Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మాఘ మాసం విశిష్టత - ఈ మాసంలో ఏ పనులు చేయాలి? Magha Masam Importance Telugu

మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనది.

కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత....అంత ప్రాధాన్యత!

హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసములో నదీస్నానము చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది.

ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం. ఆ తరువాత సూర్య భగవానుడికి పూజ విశేషం.

దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం "

అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విశేషం.

పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.

స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది.

ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను.

ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి.

అసలు మాఘ మాసం లో ప్రతి వారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.

అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరు ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా , సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి.

కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.

అలాగే ఈ మాసంలో రథ సప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

మాఘమాస శుద్ధ షష్ఠి, మందారషష్ఠి, కామ షష్ఠి, వరుణ షష్ఠి రోజు వరుణ దేవుడిని మందారం వంటి ఎర్రపూలతో, ఎర్ర చందనంతో పూజిస్తారు. మాఘ మాస శుద్ధ సస్తమి రథ సప్తమి రోజు చేసే సూర్యారాధనకు ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. మాఘమాస శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని.. ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియచేసాయి.

Click hereమాఘ పురాణం అధ్యాయములు  1 నుంచి 30 వరకు

Tags: మాఘమాసం, మాఘమాసం విశిష్టత, Magha Masam, Magha Masam Pooja Vidhanam, Magha Stanam, Magha Masam Visistata Telugu, Maghapuranam, Magha Masam Importance Telugu

Comments