జన్మనక్షత్రమున చేయదగిన కార్యములు
జన్మ నక్షత్రమున అన్న ప్రాశనము, అక్షరాభ్యాసము, చౌళము, ఉపనయనము, నిషేకము, వ్యవసాయము, భుసంపాదన, మొదలగునవి శుభము. స్త్రీకి జన్మనక్షత్రమున వివాహము చేయుట మంచిది. పురుషులకు జన్మ నక్షత్రమున ఉపనయనము మంచిది.
వారశూలలు -- శని సోమ వారములు తూర్పునకు, దక్షణమునకు గురువారము, పడమరకు ఆది శుక్రవారము ఉత్తరమునకు బుధ మంగళవారములు వారశూలలు. ఆ వారములలో ఆదిక్కునకు ప్రయాణము చేయరాదు.
తిధి శూలలు -- తూర్పునకు- పాడ్యమి, నవమి, తిదులలోను, ఉత్తరమునకు, విదియ, దశమి యందును, ఆగ్నేయమునకు, తదియ ఏకాదశి యందును, నైరుతి దిక్కునకు చవితి ద్వాదశి తిదులయండును, దక్షినమునకు పంచమి త్రయోదశి యందును, పడమరకు, షష్టి, చతుర్దశి యందును, వాయువ్యమునకు, సప్తమి, పున్నమి యందును, ఈశాన్యమునకు, అష్టమీ, అమావాస్యలయందును, ప్రయాణము చేయరాదు.
యాత్రా ( ప్రయాణ ) విషయములు. --- పాడ్యమి యందు కార్య నాశనము, విదియ ధన లాభము, తదియ యందు శుభము, చవితి యందు సంకటము , పంచమి నాడు, శుభము, షష్టి కలహము, సప్తమి ధనలాభము, అష్టమి కార్యనాశనము, నవమి విచారము, దశమి శుభము, ఏకాదశి కార్యజయము, ద్వాదశి కార్యనాశనము, త్రయోదశి శుభము, చతుర్దశి మరణము, పున్నమి అమావాస్యలలో కార్యనాశనము జుగును. ఈవిషయములు గమనించి ప్రయాణము చేయవలెను.
Tags: జన్మ నక్షత్రము, Janmanakshatra, Telugu Horoscope, Birth Star, Name Star, Birch Horscope, Nakshatram
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment