Sirichelma Mallanna Temple Adilabad

మనదేశం లో ఎన్నో శివాలయాలు.. ప్రతి శివాలయం వెనుక భక్తులపై పరమశివుని ప్రేమ కనిపిస్తుంది. రాక్షసుల కోరికలను కూడా మన్నించి వారి కోరికపై ఏర్పడిన శివాలయాలు మన దేశం లో ఉన్నాయి. 


ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం లో గ్రామ ప్రజల కష్ఠాలను చూడలేక స్వయంగా శంకరుడే ఒంటిచేత్తో రాత్రికిరాత్రే చెరువును తవ్వాడు.
ఎక్కడుంది :
ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలో గల ఇచ్చోడ కు 15 కిలోమీటర్ల దూరం లో సిరిచెల్మ అనే గ్రామం లో ఉంది. ఆదిలాబాద్ నుంచి ఇచ్చోడ 32 కిలోమీటర్ల దూరం లో ఉంది. 
స్థలపురాణం :
గారెలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న పిట్టయ్య, నిమ్మవ్వ అనే దంపతులకు సంతానం లేదు.. శివయ్య వారి దగ్గరకు వచ్చి అనాధ పిల్లవానిగా పరిచయం చేసుకున్నాడు. ఆ దంపతుల మనసు కరిగి శివయ్యకు మల్లన్న అని నామకరణం చేశారు.. అప్పటి నుంచి వారు పట్టిందల్లా బంగారమైంది. 


కొంతకాలానికి ఆ గ్రామం లో నీటి కరువు వచ్చింది. పంటలెండాయి.. ఎలాగైనా గ్రామం లో చెరువును త్రవ్వాలనుకున్నారు.. కానీ వారి దగ్గర డబ్బు లేదు, డబ్బు ఇస్తాం కానీ పండిన పంటలో సగం వాటా ఇవ్వాలని వ్యాపారస్తులు షరతు పెట్టారు. ఈ విషయం తెల్సుకున్న మల్లన్న ఈ రోజు రాత్రికే చెరువు త్రవ్వుతానని ప్రతిజ్ఞ చేశాడు.. పిల్లవాడి మాటలు ఎవ్వరు లెక్కపెట్టలేదు. తెల్లవారేటప్పడికి చెరువును తవ్వాడు మల్లన్న.. అక్కడే శివలింగం రూపం లో వెలసి.. పిట్టయ్య దంపతులకు కలలో కనిపించి జరిగింది వివరించి చెరువు తవ్వినందుకు కృతజ్ఞతగా తనకి మందిరాన్ని ఏర్పరచమని చెప్పాడు. 
ఎన్నో ప్రత్యేకతలు :

శివునికి ఎదురుగా రెండు నందులు దర్శనం ఇస్తాయి. ఆలయం వెలుపల 25 అడుగుల దూరం లో మరో నంది ఉంది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రయాణిస్తున్న సమయం లో బయట నంది మీద పడిన సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివుని పై ప్రతిబింబించడం ప్రత్యేకత. 

ఈ ఆలయం లో శివలింగం పైన ఎవరో లోపాలకి నొక్కినట్టు కొంత లోపలికి ఉంటుంది. రాత్రంతా తట్టలు తలపై వేస్కుని మట్టిని మోసినందుకు ఆ విధంగా ఉంటుంది అని స్థానికులు చెబుతారు. 

శ్రీకాళహస్తి ఆలయం లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఏడుతలల నాగుపాము దర్శనమిస్తుంది. శనిప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే మంచిదని చెబుతారు. సప్తఋషుల తలపై నాగశేషుడితో ఉన్న శివుడి ప్రతిమ అలనాటి కళా ప్రతిభకు నిదర్శనం. ఆలయం లో ఉన్న ముద్దు గన్నేరుచెట్టు వయసు కూడా తెలియదు. ఇది పురాణకాలం నాటిదని చెబుతారు. 
సాధారణంగా శివాలయాల్లో అగ్నిగుండాలు నిర్వహించరు. ఇక్కడ మాత్రం భక్తులు నడిచే క్రతువు ఘనంగా జరుగుతుంది.

Sirichelma Mallanna Temple is located in Sirichelma Village ichhoda mandal District of  Adilabad District State of Telangana. 
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples