Kondagattu Anjanna Temple Information | Temple Timings | History

Kondagattu Anjanna Temple

కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న
ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించే ‘కొండగట్టు’ ఆలయం. కొండగట్టు ఆలయం తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. కరీంనగర్‌ జిల్లాకేంద్రం నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతాన హీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు.. ప్రకృతి సౌందర్యము కలిగిన అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయంలోని ఆంజనేయుడు విగ్రహంలో ఒక విశేషం వుంది. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలను ఆ విగ్రహం కలిగి వుంటుంది. ఈ విగ్రహాన్ని అక్కడి గ్రామస్థులే ప్రతిష్టించారు.

ఈ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు ఎందుకొచ్చిందన్న విషయంపై ఓ పురాణగాధ వుంది. పూర్వం రాముడు, రావణ మధ్య యుద్ధం జరుగే కాలంలో లక్ష్మణుడు మూర్ఛ రోగంతో పడిపోయాడు. అప్పుడు ఆంజనేయుడు అతనిని సంరక్షించేందుకు సంజీవని తెచ్చేందుకు బయలుదేరాడు. హనుమ సంజీవనిని తెస్తున్నప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంతభాగం విరిగిపడింది. ఆ భాగాన్నే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తారు. ఆ విధంగా ఆ ప్రాంతానికి కొండగట్టుగా పేరొచ్చింది.

Temple History /స్థలపురాణం:
దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికికి అవధుల్లేకుండాపోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్చిల్లిగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి రోధించినట్టు చెప్పే కన్నీటిగుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు..

Kondagattu Anjanna

Accommodation Details :
> కొండపై మూడు ప్రత్యేక గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. వీటికి రోజుకు రూ. 250 అద్దె ఉంటుంది.
> మరో 30 గదుల వరకు భక్తులకు రోజువారీగా అద్దెకు ఇవ్వడానికి ధర్మసత్రాల గదులు లభిస్తాయి. వాటిలో కొన్నింటికి రూ. 50 చొప్పున, మరికొన్నింటికి రూ. 150 వరకు అద్దె ఉంటుంది.
> ఉచితంగా ఉండటానికి డార్మిటరీ రేకుల షేడ్లు ఉన్నాయి.
> గదుల గురించి వివరాలు తెలుసుకోవడానికి ఏఈవో ఫోన్‌ నెం. 98487 78154
> కొండపై హరిత హోటల్‌ ఉంది. ఎలాంటి కాటేజీలు లేవు.
Travel Information :
హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి.. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్‌ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్‌ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల సౌకర్యమూ ఉంది.

Related Postings :

> Yadadri Lakshmi Narasimha  Swamy Temple Information

> Chilkur Balaji Temple Information

> Basara Saraswathi Temple History

> Chaya Someswara Swamy Temple History


Kondagattu anjanna Temple Information in telugu, kondagattu temple history in telugu, anjanna temple in kharimnagar, Telangana famous temples list, kondagattu temple timings, kondagattu temple travel information, kondagattu anjanna, hindu temples guide.
Share on Google Plus

About chanti achanti

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples