జపస్థలము ఎన్నుకొను విధానము - How to do meditation In Best Places

జపస్థలము ఎన్నుకొను విధానము..

ఉన్నివస్తము లేక ఉన్నితివాసీ మీద కూర్చుని జపం చేస్తే - వంశవృద్ధి

పర్వశిఖరం మీద కూర్చుని జపంచేస్తే జపం ఇంకా ఇంకా చేయాలన్న తపన కలుగుట మరియు తపస్సిద్ధి కలుగును.

పీఠం, ఆశ్రమము, దేవాలయము ఆవరణలలో జపించిన దేవతానుగ్రహము, మంచి స్వప్నములు వచ్చుట జరుగును.

ఇంటిలో జపించిన ఎంత జపం చేస్తే అంత ఫలితమే వచ్చును.

ప్రవహించే జీవనదిలో నిలబడి బొడ్డుకు జలం తగిలివలాగ

జపించిన జపసంఖ్యకు రెండురెట్లు ఫలితము లభిస్తుంది.

గోశాల యందు కూర్చుని జపం చేస్తే జపసంఖ్యకు నూరురెట్లు ఫలితము కలుగును.

యజ్ఞం చేసిన స్థలంలో కూర్చుని జపం చేసిన జపసంఖ్యకు నూరురెట్లు ఫలితం కలుగును.

కాశీలో విశ్వేశ్వరుని దేవాలయము, శ్రీ శ్రైలమల్లిఖార్డున

దేవాలయము, తిరుమల తిరుపతి వెంకన్న దేవాలయాలులాంటి స్వయంభువుగా వెలసిన దేవాలయాలలో దేవతామూర్తికి ఎదరుగా లేక ముఖమండపములలోగాని కూర్చుని మంత్రం జపించిన జపసంఖ్యకు కోటిరెట్లు అధికముగా కలుగును.

సూర్యునికిగాని, గురువుకిగాని, దీపానికిగాని అభిముఖంగా కూర్చుని జపం చేసిన మంత్రము త్వరగా సిద్ధించును.

Tags: జపస్థలము, japasthalam, japam, yoga, meditations, rushulu, dharmasandesalu, spiritual news, bhakthi samacharam

Comments