కర్మలు - కర్మ ఫలాలు వాటి పలితాలు | facts about Karmalu - Karma phalalu

కర్మలు - కర్మఫలాలు

‘కర్మలు' అంటే మనం చేసే " పనులు ”. 'కర్మఫలాలు' అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే “ఫలితాలు”.

కర్మలలో, అంటే మనం చేసే పనులలో 3 రకాలు

1) పాపకర్మలు 2) పుణ్యకర్మలు 3) సత్యకర్మలు

1. పాపకర్మ: ఇతర ప్రాణికోటికి మనం ఉద్దేశ్యపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ. అంటే “హింస చేస్తే” పాపం వస్తుందన్నమాట.

2. పుణ్యకర్మ: ఇతర ప్రాణికోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ పేరే 'పుణ్యకర్మ'. నేను అన్న భావనతో " సేవ ” చేస్తే “ పుణ్యం ”వస్తుంది.

3. సత్యకర్మ: ఇతర ప్రాణికోటికి మనం ఏదీ ఆశించకుండా, మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే “నిస్వార్థ సేవ పేరే 'సత్యకర్మ'. ఏమీ “ఆశించకుండా” నిష్కామంగా చేసే సేవ వలన “సత్యకర్మ” ఫలితం వస్తుంది.

సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి వుంటుంది. కనుక కర్మలు, అది పాపమైనా, పుణ్యమైనా “ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నాము? అన్న దాని మీద మన “వాస్తవాలు” ఆధారపడి ఉంటాయి.

కర్మలు, వాటి ఫలితాలు ఈవిధంగా ఉంటాయి

హింస ద్వారా 'పాపకర్మ' వస్తుంది.

తద్వారా 'రోగం' అనుభవించవలసి వస్తుంది.

సేవ ద్వారా 'పుణ్యకర్మ' వస్తుంది.

తద్వారా 'భోగం' అనుభవించవలసి వస్తుంది.

నిస్వార్థ సేవ ద్వారా 'సత్యకర్మ' వస్తుంది.

Famous Posts:

Tags: కర్మలు, కర్మ ఫలాలు, కర్మలు ఎన్ని రకాలు, Karma siddhantam, karmalu, karma phalalu telugu, karmalu types telugu, karmalu telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS