Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Bhavani Jyothishyalaya hyderabad

బ్రహ్మశ్రీ  గుమ్మా రామలింగ స్వామి  -  భవానీ జ్యోతిష్యాలయ, హైదరాబాదు
వీరు, సంప్రదాయ కుటుంబంలో  జన్మించి, వారసత్వముగా, తాతల. తండ్రుల నుండి,   జ్యోతిష, వాస్తు, ముహూర్త  భాగములను  15 ఏళ్ళ ప్రాయమునుండి  అధ్యయనము చేసి, ఈ శాస్త్ర విషయములలో మంచి  నిష్ణాతులు. హిందూ ధర్మముపై మంచి భక్తీ విశ్వాసములు కలిగి,  ఆ ఆచార వ్యవహారములను, పాటించుచు విశేష కృషి చేసిరి.  వీరు  ఆంద్ర విశ్వవిద్యాలయం నుండి M.A పట్టా పొంది,  ఆంధ్రా బ్యాంకులో  38 సం. వివిధ హోదాలలో  పలు శాఖలలో  ఆంధ్రా తెలంగాణా, కర్ణాటక, రాష్ట్రాలలో  వివిధ పదవుల నలంకరిమ్చిరి.   ఆ కాలమున వీరికి, మక్కువ కలిగిని ఈ జ్యోతిష, వాస్తు, ముహూర్త  విషయములలో పెక్కు మందికి సలహాలు, ఇచ్చి, భవిష్యత్తు నిర్దేశించి, జాతకమున గల దోషములు, వాని పరిహారములు  చెప్పుచు,  ఈ విధముగా  చాలామందికి ఆయా  ప్రాంతాలలో చిర పరిచితులు.  ఇలా  వీరి  ప్రస్తానం గత 50 సం.  అందరికి పరిచయమే.విశదమే.



పదవీవిరమణ అనంతరము వీరు  ఇదే ముఖ్య వృత్తిగా  హైదరాబాదు  కేంద్రముగా  మరే ఇతర వ్యాపకములు లేకుండా భవానీ జ్యోతిష్యాలయ  పేరుతొ ఒక సంస్థ స్థాపించి   ఈ జ్యోతిష, వాస్తు ముహూర్త  విషయాలపై విశేష కృషి చేయుచున్నారు.  ఈ 73  ఏళ్ళ వయస్సులో రోజు  4  గంటలు  ఈ విషయమై వచ్చు వారికి  సలహాలు సంప్రదింపులతో  కాలము వెళ్ళ బుచ్చుచున్నారు.  
శాస్త్రమున చెప్పినటులనే వీరు " గురుదక్షణ  యథాశక్తి " అని మనవిచేసి అన్ని వర్గాల వారికి అందుబాటులో  ఉన్నారు.   సామాజిక, ఆర్ధిక, స్థితిగతులు  వేరుగా ఉన్నా  జాతకము, ముహూర్తము వాస్తు  అందిరికి సమానమే గదా ! అన్నది వీరి వాదన.   

వీరి సేవలను, ధర్మబద్ధంగా నడచుకొను పద్ధతిని, నియమ నిష్టలను  గమనించి    FACE  foundation  Dheli  వారు   ఉత్తమ జ్యోతిష్కునిగా గుర్తించి   "  Raastravibhushan  award for excellency  in astrology '    తో  సత్కరించిరి,    ఈ మద్యన,  సుమన్ ఆర్ట్స్ హైదరాబాద్  వారు  సన్మానించి  జ్యోతిష విద్యా విశారద  బిరుదుతో సత్కరించిరి.  
 వీరి  ఆద్యాత్మిక, జ్యోతిష విషయాలపై వ్రాసిన  వ్యాసాలూ  web  పత్రికలు  "  siraakadamabam "   ధారావాహికముగా  గత 3 సం. నుంచి  ప్రచురించు చున్నారు  అలాగే " gotelugu.com "  పత్రిక వారు ఆధ్యాత్మిక  వ్యాసములు ప్రచురించిరి.
Contact :
Sri Gumma Ramalinga Swamy
e- Mail : rlswamyg@gmail.com
Land Number : 040-27769285,
Mobile : 9949164858
Website: www.deepra.com/astro
Facebook Idhttps://www.facebook.com/rlswamyg

Comments

  1. జ్యోతిషము -- గోచారఫలము

    మనమందరమూ తరచుగా పత్రికలలో వారఫలములు పక్ష ఫలములు మాస ఫలములు
    12 రాసులకు వ్రాయుట చూచుచున్నాము. దీనికి విశేష ఆదరణ ఉన్నది . ఈ గోచార విషయమున ఫలములన్నియూ
    చంద్ర లగ్నమునుండి చెప్పబడును, అనగా ఫలములు చెప్పు సమయమున చంద్రుని స్థితి
    అతనినుండి ఇతర గ్రహముల ఉనికి ఆ రాసులు ఈ వివరములతో ఫలములు చెప్పుదురు.

    సాధారణముగా జన్మ సయమున గల లగ్నము అందుండి ఇతరగ్రహముల స్థితి తెలుసుకొందుము.
    జన్మ సమయమున జరుగుచున్న దశ, శేషము తెలుసుకుని ఆ తరువాత వచ్చు దశలు అంతర్దశలు
    గుణించి గ్రహబలముల ననుసరించి ఫలములు చెప్పుదురు. ఇదియొక పధ్ధతి యిదియు
    విశష ప్రాచుర్యము సంతరించుకున్నది. ప్రశ్న సమయమున జరుగుచున్న దశ అంతర్ దశ
    ఆ గ్రహముల స్తితి బలములు దోషములు పూర్తిగా పరిసీలించివారి ప్రశ్నలకు సమాధానము చెప్పుచున్నాము .

    గోచారమున ఫలములు చెప్పునపుడు అవి విస్త్రృతముగా, . అదివర్తించు వారి సంఖ్య ఎక్కువగా
    నుండునను వాదన కలదు. ఈ భూమండలమున మానవ జనాభా సుమారుగా 600 కోట్లు పైననే ఉండును
    ఈ జనాభాను 12 రాసులకు విభజించ గా సుమారు 50 కోట్ల ప్రజలు ఒక్కొక్క రాశిలో ఉందురు.
    మన గోచారవశమున ఫలములు చెప్పునపుడు ఆ ఫలములు ఈ 50 కోట్ల వారికి వారి వారి నక్షత్రముల
    పాదముల, డిగ్రీల, బట్టి ఫలములుండును. చెప్పిన ఫలములు ఏ కొద్దిమందికి మాత్రమే
    వర్తించునటుల తోచుచున్నది .కాని నేటి తరమున గోరాచఫలముకు బహుళ ప్రాముఖ్యము కలదు.
    అది ప్రజల నమ్మకమే కదా!

    అదియే జన్మ కుండలి ననుసరించి ఫలములు చెప్పిననూ, ఒక లగ్నమున ఈ భూమండలమున
    సుమారు 40-50 వేల వరకు జన్మించుదురు. ఆ లగ్నమున జన్మించి వారికి దశాశేషము
    తదుపరి దశలు అంతర్దశలు ఒకేలా ఉండును. జన్మకుండలి ననుసరించి చెప్పు ఫలములు
    ఈ 40-50 వేలమందిక వర్తించును గాన ఈ విధానమే సత్ఫలములు చెప్పుటకు
    అనువయినదని మరియొకరి వాదన. ఎవరివాదనకు వారికి సరియైన అధారములు శాస్త్ర సమ్మతముగా ఉన్నవి.
    ఒకటి మంచిదని వేరొకటి కాదని నిర్ధారణ చెయ్యలేము.

    గోచారవశమున ఫలములను ప్రమాణిక గ్రంధములయందు శాస్త్రమున వివరముగా
    చెప్పబడినది. రవి చంద్రుని నుండి 3 ,6 ,10 స్థానముల యందు శుభము చేయును.
    చంద్రుడు జన్మ సమయమున ఉన్న చంద్రుని నుండి 1, 3 ,6 ,7 ,10 రాసులందు సంచరించుచున్న
    శుభుడు. గురుడు 2 ,5 ,7 ,9 స్థానములలో ఉన్న శుభుడు. శని మరియూ కుజుడు 3, 6, స్థానముల
    యందు శుభులు. బుధుడు 2, 4 ,6 ,8 ,10 స్థానములలో శుభములు కలుగజేయును.
    శుక్రుడు 1, 2, 3 ,4 ,5 ,8 ,9, 11, 12, స్థానములలో శుభ ఫలము లిచ్చును.
    రాహువు, కేతువు, రవి వలెనే 3, 6 ,10 ,11 స్తానములలో శుభులు
    గ్రహములన్నియూ గోచారవమున ,11వ ఇంటనున్న శుభులని చెప్పిరి.

    చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో సంచరించును. ఈ చంద్రస్థితిని బట్టి ఫలములు గుణించి
    చెప్పవలెను. ఏ పద్ధతి సరియైనదన్నది ఎప్పుడూ వివాదములతో కూడుకున్నదే.

    శుభం భూయాత్
    గుమ్మ రామలింగ స్వామి
    భవానీ జ్యోతిష్యాలయ






    ReplyDelete

Post a Comment