Drop Down Menus

భగవద్గీత ధ్యాన శ్లోకం భావం మరియు ఆడియో | Bhagavad Gita Dhyana Slokam with Meaning and Audio

bhagavad gita dhyana slokam

భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 వరకు"జ్ఞాన షట్కము". 

శ్లో ||  ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం

        వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యేమహాభారతమ్ |

        అద్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం

        అంబ! త్వా మనుసందధామి భగవద్గీతే! భవద్వేషిణీమ్ || 1 ||


తా || భగవంతుడైన నారాయణునిచేత స్వయముగా పార్థునికి బోధింపబడి, పురాణముని వ్యాసునిచేత మహాభారతమధ్యంలో కూర్చబడి, అద్వైతమనే వర్షాన్ని కురిపిస్తూ, భవద్వేషిణివి అయి, పద్ధెనిమిది ఆధ్యాయాలతో కూడిన భగవతివి. భగవద్గీతా మాతా! నిన్ను నేను నిత్యమూ అనుసంధానం చేస్తాను.

శ్లో ||  నమోఽస్తు తే వ్యాస! విశాలబుద్ధే!

        ఫుల్లారవిందాయత పత్రనేత్ర! |

       యేన త్వయా భారతతైలపూర్ణః

       ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః  || 2 ||

తా || విచ్చుకున్న తామరపూరేకులవంటి నేత్రాలతో, విశాల హృదయుడవైన ఓవ్యాసమహర్షీ, నీకు నమస్కారం. భారతమనే నూనెతో జ్ఞానమయమైన దీపం నీచేత వెలిగింపబడింది.

శ్లో || ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే |

     జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః || 3 ||

తా || ఆర్తులై శరణువేడినవారి పాలిట పారిజాతమై, ఒక చేతిలో బెత్తాన్ని పట్టుకొని,జ్ఞానముద్రుడై, గీతామృతాన్ని పిదికిన కృష్ణునికి నమస్కారం.

శ్లో || సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః |

     పార్థో వత్సః సుధీ ర్భోక్తా   దుగ్ధం గీతామృతం మహత్ || 4 ||

తా || ఉపనిషత్తులన్నీ గోవులుకాగా, పార్థుణ్ణి వత్సంగా చేసుకొని విజ్ఞులు ఆస్వాదించడం కోసం మహత్పూర్ణమైన గీతామృతాన్ని పిదికిన వాడు గోపాలనందనుడు.

శ్లో || వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనమ్  |

    దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 5

తా || వసుదేవసుతుడైన దేవునికి, కంసచాణూరులను మర్దించిన వానికి, దేవికికి పరమానందం కలిగించే వానికి, జగద్గురువు కృష్ణునికి నేను నమస్కరించు చున్నాను.

శ్లో ||  భీష్మద్రోణ తటా జయద్రథజలా గాంధార నీలోత్పలా

శల్యగ్రాహవతీ  కృపేణ వహనీ కర్ణేన వేలాకులా   |

అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా  దుర్యోధనా వర్తినీ

సో త్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః   || 6

తా || భీష్మద్రోణులు రెండు తటాలుగా, సైంధవుడు నీరుగా, శకుని నల్ల కలువలుగా, శల్యుడు తిమింగిలంగా, కృపుడు ప్రవాహంగా, కర్ణుడు అల్లకల్లోలంచేసే అలలుగా, అశ్వత్థామ వికర్ణులు ఘోరమైన మొసళ్ళుగా, దుర్యోధనుడు సుడిగుండాలుగా నిండియున్న ఆ రణనది పాండవుల చేత దాటబడినది గదా! కేశవుడే పడవ నడిపినవాడు.

శ్లో ||  పారాశర్య వచ స్సరోజమమలం గీతార్థ గంధోత్కటం

నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితమ్ |

లోకే సజ్జన షట్పదై రహ రహః పేపీయమానం ముదా

భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయ సే  || 7

తా || పరాశరకుమారుని వాక్కు అనే స్వచ్ఛమైన సరస్సు నుండి జనించి, గీతార్థాలనే సువాసనలతో నిండి, అనేకమైన ఆఖ్యానాలనే కేసరాలు కలిగి, హరి కథలని వివరించేబోధలతో ఉన్నట్టి, లోకంలో సజ్జనులనే తుమ్మెదల చేత దినదినమూ ఆనందంతో ఆస్వాదింపబడే భారతపద్మం మా శ్రేయస్సు కోసం కలి దోషాన్ని పరిహరించును గాక!

శ్లో ||  మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ |

యత్యృపా తమహం వందే పరమానంద మాధవమ్ || 8

తా || ఎవరికృప మూగవాణ్ణి మాటకారిగా, కుంటివాణ్ణి గిరి లంఘించే వానిగా చేస్తుందో, అట్టి ఆనంద స్వరూపుడైన మాధవునికి నమస్కరించుతాను.

శ్లో || యం బ్రహ్మావరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యై స్తవైః

వేదైస్సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః  |ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః

యస్యాంతం న విదు స్సురా సురగణాః దేవాయ తస్మై నమః || 9

తా || ఎవరిని బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుత్తులు దివ్య స్త్రోత్రాలతో స్తుతించుతారో, ఎవరిని సామగాయకులు షడంగ, పద, క్రమ, ఉపనిషత్తులలో కూడిన వేదాలతో స్తుతించుతారో, ఎవరిని యోగులు ధ్యానస్థితమైన మనస్సు ద్వారా దర్శించుతారో, దేవరాక్షాస గణాలు ఎవరిని క్షుణ్ణంగా తెలుసుకోలేరో, అట్టి దేవునికి నా నమస్కారం.  

భగవద్గీత అన్ని అధ్యాయాలు పూర్తిగా వినడానికి , చదవడానికి క్రింద ఫోటో పై క్లిక్ చేయండి . 


bhagavad gita dhyana slokam learning audio with meaning . bhagavadgita slokas, temples guide bhagavad gita learning videos and audios.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.