Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మన పండుగల గొప్పతనం తెలుసుకోండి..!! Know the greatness of our festivals..!!

మన పండుగల గొప్పతనం తెలుసుకోండి..!!

ఉగాది:-

కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

శ్రీరామ నవమి:-

భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

అక్షయ తృతీయ:-

విలువైన వాటిని  కూడబెట్టుకోమని.

వ్యాస (గురు) పౌర్ణమి :- 

జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

నాగుల చవితి;-

ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

వరలక్ష్మి వ్రతం :- 

నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

రాఖీ పౌర్ణమి:-

తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

వినాయక చవితి ( నవరాత్రులు ) :-

ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

వరలక్ష్మి వ్రతం :-

నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

రాఖీ పౌర్ణమి:-

తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

పితృ అమావాస్య:-

చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.

దసరా ( ఆయుధ పూజ)  :-

ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

దీపావళి :-

పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

కార్తీక పౌర్ణమి :-

చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

సంక్రాంతి :-

మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

మహాశివరాత్రి :- 

కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

హోలీ :- 

వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే

👉రెండు ఏకాదశిలు,

👉సంకష్ట హర చతుర్థి,

👉మాస శివరాత్రి,

👉ప్రాదోశ వ్రతం,

ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి..

ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.

ఇదే మన ధర్మం గొప్పతనం. హిందువులమని గర్విద్దాము . హిందువులుగా జీవిద్దాము..

Tags: Pandugalu, Festivals, Ugadi, Holi, Diwali, Karthika Masam, Masa sivaratri, Chavithi, Dasami

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు