Rameswaram Temple Information in Telugu | Timings Accommodation History

కాశి రామేశ్వరం ఈ రెండు క్షేత్రాల పేర్లు తెలియనివారు ఎవరుంటారు.. జీవితం లో ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే క్షేత్రాలు ఈ రెండు, ఈ రెండు క్షేత్రాలు దర్శిస్తే మొత్తం అన్ని క్షేత్రాలను దర్శించినట్లే అని చెబుతారు.

రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రం , మనం ఇంతక ముందే కాశి క్షేత్ర విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు రామేశ్వరం కోసం తెల్సుకుందాం.
ఉదయాన్నే స్పటికలింగ దర్శనం : 
రామేశ్వరం లో తెల్లవారు జామున స్పటికలింగ దర్శనం ఉంటుంది. 4 నుంచి 5.30 వరకు ఒక్కోసారి 6 గంటలవరకు కూడా ఉంటుంది. 6 గంటల తరువాత   సీతమ్మ వారు ప్రతిష్టించిన శివలింగానికి పూజలు చేస్తారు. 

ఈ శివలింగానికి ఎడమవైపునే ఆంజనేయ స్వామి వారు తీస్కుని వచ్చిన శివలింగం ఉంటుంది. చాలామందికి తెలియక కంగారులో వెళ్లిపోతుంటారు. స్పటిక   లింగ దర్శనానికి అందరు టికెట్ తీసుకోవాల్సిందే, 10 /- టికెట్ ఉంది అని బోర్డు ఐతే ఉంది కానీ టికెట్ లు ఇచ్చేవారే ఉండరు, అందరు 50/- టికెట్ తీసుకోవాల్సిందే. అందరికి ఒకటే లైన్ ఉంటుంది విడి విడిగా ఉండదు. మీకు ముందుగా ఎందుకు చెప్తానానంటే ఇవి మీరు చదివే బుక్స్ లో ఉండవు కనుక :)
సముద్ర స్నానం : 
రామేశ్వరం స్వామి వారి దర్శనం కంటే ముందు సముద్ర స్నానం ఆ తరువాత దేవాలయాలం లో ఉన్న 22 బావుల్లో స్నానం చెయ్యాలి, స్పటిక లింగ దర్శనానికి మీరు రూమ్ లో స్నానం చేసే రావాల్సి ఉంటుంది. 
సముద్రం దేవాలయానికి ఎదురుగా మరియు చాల దగ్గరగానే ఉంటుంది, మీరు ఆటో లో వెళ్ళవలసిన పని లేదు.. ఇక్కడ సముద్రం పేరుకుమాత్రమే సముద్రం లా కనిపిస్తుంది, ఎగసిపడే అలలు ఇక్కడ చూద్దామన్నా కనిపించవు. 

22 బావుల్లో తీర్ధ స్నానాలు : 

మీరు సముద్రస్నానం  చేసి ముగించుకుని గుడి దగ్గరకు వస్తే , మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా గుడిలో 22 బావుల్లో తీర్ధ స్నానము చెయ్యాలని . తీర్ధ స్నానానికి టికెట్ తీసుకోవాలి 25/- ఉంటుంది. 

ఇక్కడ ప్రత్యేకంగా కొందరు బకెట్ లు పట్టుకుని ఉంటారు మనతో బేరమాడటానికి .. దేనికి బేరం అనేగా .. మీరు మామూలుగా వెళ్తే ఓ పదిమందికి కలిపి నూతిలోంచి ఒక బకెట్ నీళ్లు అందరి మీద పడేలా జల్లుతారు.. అదే వీరితో మాట్లాడుకుని వెళ్తే మనకి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో నూతి దగ్గర ఒక బకెట్ నీళ్లు పోస్తారు. ఒక్కొక్కరికి 100/- వరకు ఛార్జ్ చేస్తారు ఒక్కసారి 150 అడిగిన అడగవచ్చు పైగా మన చేతే టికెట్ విడిగా కొనిపిస్తారు. ఈ బావులలో స్నానం చెయ్యడం మనం జీవితం లో మరచిపోలేము, ఒక్కో బావిలో నీరు ఒక్కో రుచిని కలిగి ఉంటుంది మీరే చూస్తారుగా వెళ్ళినప్పుడు 
స్నానాలు జాగ్రత్తలు : 
రామేశ్వరం లో దొంతనాలు తక్కువే అని చెప్పాలి. ఐన కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి, మీరు సెల్ ఫోన్స్ స్నానం చేసేటప్పుడు తీస్కుని రాకండి, చాల మంది మరొక జత బట్టలు కూడా తెచ్చుకుని గుడిలోనే మార్చుకుని దర్శనానికి వెళ్దాం అనుకుంటారు కానీ 22 బావుల దగ్గరకు మనం వెళ్తాం కదా మన బ్యాగ్ లు చూడ్డానికి లేదా మనమే మొయ్యడం కష్టం అవి తడిసిపోతాయి. స్నానాలు అయ్యాక రూమ్ కి వెళ్లి బట్టలు మార్చుకుని దర్శనానికి రండి. 
రామనాధ స్వామి దర్శనం :  
Rameswaram Temple Timings : 
స్వామి వారి దర్శనానికి మెమోలు రోజుల్లో 30 నిముషాల లోపే  మనకి దర్శనం అవుతుంది. టికెట్ ఏమి ఉండదు. ప్రత్యేకంగా పూజలు చేయించదలుచుకుంటే 1500 వరకు ఛార్జ్ చేస్తారు, వారికీ ప్రత్యేక దర్శనం ఉంటుంది. స్వామి వారి దర్శనం  తరువాత  అమ్మవారి దర్శనానికి వెళ్తాము. 

అమ్మవారికి ప్రత్యేక సన్నది కలదు, ఈ ఆలయం చాల పెద్దది తమిళనాడు ఆలయాల కోసం ప్రత్యేకంగా చెప్పేది ఎం ఉంటుంది, మనల్ని కట్టిపడేస్తాయి. తిరుపతి ని దృష్టిలో పెట్టుకుని ఆలయానికి వెళ్ళకండి తమిళనాడు లో 12 pm to 4 pm వరకు గుడి మూసివేస్తారు.  మరియు రాత్రి 8 దాటితే దర్శనం లు ఉండవు. రామేశ్వరం లో చాల చక్కటి దర్శనాలు మీకు అవుతాయి.  
Temple Timings : 
Morning : 5 am to 1 pm
Break :12 pm to 4 pm
Evening : 4 pm to 8 pm

రామేశ్వరం చూడాల్సిన ప్రదేశాలు :
రామాయణ కాలంనాటి ఆధారాలు, అప్పుడు జరిగిన ఘట్టాలకు రామేశ్వరమే సాక్ష్యం. హనుమంతుడు రాములవారికి సీతమ్మవారి ఆభరణాలు చూపించిన ప్రదేశం ఇక్కడే ఉంది.. కలం గారి హౌస్ కూడా రామేశ్వరం లోనే ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో ఏమి చూడాలో క్రింది లింక్ పై క్లిక్ చేస్తే మీకు పూర్తిగా అర్ధమౌతుంది. 
https://goo.gl/C0QAOt

ధనుష్కోటి :
ఒకప్పుడు రైల్వే లైన్ ధనుష్కోటి వరకు ఉండేది ఐతే 1964 లో సంభవించిన తూఫన్ లో రైల్వేలైన్ కొట్టుకుని పోయింది. రైల్వే లైన్ కొట్టుకోకుపోయింది అంటే దగ్గర్లో ఉన్న జనం , వారి ఇల్లు , గుడిసెలు ఏమైఉంటాయో ఊహించవచ్చు. ఇప్పడికి అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పడిపోయిన , శిధిలం అయిపోయిన గృహాలను మనం చూడవచ్చు.

కాశి రామేశ్వరం యాత్ర లో భాగంగా పూర్వం ధనుష్కోటి వద్ద ఉన్న ఇసుకనే కాశి లో గంగలో కలపడానికి తీస్కుని వెళ్లేవారు.

ఈ ధనుష్కోటి వద్దే అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలుస్తాయి. ఇక్కడి వెళ్లాలంటే ఆలయం నుంచి బస్సు లు ధనుష్కోటి వరకు ఉంటాయి అక్కడ నుంచి వ్యాన్ ల ద్వారా జీప్ ల ద్వారా చేరుకోవాలి సుమారు 8 కిమీ పైనే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచే శ్రీలంక కనిపిస్తుంది. రాముల వారు కట్టిన వారధి ఇక్కడ సముద్రం లోనే ఉంది. ప్రస్తుతం ధనుష్కోటి వరకు రోడ్ వేస్తున్నారు ఈ రోడ్ నిర్మాణానికి 24 కోట్లు పైగా ఖర్చు చేస్తున్నారు. 2016 జనవరి 30 కి పూర్తీ అవుతుంది అని అంచనా వేశారు, ఇప్పటికే పూర్తీ అయి ఉండాలి. మీరు ఈ మధ్యనే వెళ్తే నిర్మాణం అయిందో లేదో కామెంట్ చేయండి. 

ఆకర్షణలు :
రామేశ్వరానికి ప్రత్యేక ఆకర్షణ పంబన్ బ్రిడ్జి, సముద్రం లోంచి వేచిన బ్రిడ్జి ఒక ఎత్తైతే , ఓడలు వస్తున్నప్పుడు బ్రిడ్జి ఓపెన్ అవ్వడం మరొకెత్తు. ఇక్కడకు చేరుకోవడానికి బస్సు స్టాండ్ నుంచి బస్సు లు ఉంటాయి లేదా ఆటో లో కూడా వెళ్ళవచ్చు, ఉదయం సముద్రపు స్నానం చెయ్యడానికి వెల్లంకి కదా అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది బలే ఉంటుంది అసలు ఒకసారి వెళ్ళిరండి .


రామేశ్వరం లో రూమ్స్ : 
Accommodation in Rameswaram 
రామేశ్వరం లో రూమ్స్ కి ( accommodation ) మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు రైల్వే స్టేషన్ నుంచి బస్సు లో వస్తే టెంపుల్ దగ్గరకు తీస్కుని వస్తారు. టెంపుల్ కి దగ్గర్లో చాలానే రూమ్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్న చత్రం కూడా ఆలయానికి ఎడమవైపునే ఉంది. బస్సు ఇక్కడికి దగ్గర్లోనే ఆగుతుంది, ఈ చత్రం పేరు శ్రీ రామానుజనేయ సత్రం ( SRI RAMANAJANEYA CHATRAM ),  
రూమ్స్ మాత్రం ఫ్రీ కాదండోయ్ .. రెండు సింగల్ రూమ్స్ ఉన్నాయి మీరు ఒక్కరు లేదా ఇద్దరు వెళ్తే అడగండి అద్దె 250 తీసుకుంటారు, నలుగురుంటే అద్దె 500/- , ఒక్కోసారి సింగల్ రూమ్ దొరకడం కష్టమే. రూమ్స్ బాగుంటాయి. కాశి లో లాగ ఇక్కడ ఉచిత భోజనాలు , ఫలహారాలు పెట్టారు. ఆలయానికి దగ్గర్లోని మరియు ఆలయం వెనకాల హోటల్స్ ఉన్నాయి. భోజనాలు బాగానే ఉంటాయి. ఇక్కడవారికి తమిళనాడు లో ఇడ్లిలు తినడం కష్టం. ఫోన్ నెంబర్ ఇస్తాను నోట్ చేస్కోండి. 
RAMESWARAM SRI RAMANAJANEYA CHATRAM PHONE NUMBER : 
04573222224
రామేశ్వరం లో ఉన్న  తెలుగు సత్రం కరివెన సత్రం, ఈ సత్రం ఆలయం నుంచి సముద్రానికి వెళ్ళేదారిలో ఎడమవైపున ఉంటుంది. ఆలయం నుంచి చాల దగ్గర్లోనే ఉంటుంది. 
AKHILA BHARATEEYA BRAHMANA KARIVENA NITYANNADANA SATRAM RAMESWARAM
PHONE NUMBER : 04573222156
రామేశ్వరం ఆలయం వారు ఇప్పుడు ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేస్కునే సదుపాయాన్ని కల్పించారు.. నేనైతే ఇప్పడివరకు ఉండలేదు అక్కడ వీరు కూడా 500/- ఛార్జ్ చేస్తున్నారు. రూమ్ లో నలుగురు ఉండవచ్చు. మీరు బుక్ చేసుకుని cancel చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వరు.  క్రింది లింక్ పై క్లిక్ చేసి మీరు రూమ్స్ బుక్ చేస్కోవచ్చు . 
Arulmigu Ramanatha Swamy Temple Rameswaram Online Accommodation Booking :
Rameswaram Temple Phone Numbers :
04573221223
రామేశ్వరం కోసం ఇవి కూడా చూడండి వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి :


sri chaganti pravachanam, rameswaram temple details in telugu, rameswaram accommodation information, rameswaram temple phone number, rameswaram accommodation telugu people, rameswaram temple address , rameswaram railway station code, rameswaram temple timings , rameswaram temple pooja details, rameswaram temple inforamtion in telugu, rameswaram temple accommodation booking online,  rameswaram temple room rent cost, darshanam timings,

Comments

  1. సన్నిధి అని సరిచేయండి,తర్వాత కామెంట్ కూడా delete చేయండి

    ReplyDelete

Post a Comment