Drop Down Menus

మాతృదేవో భవ కార్యక్రమం విరవ , పిఠాపురం మండలం , కాకినాడ జిల్లా | Virava Village Pithapuram Mandalam Kakinada

 

ఓం నమో వేంకటేశాయ .. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ఈ కార్యక్రమం గురించి రాయడానికి ప్రధాన కారణం మొన్న మా గ్రామం (విరవ , పిఠాపురం మండలం , కాకినాడ జిల్లా ) లో నడివీధి రామాలయాన్ని రోజుకొరకు చొప్పున రామాలయాన్ని శుభ్రం చేసి దీపారాధన చేయడానికి పిల్లలు ముందుకు వచ్చారు , ఆ విషయాన్ని పేస్ బుక్ లో షేర్ చేశాను , చాలామంది పిల్లలను అభినందిస్తూ కామెంట్ లు పెట్టారు కొందరు నాకు ఫోన్ చేసి మీ గ్రామం లో మీరు చాలానే కార్యక్రమాలు చేసారు కదా వాటి గురించి కూడా తెలియచేయండి వేరే గ్రామం లో కూడా ఎవరో ఒకరు మీలా  మొదలు పెట్టవచ్చు కదా అన్నారు దానితో ఇలా షేర్ చేస్తున్నాను .    



మాతృదేవో భవ కార్యక్రమం జూలై  31వ తేదీ 2022 లో జరిగింది,  మా దగ్గర ఎంతో చక్కగా భాగవతం , భగవద్గీత నేర్చుకుంటున్న చిన్నారుల ప్రతిభను తల్లిదండ్రులకు చూపించడం మరియు పిల్లలు ఇంత శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రధాన కారణమైన మాతృమూర్తులకు కండువాలు వేసి గౌరవిస్తే బాగుంటుందనే ఆలోచనతో మాతృదేవో భవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలు వెళ్లి నేర్చుకోవాలంటే తల్లే ప్రోత్సాహాయించాలి ఊరుకో నీకు ఎందుకు స్కూల్ లో ఇచ్చిన వర్క్ లు చేసుకో అన్నా లేదా మధ్యలో మానేస్తే భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్లడం లేదే వేళ్ళు అని చెప్పాలన్న తల్లే అందుకే మాతృదేవో భవ అని వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.  ఈ కార్యక్రమం లో విష్ణు సహస్రం చూడకుండా నేర్చుకున్న వారికి షీల్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటో లు  ముందువి వెనకాల , వెనకాల ఫోటో లు ముందు వచ్చాయి చూడగలరు , లేదంటే నేను సన్మానాలు చేయించుకున్నాక కార్యక్రమం మొదలు పెట్టాను అనుకుంటారు 😀





















































ఈ  కార్యక్రమానికి అథితులుగా విచేసినటువంటి 

RSS నుంచి శ్రీ రామచంద్రరావు గారు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర EO ల ప్రెసిడెంట్ శ్రీ దారబాబు గారు , EO కాట్నం మోహన్ గారు , తొలి తిరుపతి దేవస్థానం అర్చకులు శ్రీ రవి గారు , భగవద్గీత హైందవి శ్రీ అశోక్ గారు , మా పిల్లలకు విష్ణు సహస్రం నేర్పించిన శ్రీ దర్భకా వేంకటేశ్వర శర్మగారు , మా గ్రామ ఉపాధ్యాయులు శ్రీ ఆచార్య మాస్టారు మరియు శ్రీను మాస్టారికి ధన్యవాదాలు 

కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్ చేసినవారు శ్రీ వెంకట్ గారు , శ్రీ కుక్కులూరు నూకరాజు గారు , శ్రీ కురుమళ్ల రాంబాబు గారు ,  శ్రీ జెమినీ రమేష్ గార్లకు ప్రత్యేక నమస్కారాలు . 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.