Drop Down Menus

అక్టోబర్ 28న చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు - Lunar Eclipse 2023 Date & Time

చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందంటే:

ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి సంభవిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుతున్నారు. ఖగోళ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 29 ఉదయం 01:05 గంటలకు ప్రారంభమై.. 02:24 గంటలకు ముగుస్తుందన్నారు.

ఈ సారి ఏర్పడబోయే చంద్రగ్రహణం అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై 02:22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం యెుక్క మొత్తం వ్యవధి 1 గంట 16 నిమిషాలు. భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి దాని సూతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు నిషేదించడం జరిగింది. ఈ సూతక్ కాలంలో ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయరు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు.

చంద్రగ్రహణం సూతక కాల సమయం:

చంద్రగ్రహణం సూతక కాలం 09 గంటల ముందే ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే భారత్‌లో ఈ చివరి చంద్రగ్రహణం దృశ్యమానత కారణంగా సూతక కాలం  అక్టోబర్ 28 సాయంత్రం 04:05 నుంచి చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

చంద్రగ్రహణంలో సూతక కాలం నియమాలు:

గర్భిణీ స్త్రీలు గ్రహణ సూతకాల సమయంలో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువుల ముట్టుకోకపోవడం చాలా మంచిది.

సూతకాల సమయంలో పాలు, పెరుగు, నీరు తాగకపోవడం చాలా మంచిది.

ఈ సమయంలో దేవుడి విగ్రహాలను పూజించడం మానుకోవాలి.

గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరుపుకోవద్దు.

Click here: అక్టోబర్ 28న చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారికీ అనుకోని అదృష్టం

Tags: చంద్రగ్రహణం, Chandra Grahan 2023, Chandra Grahan, Lunar Eclipse 2023

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.