Drop Down Menus

వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఏలా పూజించాలి - Vasantha Panchami Saraswathi Pooja | Vasant Panchami

వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఏలా పూజించాలి.

మాఘ శుక్ల పంచమినాడు రోజున ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి.

సరస్వతీ దేవిని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో అర్చించాలి. వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు.

ఆదిశంకరుడు అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొనడమే గాక శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారద. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని విశ్వాసం.

'యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా

యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా

సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..'

అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారూ.

సరస్వతి దేవి పూజలో నైవేద్యం ఏమి పెట్టాలి?

చదువుల తల్లి సరస్వతి దేవి విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. విద్యార్థిని, విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు. అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్రార్ధిస్తుంటారు. సరస్వతి దేవి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనస్సు ప్రశాంతతను పొందుతుంది.

ఆ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అలకరించబడి వీణను ధరించి ఉంటుంది. తెలుపు స్వచ్ఛతకు, పవిత్రతకు చిహ్నంగా కనిపిస్తుంది. అలాంటి శ్వేతవర్ణంలో అమ్మవారిని దర్శించడం వలన వెంటనే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. విద్యకు అధిదేవత అయిన అమ్మవారి ప్రీతిని పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది.

సరస్వతీ దేవికి పాలు, పెరుగు, వెన్న, తేనె, పాయాసం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ తల్లికి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

సరస్వతి చెట్టు

హిందూ ధర్మం లో  ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్నికూడా ప్రసాదిస్తుందట. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఆ ఆకు యొక్క ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు.ఈ ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది.

మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. మేధా శక్తిని పెంచుతుంది. రకాన్నిశుద్దీకరిస్తుంది.

ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగి శుభం చేకూరుతుంది. ఈ ఆకుతో దైవాన్ని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుందట. అన్ని విఘ్నాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట.

అక్షరాభ్యాసం సందర్భంగా

వసంత పంచమి/దేవి నవరాత్రులప్పుడు మూల నక్షత్రం నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ.. శివాయ సిద్ధం నమ.హ. అని రాసి దిద్దిస్తారు.

అక్షరాభ్యాసం_ఎలా_చేయాలి

విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ.

Tags: వసంత పంచమి, Vasant Panchami, Vasanta panchami, Saraswati Puja, Vasant Panchami Saraswati Puja, Saraswathi Pooja Telugu, Vasantha Panchami Pooja, Basara Saraswathi Temple, Aksharabhyasam

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.