Drop Down Menus

దక్షిణామూర్తి స్తోత్రం శ్రీ దక్షిణామూర్తికి అంకితం చేయబడిన అత్యంత విశిష్టమైన స్తోత్రం - Dakshinamurthy Stotram

దక్షిణామూర్తి స్తోత్రం శ్రీ దక్షిణామూర్తికి అంకితం చేయబడిన అత్యంత విశిష్టమైన స్తోత్రం.

హిందూ సంప్రదాయంలో వివిధ దేవుళ్లకు అంకితం చేయబడిన అనేక స్తోత్రాలు ఉన్నప్పటికీ, దాని లోతైన అర్థం కారణంగా ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది, ఇది ఆత్మను (అంతిమమైనది) అర్థం చేసుకోవడంలో అంతర్లీన భావనను వివరిస్తుంది.

ఈ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భక్తుడికి ఐశ్వర్యాన్ని మరియు ఇతర ప్రాపంచిక సుఖాలను ప్రసాదించే అనేక శ్లోకాలలా కాకుండా, దక్షిణామూర్తి స్తోత్రం అజ్ఞానం అంటే ఏమిటో, భ్రమ అంటే ఏమిటో, ప్రాపంచిక బంధాల నుండి ఎలా విముక్తి పొందగలదో తెలియజేస్తుంది. సిద్ధిని పొందే మార్గంతో.

భగవంతుడు దక్షిణామూర్తి మహిమను ప్రతిబింబించడం ద్వారా, భక్తునిలో జ్ఞానోదయం, జ్ఞానం మరియు అంతిమ (ఆత్మ) భావనను తీసుకురావడంలో స్టోరం ఉద్ఘాటిస్తుంది. సర్వోన్నతుడైన శివునిలో మరింత లీనమవడం.

దక్షిణామూర్తి స్తోత్రం:--

శాంతిపాఠః

ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం

యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |

తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం

ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||

ధ్యానమ్

ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం

వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | 

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం

స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం

జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |

గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే |

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |

గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||

చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |

సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||

ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే |

వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||

అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |

శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |

యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ |

మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |

యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం

ఙ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |

జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః

స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |

మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోప సంహరణతో యో‌உభూత్సుషుప్తః పుమాన్ |

ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి

వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |

స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 

భూరంభాంస్యనలో‌உనిలో‌உంబర మహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో

తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే

తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |

సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః

సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ||

తాత్పర్యం :-

   ఆత్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వేదవిదులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీదక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.

మర్రిచెట్టు క్రింద కూర్చొని తనచుట్టూ ఉన్న మహర్షులకు ఆత్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసారదు:ఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతనూ గురువుగా కొలవబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు.

ఆహా! ఎంత ఆశ్చర్యకరం! యువకుడైన గురువుచుట్టూ వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు. గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నారు.

భవరోగ బాధితులకు వైద్యుడై జగద్గురువై, జ్ఞానస్వరూపంగా ప్రకాశించే దక్షిణామూర్తికి నమస్కృతులు.

నిత్యశుద్ధుడవై, ప్రశాంతస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్ధంగా భాసిస్తూ, నిర్మలుడైన దక్షిణామూర్తికి నమస్కృతులు.

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం -

   " నామరూపాత్మకమైన ఈ సర్వజగతినీ, ఆత్మచైతన్యమయిన తనలో లీలామాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, స్వప్నదృశ్యం వలె తనకంటే భిన్నంగా ఉందన్న భ్రమ కలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమోవాకాలు... దక్షిణాభి ముఖంగా ఉన్న మూర్తిని(దక్షిణామూర్తిని) ఆ పరబ్రహ్మస్వరూపమే అని ఈ శ్లోకం నిర్ధారిస్తోంది. "

    " పరిపూర్ణమూ ఏకమూ అయిన ఆత్మతత్వంతో ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది.  విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లుగా గోచరించే ఈ మహావిశ్వమంతా, దేశకాలావృతమైన సమస్త చరాచర జగతినీ, ఇంద్రజాలికునివలె, మహాయోగివలె, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్చగా జగన్నాటకాన్ని నడిపే పరమాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇదే నా నమస్కృతులు. "

    ఆత్మ యొక్క  ఈ ఉనికి ,స్ఫురణా వలననే మనకు వస్తువిషయక జ్ఞానమూ అనుభవమూ సంభవమవుతున్నాయి.  ఈ ఉనికి ,స్ఫురణా ఆత్మలో అంతర్లీనమై ఉన్న లక్షణాలే. ఇదే సర్వానికీ కారణం అని నిశ్చయింపవచ్చును. "ఎవరి వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్యసత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణువేడినవారికి తత్త్వమస్యాది మహాక్యాలతో ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధవల్ల జననమరణయుక్తమైన ఈ సంసారచక్రం నుండి ముక్తిపొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమైన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు."

   "  ఆత్మచైతన్యం అంత:కరణలో ప్రతిఫలించి, మనస్సులో సంచలనాన్ని సృష్టించి మన కళ్ళు చెవులు మొదలయిన ఇంద్రియాలద్వారా,బాహ్యంగా ప్రసరిస్తూ 'అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, పైకి ప్రసరిస్తూ ఉందో.'.ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహా ప్రపంచమంతా తెలియబడుతూ ఉందో... అటువంటి దివ్యమూర్తికి సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

  "ఆత్మతత్వమును తెలియజాలని కొందరు, ఆత్మ దేహమనియు, ప్రాణమనియు తప్పుగా గ్రహిస్తారు. బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు,మాయా ప్రభావానికి లోనై, శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ, ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పు చెందే బుద్ధే సత్యమనీ, శూన్యమే సత్యమనీ శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

 " గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, సర్వేంద్రియ వ్యవహారాలూ ఉపశమించిన  సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతినొంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

   " బాల్యకౌమార యౌవన వృద్ధాప్య దశలలోనూ, జాగృత్ స్వప్న సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలోను, సర్వదా అన్నిప్రాణులలోనూ "నేను"గా ఉంటూ తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజ తత్వాన్ని వ్యక్తం చేసే సద్గురుమూర్తి శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

 " ఏ పురుషుడు మాయా ప్రభావంతో తనలో.. కార్యకారణ సంబంధరూపమయిన విశ్వాన్నీ, శిష్యాచార విభేదాన్నీ, పితృపుత్ర మొదలయిన తేడాలనీ జాగృత్ స్వప్నావస్థలనీ చూస్తున్నాడో, ఆయనను, ఆ పరమగురువుకి, శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

  " ఎవని అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమయిన ఆత్మతత్వంకంటే వేరుగా రెండవదేదీలేదని సాధకులు తెలుసుకుంటున్నారో .. అట్టి సద్గురువునకు శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

  "  సర్వాత్మత్వం ఈ దక్షిణామూర్తి స్తోత్రము నందు వివరించబడింది. ఈ ప్రపంచము సర్వమూ ఆత్మస్వరూపమే..అని స్పష్టము చేయబడినది. కాబట్టి దీనిని శ్రవణం మననం చేసి ధ్యానించి కీర్తించడంలో అష్టవిభూతి సహితమయిన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం, స్వరూపానుభూతి సిద్ధిస్తాయి."

ఇతి శంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రం

Tags: దక్షిణామూర్తి స్తోత్రం, Dakshinamurthy stotram, dakshinamurthy stotram telugu pdf, dakshinamurthy stotram pdf, dakshinamurthy stotram lyrics, dakshinamurthy stotram in english, dakshinamurthy stotram telugu meaning, dakshinamurthy stotram benefits

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments