తిరుమల శ్రీవారి సేవ కు వెళ్ళాలి అనుకుంటున్నారా ? ప్రశ్నలు జవాబులు | Tirumala Srivari Seva FAQ'S

 ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్ కు స్వాగతం. 


శ్రీవారి సేవకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు జవాబులు ఇప్పుడు చూద్దాం. 

srivari seva faq's
1) శ్రీవారి సేవకులకు టీటీడీ వారు ఏమైనా డబ్బులు ఇస్తారా? 

శ్రీవారి సేవకులకు టిటిడి వారు డబ్బులు ఏమి ఇవ్వరు 

2) శ్రీవారి సేవకుల టీం లీడర్ కు టీటీడీ వారు ఎవరైనా డబ్బులు ఇస్తారా? 

టీం లీడర్ కూడా టీటీడీ వారు డబ్బులు ఇవ్వరు 

3) శ్రీవారి సేవకుల యూనిఫామ్ టిటిడి వారే ఇస్తారా? 

లేదు శ్రీవారి సేవకులే తెచ్చుకోవాలి 

4) శ్రీవారి సేవకులకు దారి చార్జీలైన  టీటీడీ వారు ఇస్తారా?

టీటీడీ వారు ఇటువంటి దారి చార్జీలు ఇవ్వడం లేదు. 

5) శ్రీవారి సేవకులకు ప్రత్యేకంగా భోజన సౌకర్యం ఏమైనా ఉంటుందా? 

శ్రీవారి సేవకులు అందరిలానే వెంగమాంబ సత్రానికి వెళ్లి భోజనం చేయాలి. 

6) శ్రీవారి సేవకులకు వసతి ఎక్కడ ఉంటుంది?

ఆడవారికి మగవారికి వసతి సౌకర్యం ఉంది సేవాసదన్ 1&2. 

7) శ్రీవారి సేవకుల లగేజీ పెట్టుకోవడానికి లాకర్లు ఉంటాయా? 

శ్రీవారి సేవకులకు పడుకోవడానికి బెడ్ తో పాటు, లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ కూడా ఉంటుంది. 

8) స్నానపు గదుల్లో వేడినీరు సౌకర్యం ఉందా? 

A) ఉంటుంది 

9) సేవకు వెళ్లడానికి ఆఫ్లైన్లో అవకాశం ఏమైనా ఉందా?

A) శ్రీవారి సేవకు ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నారు. 

10) ఎన్ని నెలలు ముందుగా శ్రీవారి సేవకు బుక్ చేసుకోవాలి? 

మూడు నెలల ముందుగా బుక్ చేసుకోవాలి 

11) గ్రూప్ కి వెళ్లాలంటే ఎంతమంది ఉండాలి? 

కనీసం 10 మంది ఉండాలి, గరిష్టంగా 15 మంది ఉండవచ్చు. 

12) శ్రీవారి సేవకు సింగిల్ గా వెళ్లడానికి అవకాశం ఉందా? 

సింగిల్ గా కూడా శ్రీవారి సేవకు వెళ్ళవచ్చు. 

13) ఒక గ్రూపులో ఆడవారు మగవారు ఉండవచ్చా? 

ఉండవచ్చు. 

14) శ్రీవారి సేవ చేయడానికి వయోపరిమితి ఏమైనా ఉందా? 

సాధారణ రోజుల్లో 18 నుంచి 60 సంవత్సరాలు ఉండాలి, పర్వదినాల్లో అనగా వైకుంఠ ఏకాదశి,రథసప్తమి, బ్రహ్మోత్సవాలు లాంటి పర్వదినాల్లో 18 నుంచి 50 సంవత్సరాలు లోపు వారిని మాత్రమే తీసుకుంటారు. 

15) శ్రీవారి సేవకు వెళ్ళేటప్పుడు చంటి పిల్లలు కూడా తీసుకుని వెళ్ళవచ్చా? 

అలా తీసుకుని వెళ్లకూడదు. 

16) శ్రీవారి సేవ బుక్ చేసుకున్న తర్వాత ఎవరైనా రాకపోతే వారి స్థానంలో వేరే వారిని తీసుకుని వెళ్ళవచ్చా? 

ఆ విధంగా తీసుకుని రాకూడదు 

17) శ్రీవారి సేవ బుకింగ్ లో తిరుమల మరియు తిరుపతి అని ఉంది దాని అర్థం ఏమిటి? 

తిరుమల అనగా కొండపైన వీరికి వారం రోజులు కొండపైనే సేవ ఉంటుంది. తిరుపతి అనగా కొండ క్రింద వీరికి మూడు లేదా నాలుగు రోజులు కొండ కింద ఆపైన మిగిలిన రోజులు కొండపైన ఉంటుంది. 

18) శ్రీవారి సేవ రిజిస్టర్ వెబ్సైట్లో ఏడు సోమవారాలు ఏడు మంగళవారాలు ఈ విధంగా చూపిస్తుంది ఏమిటి దీని అర్థం? 

ఏడు సోమవారాలు అనగా అర్థం ఏమిటంటే సోమవారం నుంచి ఏడు రోజులు అని అర్థము అదే విధంగా మిగిలినవి 

19) శ్రీవారి సేవ వెబ్సైట్లో తిరుమల మరియు తిరుపతికి సేవ ఏఏ వారాల్లో విడుదల చేస్తారో మాకు తెలియడం లేదు? 

శ్రీవారి సేవ తిరుమల కు సోమవారము బుధవారము విడుదల చేస్తారు. 

అదేవిధంగా తిరుపతికి మంగళవారము శుక్రవారం విడుదల చేస్తారు 

20) శ్రీవారి సేవకు తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడ రిపోర్ట్ చేయాలి? 

తిరుపతి సెలెక్ట్ చేసుకున్న శ్రీవారి సేవకులు విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి అక్కడే సేవకులకు వసతి సౌకర్యం ఉంటుంది. 

21) తిరుపతిలో సేవ అంటే ఏ గుడి వద్ద సేవ ఉంటుంది?

శ్రీవారి సేవకులకు గోవిందరాజ్ స్వామి వారి గుడి పద్మావతి వివరాలు కపిల్ తీర్థం ఈ విధంగా లోకల్  టెంపుల్ లో సేవ ఉంటుంది.

22 ) శ్రీవారి సేవ వెబ్ సైట్ ?

జ ) https://ttdevasthanams.ap.gov.in/home/dashboard

keywrods : 

Tirumala Srivari Seva, tirumala srivari seva register, tirumala srivari faqs,

1 Comments

  1. Question no 19.. Sri vari seva tirumala lo tuesday and thursday andi..... Meeru wrong answer iccharu.... Okasari check chesukondi

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS