శ్రీ సూర్యనారాయణ మేలుకో ఈ పాట ఒక్కసారి వినండి సర్వ దోషాలను పోగొట్టుకోండి - Sri Suryanarayana Melukolupu Telugu
శ్రీ సూర్యనారాయణ మేలుకొలుపు
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ
పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ
పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ
పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
ఉదయిస్తూ భానుడు ఉల్లీపువ్వు ఛాయ
ఉల్లీపువ్వుమీద ఉగ్రాంపు పొడిఛాయ
ఉదయిస్తూ భానుడు ఉల్లీపువ్వు ఛాయ
ఉల్లీపువ్వుమీద ఉగ్రాంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
గడియొక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ
గడియొక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వు మీద సంపంగి పూఛాయ
జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వు మీద సంపంగి పూఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
మధ్యాహ్న భానుడు మల్లేపువ్వు ఛాయ
మల్లేపువ్వు మీద మంకెన్న పూఛాయ
మధ్యాహ్న భానుడు మల్లేపువ్వు ఛాయ
మల్లేపువ్వు మీద మంకెన్న పూఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
మూడుజ్జాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వు మీద ముత్యంపు పొడిఛాయ
మూడుజ్జాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వు మీద ముత్యంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వు మీద అద్దంపు పొడిఛాయ
అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వు మీద అద్దంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వు మీద వజ్రంపు పొడిఛాయ
వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వు మీద వజ్రంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయ
గుమ్మడీపువ్వు మీద కుంకంపు పొడిఛాయ
గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయ
గుమ్మడీపువ్వు మీద కుంకంపు పొడిఛాయ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ
శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరిసూర్యనారాయణ🙏
Tags: సూర్యనారాయణ, Sri Suryanarayana Melukolupu Telugu, SuryaNarayana, surya narayana melukolupu, Sri Suryanarayana Meluko With Lyrics, Surya Stotram, Suryanarayana Stotram Telugu, Aditya Hrudayam Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment