12 మంది ఆళ్వార్లు.
ధనుర్మాసం ప్రారంభం అయిన శుభ సందర్భంగ 12 మంది శ్రీవైష్ణవ ఆళ్వారుల చరిత్ర ( అందరికి అర్థం అయ్యే విధంగా క్లుప్తంగా)..
శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువునుకీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు.
వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాధలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు.
ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం.
ఆళ్వారులు అంటే... భక్తి అనే సముద్రపు లోతులను సంపూర్ణంగా తెలిసినటువంటి వారు ఆళ్వార్లు.. అంటే 'దైవ భక్తి లో మునిగి ఉన్నవారు' అని అర్థం. వారు శ్రీమన్నారాయణుని ఆరాధనా సంకీర్తనాదులలో పరవశించి ఉన్నందున వారికి ఆళ్వారులు అన్న పేరు వచ్చింది.
ఒక సిద్దాంతం ప్రకారం ..ఆళ్వార్లు 11 మంది అని అంటారు..ఆ 11 ఆళ్వారుల పేర్లుగల - వారు (1) పొయ్గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్.
ఉడయవర్ (రామానుజాచార్యులు)ను ఈ జాబితాలోంచి తొలగించి పదుగురు ఆళ్వారులు అనికూడా అంటారు.
ఉడయవర్ బదులు మధుర కవి మరియు గోదాదేవి పేర్లు కూడ జోడించి మొత్తం పన్నిద్దరు ఆళ్వార్లని చెబుతారు. ('శ్రీ', 'భక్తిసార' అనే పదాలను విడదీసి 'శ్రీ' అనగా అండాళ్ అని కూడా వివరించడం జరుగుతుంది.
ఒకోమారు మధుర కవిని కలుపకుండా అండాళ్ను మాత్రమే జాబితాకు జోడించి పన్నిద్దరు ఆళ్వారులని లెక్క కట్టడం కూడా కద్దు.
అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు, వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
1. పొయ్గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి
2. పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి
3. పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి
4. పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు
5. తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు
6. కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు
7. తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు
8. తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు
9. తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి
10. ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)
11. ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి
12. నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని.
ఆళ్వారుల కాలం గురించి నిర్దిష్టమైన ఆధారాలు లేవు. వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాధలు.
కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు.
Tags: ఆళ్వారు, 12 Alwars History, Alwars, 12 Alwargal List, Life History of the Alwars, 12 Alwars, History of Alvars, Thirumangai Alvar, Kulasekara Alwar,