు.అదిత్య హృదయము మహాపవిత్రమైన గ్రంధము. శ్రీమద్‌ రామాయణ మహాకావ్యమందలి యుద్దకాండలో 105వ సర్గలో సూర్యభగవానుని స్తుతికి ‘‘ఆదిత్య హృదయం’’ అని నామకరణం చేశారు.

సంతానం లేనియి ‘‘ఆదిత్య హృదయము’’ ను నిత్యము పారాయణము చేసినచో వారికి సంతానము కలుగును.న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టు చుట్టు తిరుగుతూ సతమతం అయేవారు. దీనిని పారాయణ ము చేసినచో వారికి విజయం కలుగుతుంది. కఠిక దారిద్రంచే భాద పడుచున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే సకల అష్ట ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. ఆనారోగ్య రుగ్మతలతో భాదపడుచున్నివారు అదిత్య హృదయమును పారాయణము చేసినచో వారి రోగాలు మాయమగును. వ్యాపారస్తులు పారాయణము చేసినచో వారివ్యాపారం అభివృద్ధిచెంది ధనం సమకూరుతుంది. నిరుద్యోగులు పారాయణము చేస్తే వారికి మంచి ఉద్యోగం లబిస్తుంది. విద్యార్ధులు పారాయణము చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. కుటుంబ కలహాలతో భాదపడేవాడు పారాయణము చేసినచో వారికి మేలు జరుగును.

ఆదిత్య హృదయం రామ,రావణ సంగ్రామములో వెలువడింది. ఆమోగమైన తపశ్శక్తి కలిగిన రావణసురున్ని వధించడానికి శ్రీరామునికి శక్యము కాలేదు. రావణుడు చావు లేకుండునట్లు అనేక వరములు పొందడం వల్ల శ్రీరామునకు రావణాసుర వధ వీలు కాలేదు. శ్రీరాముడు ఎన్ని ఆస్త్ర శస్తమ్రులను ప్రయోగించినను రావణుడు చావలేదు.దీనితో శ్రీరాముడు చింతాకాంతుడెై ఉండెను. రామరావణ యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి ఆగస్త్య మహాముని శ్రీరామునిచేరుకొనియిట్లనియే.

ఓరామ!నీకు మహీ పవిత్రమైన రహస్యమును చెప్పెదను వినుము. మహా పుణ్యప్రదము, జయప్రదము, మంగళకరము, శుభ కరము, సమస్త పాపాలను నశింపజేయు, దీర్ఘ ఆయుషును కులుగజేయు అదిత్య హృదయమును నీకు ఉపదేశించెదను. దీని వల్ల నీవు యుద్ధమును, రావణున్ని సులభంగా జయించగలవు.

శ్రీరాముడు భక్తితో  ఆదిత్య హృదయమును మూడు సార్లు పఠించగా ఆ పరమాత్ముడు అనందించినవాడెై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడెై శ్రీరాముని జూచి ‘‘ఓ రామా! రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది.’’ అలస్యం చేయక త్వరపడుము అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారము జరిగి లోక కళ్యాణము జరుగుతుంది. బయటి శత్రువులనే కాక అంతశ్శత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయము ఆమోగమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు.తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ఇచ్చే భాస్కరుని నమ్ముకుంటే ఎవరికి ఏమి లోటు ఉండదనెను.

1. తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం |

రావణంచాగ్రతో దృష్వా – యుద్దాయ సముపస్థితమ్‌ ||

అర్థము : యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.


2. దైవతైశ్చ సమాగమ్య – ద్రుష్టు మభాగ్యతో రణం |

అర్థము : ఉపగమ్యాబ్రవీ ద్రామ – మగస్త్యో భగవాన్‌ ఋషి: ||

యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.


3. రామ రామ మహాబాహో – శృణుగుహ్యం సనాతనం |

యేనసర్వా నరీ న్వత్స – సమరే విజయిష్యసి ||

అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.

4. ఆదిత్యహృదయంపుణ్యం – సర్వశత్రువినాశనం |

జయావహం జపేన్నిత్యం – మక్షయ్యం పరమం శుభమ్‌ ||

అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.


5. సర్వ మఙ్గలమాఙ్గల్యం – సర్వపాపప్రణాశనం |

చిన్తాశోకప్రశమన – మాయుర్వర్ధన ముత్తమమ్‌ ||

అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.


6. రశ్మిమన్తం సముద్యన్తం – దేవాసురనమస్కృతం |

పూజయస్వ వివస్వన్తం – భాష్కరం భువనేశ్వరమ్‌ ||

అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.


7. సర్వదేవాత్మకో హ్యేష – తేషస్వీ రశ్మిభావన: |

ఏష దేవాసురగణాన్‌ -లోకా న్పాతి గభ స్తిభి: ||

అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.


8. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ – శివ స్స్కన్ధ: ప్రజాపతి: |

మహేన్ద్రో ధనద: కాలో – యజు స్సోమో హ్యపాంపతి: ||

అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు


9. పితరో వసస్సాధ్యా – హశ్శినౌ మరుతో మను: |

వాయు ర్వహ్ని: ప్రజా: ప్రాణా – ఋతుకర్తా ప్రభాకర: ||

అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.


10. ఆదిత్య స్సవితా సూర్య: – ఖగ: పూషా గభస్తిమాన్‌ |

సువర్ణసదృశో భాను: – స్వర్ణరేతా దివాకర: ||

అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.

11. హరిదశ్వ స్సహస్రార్చి – స్సప్తసప్తి ర్మరీచిమాన్‌ |

తిమిరోన్మథన శ్శంభు – స్త్వష్టా మార్తాణ్డ అంశుమాన్‌ ||

అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.


12. హిరణ్య గర్భ శ్శిశిర – స్తపనో భాస్కరో రవి: |

అగ్ని గర్భో దితే:పుత్ర – శ్శంఖ శ్శిశిరనాశన: ||

అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.


13. వ్యోమనాథ స్తమోభేదీ – ఋగ్యజుస్సామపారగ: |

ఘనవృష్ఠి రపాంమిత్రో – విన్ద్యవీథీప్లవఙ్గమ: ||

అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.


14. ఆతపీ మణ్డలీ మృత్యు: – పింగల స్సర్వతాపన: |

కవిర్విశ్వోమహాతేజా – రక్త స్సర్వభవోద్భవ: ||

అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.


15. నక్షత్రగ్రహతారాణా – మధిపో విశ్వభావన: |

తేజసా మపితేజస్వీ – ద్వాదశాత్మ న్నమోస్తుతే ||

అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.


16. నమ: పూర్వాయ గిరయే – పశ్చిమే గిరయే నమ: |

జ్యోతిర్గణానాం పతయే – దినాధిపతయే నమ: ||

అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


17. జయాయ జయభద్రాయ – హర్యశ్వాయ నమో నమ: |

నమో నమ స్సహస్రాంశో – ఆదిత్యాయ నమో నమ: ||

అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


18. నమ ఉగ్రాయ వీరాయ – సారఙ్గాయ నమో నమ: |

నమ: పద్మప్రబోధాయ – మార్తాణ్డాయ నమో నమ: ||

అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


19. బ్రహ్మేశానాచ్యుతేశాయ – సూర్యా యాదిత్యవర్చసే |

భాస్వతే సర్వభక్షాయ – రౌద్రాయ వపుషే నమ: ||

అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


20. తమోఘ్నాయ హిమఘ్నాయ – శత్రుఘ్నా యామితాత్మనే |

కృతఘ్నఘ్నాయ దేవాయ – జ్యోతిషాం పతయే నమ: ||

అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.

21. తప్తచామీకరాభాయ – వహ్నయే విశ్వకర్మాణే |

నమస్తమోభినిఘ్నాయ – రుచయే లోకసాక్షిణే ||

అర్థము : బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.


22. నాశయ త్యేష వైభూతం – త దేవ సృజతిప్రభు: |

పాయత్యేష తపత్యేష – వర్స త్యేష గభస్తిభి: ||

అర్థము : రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.


23. ఏష సుప్తేషు జాగర్తి – భూతేషు పరినిష్ఠిత: |

ఏష చైవాగ్నిహోత్రఞ్ఛ – ఫలంచై వాగ్ని హోత్రిణామ్‌. ||

అర్థము : ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.


24. వేదాశ్చక్రతవశ్చైవ – క్రతూనాం ఫల మేవ చ |

యాని కృత్యానిలోకేషు – స ర్వ ఏషరవి: ప్రభు: ||

అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.


25. ఏనమాపత్సుకృచ్ఛ్రేషు – కాన్తారేషు భయేషు చ |

కీర్తయ న్పురుష: కశ్చి – న్నావసీదతి రాఘవ ||

అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.


26. పూజాయ స్వైన మేకాగ్రో – దేవదేవం జగత్పతిత్‌ |

ఏత త్త్రిగుణితం జప్త్వా- యుద్దేషు విజయిష్యసి ||

అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.


27. అస్మిన్‌ క్షణే మహాబాహో – రావణం త్వం వధిష్యసి |

ఏవముక్త్వాతదా గస్త్యో – జగామ చ యథాగతమ్‌ ||

అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.


28. ఏత చ్ఛ్రుత్వా మహాతేజా – నష్టోశోకో భవ త్తదా |

ధారయామాస సుప్రీతో – రాఘవ: ప్రయతాత్మవాన్‌ ||

అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.


29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు – పరంహర్ష మవాప్తవాన్‌ |

త్రిరాచమ్య శుచిర్భూత్వా – ధను రాదాయ వీర్యావాన్‌ ||

అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.


30. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌ |

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్‌ ||

అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.

31. ఆథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమానా: పరమం ప్రహృష్యమాణ: |

నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచ స్త్వరేతి ||

అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.

Famous Posts:

Tags : ఆదిత్య హృదయం, Aditya Hrudayam in Telugu, Aditya Hrudayam, Aditya Hrudayam Lyrics, Aditya Hrudayam Pdf

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.