ఈ శుభలక్షణాలన్నీ వున్న స్త్రీని జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి - Should a woman with all these good qualities be taken care of and married
స్త్రీల శుభాశుభ లక్షణాలు..
బ్రహ్మచర్యాశ్రమాన్ని ముగించిన స్నాతకుడైన శిష్యుడు వేదాధ్యయనం పూర్తయిన తరువాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. స్నాతకుడిగా ఇంటికి వచ్చిన బ్రహ్మచారిని ఇంట్లోని వారు పూలమాలవేసి లోపలికి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి మధుపర్కాలు ఇవ్వాలి.
తరువాత అతడికి వివాహం చేయటం కోసం శుభలక్షణాలున్న కన్యని వెతకాలి. ఈ శుభలక్షణాలన్నీ వున్న స్త్రీని జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి.
స్త్రీల శుభలక్షణాలు :
* ఎర్రగా కలువ పూలలాంటి కాంతులతో ప్రకాశిస్తూ, నడిచేడప్పుడు కాలికీ నేలకీ మధ్య ఖాళీలేకుండా సమతులంగా వున్న పాదాలు ఏ స్త్రీకి వుంటాయో ఆ స్త్రీ సుఖభోగాలు లభిస్తాయి.
* కాలి మడమలు నున్నగా సమంగా వుండే స్త్రీ ధనవంతురాలవుతుంది. మెడమీద నాలుగు అంగుళాల వెడల్పుతో మూడు రేఖలు స్పష్టంగా కనిపించే వనిత అధికారిణి అవుతుంది. పగిలిన, ఉబ్బిన పాదాలు దారిద్ర్యానికి సంకేతాలు.
* కాలివేళ్ళు ఒకదానితో ఒకటి పరస్పరం తగులుతూ గుండ్రంగా నున్నగా వుండి, చిన్న గోళ్ళు కలిగివుంటే ఆ స్త్రీ ఐశ్వర్యవంతురాలవుతుంది.
* కాలివేళ్ళు చిన్నగా వుంటే మంచిది కానీ వాటిమధ్య దూరం ఎక్కువగా వుంటే ధనలక్ష్మి క్షీణిస్తుంది. చేతులు :
* స్త్రీ చేతి రేఖలు మెత్తగా, లోతుగా, గులాబీ రంగులో వుంటే భోగాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఆ స్త్రీ భోగాల్ని అనుభవిస్తుంది కూడా.
* అదే హస్తంలోని రేఖలు తేలిపోతూ ముక్కలుగా వుంటే దరిద్రం పడుతుంది. చిటికెనవేలు మూల నుంచి చూపుడువేలు చివరిదాకా ఒక రేఖ గనుక అరచేతిలో వుంటే ఆ స్త్రీ నూరేళ్ళు జీవిస్తుంది.
* చేతి చిటికెనవేళ్ళు గుండ్రంగా, పొడుగ్గా, సన్నగా పక్క వేలితో కలిపి వుంచితే ఏమాత్రం సందులేకుండా ఎర్రని రంగులో వుంటే ఆ స్త్రీ ఎన్నో సుఖభోగాల్ని పురుషుడికి అందిస్తుంది.
* ఎర్రగా ఎత్తుగా నున్నగా గోళ్ళు వున్న స్త్రీ ధనకారకురాలవుతుంది.
* రెండు చేతులూ సమానంగా లేకుండా తగులుతూ పగిలి పోయివుంటే ఆ స్త్రీ కష్టాలు అనుభవిస్తుంది.
* వేళ్ళ మధ్య సందులు సమానంగా వుండి యవధాన్యం గింజలు గుర్తులు కలిగివుండే స్త్రీకి అపారమైన సుఖాలు, అక్షయంగా ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి.
* ఎర్రగా నున్నగా పొట్టిగోళ్ళు వున్న పడతి సౌభాగ్యవతి ధనవంతురాలు అవుతుంది.
* స్త్రీకి గోళ్ళు పొడవుగా వుంటే కొడుకులు పొట్టిగా వుంటే తల్లి ఐశ్వర్య వంతులవుతారు.
మెడ
*స్త్రీకి మెడ బలహీనంగావుంటే బీదరాలవుతుంది. బాగా పొడవైన మెడవున్న స్త్రీ ఎంతో మంది పురుషులతో సాంగత్యాన్ని కోరుతుంది. మెడ మరీ చిన్నగా వున్నా మంచిదికాదు. అలా వుంటే ఆ స్త్రీకి సంతాన నష్టం జరుగుతుంది. మెడ పక్కగా వచ్చే భుజాలు పొట్టిగా గుండ్రంగా పుష్టిగావుంటే స్త్రీ దీర్ఘాయువు పొందుతుంది. తన భర్త ఆయుష్షుని కూడా పెంచుతుంది.
ఇతర అంగాలు :
* స్త్రీకి నాసిక (ముక్కు) ఎటువంటి ఎగుడుదిగుడు లేకుండా సమతులంగా వుంటే సౌభాగ్యవతి అవుతుంది. అదే విధంగా రెండు కనుబొమలూ |కలవకుండా విల్లులాగా ఒంపులు తిరిగి సన్నగా వుండాలి. ఆమె కేశాలు కూడా నల్లగా ఒత్తుగా వుండాలి. అలా వున్న స్త్రీ సౌభాగ్యాల్ని భర్తకు కుటుంబానికి అందిస్తుంది. కోయిల, వీణ, భ్రమరం (తుమ్మెద) వేణువులతో సమానమైన గొంతు కలిగిన స్త్రీలు సుఖసంపదలకి నిలయాలుగా భాసిస్తారు. ఇది కాకుండా గాడిద, కాకి, కంచులాంటి స్వరాలు కలిగిన స్త్రీలకి రోగాలు, భయం, శోకం, దరిద్రం వంటివి కలుగుతాయి.
స్త్రీల నడక : స్త్రీల నడక హంసలాగా, ఆవులాగా వృషభంలాగా, చక్రవాకంలాగా, ఏనుగులాగా వుంటే వారు తమ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తీసుకువస్తారు. రాణీ భోగాలనుభవిస్తారు. కుక్కలాగా, నక్కలాగా నడిచేస్త్రీలు నిందలకి గురౌతారు. లేడిలాగా నడిచేస్తే దాసీ అవుతుంది. ఆగి ఆగి నడిచే స్త్రీ బంధకి అవుతుంది. శరీరంలో వున్న అన్ని అంగాలు కోమలంగా వుండి అధికంగా చెమట పట్టకుండా, రోమాలు లేకుండా వుండే స్త్రీ అందరిచేతా పూజించ బడుతుంది. గౌరవించబడుతుంది.
పింగళవర్ణం(పసుపు)తో, కపిల వర్ణంతో వుండేది. అన్ని అంగాలు పెద్దవిగా కనబడేది. ఎక్కువగా మాట్లాడేది అయిన స్త్రీని వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకునే స్త్రీ పేరుని కూడా పరిశీలించి చేసుకోవాలి. నక్షత్రం, వృక్షం, నది, పర్వతం, పక్షి సర్పం లాంటి పేర్లు కలిగిన స్త్రీని పెళ్ళాడకూడదు. శరీరాంగాలు సమతుల్యంగా వుండి, మంచిపేరు కలిగి, సన్నని రోమాలు కలిగి, హంస లేక ఏనుగులా నడిచేదానిని, నల్లగా మెరిసే కేశపాశాలు, తెల్లగా మెరిసే దంతాలు కలదానిని వివాహం చేసుకోవాలి.
ఈ శుభలక్షణాలన్నీ వున్న స్త్రీని జాగ్రత్తగా చూసుకుని వివాహం చేసుకోవాలి. శారీరక లక్షణాలకన్నా సదాచారాన్ని పాటించేవారి వైపే మొగ్గు చూపాలి. అందమైన శరీరాకృతి వున్నా ఉత్తమ సంస్కారంలేని కన్యని పెళ్ళి చేసుకోకూడదు.
Famous Posts:
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
Tags: స్త్రీ, వివాహం, Vivaham Kosam Stree, Vivaham Telugu, Stree Lakshanalu Telugu, Vivaha Lakshanalu Telugu, Women Marriage
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment