అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి వివరాలు - ఎలా బుక్ చేసుకోవాలి? Ayodhya Ram Mandir Aarti Timings, Darshan Timings Full Details In Telugu

అయోధ్య: కోట్లాది మంది భక్తుల కల సాకారమై అయోధ్య (Ayodhya Ram Mandir) దివ్యమందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం దివ్యమైన ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రాణప్రతిష్ఠ ఉత్సవం వైభవంగా జరిగింది.  మంగళవారం (జనవరి 23) నుంచి బాలరాముడి దర్శన భాగ్యం అందరికీ కలగనుంది.

అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి వేళల (Aarti, Darshan timings) వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ వెబ్సైట్ లో వెల్లడించింది. ఆ వివరాలు ఇలా..

ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు

జాగరణ హారతి: ఉదయం 6.30 గంటలకు (ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది)

సంధ్యా హారతి: రాత్రి 7.30 గంటలకు (అందుబాటును బట్టి అదే రోజు బుక్ చేసుకునే సదుపాయం ఉంది)

రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్ లైన్ లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్దకానీ పాస్ తీసుకున్న వాళ్లకే హారతి సమయంలో అనుమతిస్తారు. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది.

బాలరాముడి దర్శనం/హారతి పాస్ లకు ఆన్ లైన్ బుకింగ్ ఇలా..

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక https://online.srjbtkshetra.org/#/login వెబ్ సైట్ కు వెళ్లాలి.

మీ మొబైల్ నంబరుతో సైన్ ఇన్ అయి ఓటీపీ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నమోదు పూర్తవుతుంది.

ఒకసారి లాగిన్ అయిన తర్వాత..మై ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి హారతి/దర్శనం టైమ్ స్లాట్లను ఎంచుకోవాలి.

మీ గుర్తింపు వివరాలు, చిరునామా వంటివి ఎంటర్ చేసి పాస్ కోసం బుక్ చేసుకోవాలి.

ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్ లో మీ పాస్ లు తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.

Tags: Ayodhya, Ayodhya Ram Mandir, Ram Mandir, Ayodhya Rama Temple, Ayodhya Temple Timings, Ayodhya Rama Accodamation, Ayodhya Darshanam Timings Telugu

Comments

  1. నేను 16.1.2024 కు బుక్ చేసుకున్నాను అండి. కానీ వెళ్ల లేక పోయాను. అందుకే కేన్సిల్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు బుకింగ్ అందుబాటులో లేదు.

    ReplyDelete

Post a Comment