Drop Down Menus

కాశీ విశ్వనాథాష్టకమ్ - ఈ స్తోత్రం పాటించేవారికి సర్వపాపములు నశించును | Sri Vishwanatha Ashtakam Telugu Lyrics

కాశీ విశ్వనాథాష్టకమ్

గంగా తరంగ రమణీయ జటా కలాపం

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం

నారాయణ ప్రియమనంగ మదాపహారం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  1 

వాచామగోచరమనేక గుణ స్వరూపం

వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం

వామేణ విగ్రహ వరేన కలత్రవంతం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  2 

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం

వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  3 

సీతాంశు శోభిత కిరీట విరాజమానం

బాలేక్షణాతల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  4 

పంచాననం దురిత మత్త మతంగజానాం

నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం

దావానలం మరణ శోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  5 

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం

ఆనంద కందమపరాజిత మప్రమేయం

నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  6 

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం

పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ

ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  7

రాగాధి దోష రహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్  8 

వారాణసీ పుర పతే స్థవనం శివస్య

వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం

సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||

Tags: కాశీ విశ్వ నాధాష్టకమ్, Vishwanathashtakam, Kasi Vishwanathashtakam, Shiva Stotrams

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.