Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

నిత్య పూజా విధానం - Pooja Vidhanam At Home In Telugu PDF Download | Pooja Vidhi | Dharma Sandehalu

సకల దేవతల అష్టోత్తరములతో కూడిన 'ప్రతిరోజూ పూజావిధానం' చదవండి. నిత్యం ఏ దేవుడు, దేవతను ఎలా పూజించాలో తెలుసుకోండి.

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి.
నిత్య పూజా విధానం –

నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు.

నిత్య పూజకు కావాలిసినవి 
మనస్సులో ధృడ సంకల్పం
పసుపు, కుంకుమ, గంధం
పసుపు కలిపిన అక్షతలు
పువ్వులు, దొరికితే మామిడి ఆకులు
తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం)
ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం
వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె
కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు
పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు
అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షంలో కలశంలో ఉన్న నీరు చాలు)
అభిషేకం కూడా చేయాలనుకుంటే, దాని కోసం పెద్ద పళ్ళెం, అభిషేకం అయ్యక నీళ్ళు/పంచామృతాలు పోయడానికి ఒక గిన్నె
అగరవత్తులు, లేక సాంబ్రాణి, అవి పెట్టడానికి ఒక స్టాండు (ధూపం అన్నప్పుడు వెలిగించాలి)
దీపం కుందులు (ప్రమిదలు), నూనె, వత్తులు (దీపాలను వెలిగించడానికి సిద్ధంగా తయారుచేసి ప్రక్కన ఉంచుకోవాలి)
నైవేద్యానికి పండ్లు లేక అప్పుడే వండిన సాత్త్విక ఆహార పదార్థాలు, అవి లభ్యం కాని పక్షంలో కొంచెం బెల్లం లేదా చక్కెర
పంచాంగం (మాసం, అయనం, తిథి, నక్షత్రం చూసుకోవడానికి)
చేయి తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం
కూర్చోవడానికి దర్భాసనంగానీ, అంచు ఉన్న తెల్లటి వస్త్రంగానీ
పూజా విధానం –
పూజకు ముందు కాలకృత్యలు తీర్చుకుని స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని, పూజా స్థానంలో ముందురోజు నుంచి ఉన్న పవిత్ర నిర్మాల్యాన్ని తీసేసి, ఆ స్థానం మరియు దేవతా మూర్తులను శుభ్రం చేయాలి. నిశ్చయించుకున్న దేవతా స్వరూపం యొక్క మూర్తిని పూజ చేయడానికి వీలుగా మనం కూర్చునే స్థానానికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి. కావలసిన పూజ సామగ్రిని చేతికి అందుబాటులో ఉంచుకుని కూర్చోవాలి.

ప్రతి పూజకు ప్రారంభంలో పూర్వాంగం ఉంటుంది. ఇది అన్ని పూజలకు సామాన్యంగా ఉంటుంది.

{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}

వినాయకుని శ్లోకం:
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

***

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
{అని నమఃస్కారం చేసుకోవాలి}

***

ఏకాహారతి వెలిగించాలి:
{ఏకాహారతి వెలిగించి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు & పూల తో అలంకరించవలెను.}

***

దీపారాధన వెలిగించేటప్పుడు శ్లోకం:
{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి దీపం వెలిగించాలి}

భోదీప దేవి రూపస్త్వం,
కర్మ సాక్షిహ్య విఘ్ణకృత్,
యావత్ పూజాం కరిష్యామి,
తావత్వం సుస్థిరో భవ.
దీపారాధన ముహూర్తః సుమూహూర్తోస్తు
{పై శ్లోకం చదువుకుంటూ దీపారాధన కుంది కి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో పూజ చెయ్యాలి.}

***

ఆచమనం:
{చెయ్యి అలివేణి (ప్లేటు)లో కడుగుకోవాలి}

ఓం కేశవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహ --- {అని తీర్ధం తీసుకోవాలి}
{మళ్లీ చెయ్యి కడుగుకోవాలి}

ఓం గోవిందయనమః --- {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}

***

{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}

కేశవనామాలు:
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం రిషీకేసాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అదోక్షజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే శ్రీకృష్ఱాయ నమః

***

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||

ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||

{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సితారామాభ్యాం నమః

||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

భూశుద్ధి

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

{ప్రాణాయామము చేసి అక్షంతలను వెనుక వేసుకోవలెను.}

ప్రాణాయామం

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

***

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా.)

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం

 
(కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)

శుభేశోభనే ముహూర్తే - శ్రీ మహావిష్ణో రాజ్ఞయా
ప్రవర్తమానస్య - ఆద్యబ్రహ్మణః
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే

భరతవర్షే -భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)

మేరోః దక్షిణ దిగ్భాగే

(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి)
(శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా / గోదావర్యోః మధ్యదేశే" )

కావేరి నదీ సమీపే

నివాసిత గృహే
(Own house అయితే "సొంత గృహే"అని చదవాలి)

అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (for details check this site:

శ్రీ ఖర నామ సంవత్సరే

ఉత్తరాయనే
(దక్షిణాయనే from 17th july / ఉత్తరాయనే from 15th jan --- -[6 months కి ఒక సారి మారుతుంది. See panchamgam])

గ్రీష్మ ఋతువే
('గ్రీష్మ ఋతువే' - 'Summer Season' / 'వర్ష ఋతువే' - 'Rainy Season' / 'వసంత ఋతువే' - 'Winter Season')

జ్యేష్ఠ మాసే
(తెలుగు నెల)(శ్రావణ, చైత్ర, జ్యేష్ఠ, )

శుక్ల పక్షే
(శుక్ల పక్షం [as the size of the moon increases] / బహుళ పక్షం [as the size of the moon decreases], కృష్ణ పక్షం)

________ తిధౌ
(morning ఏ తిథి start అయితే ఆ తిథే చదువుకోవాలి)
(Ex: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షస్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ or అమావాస్య.)

________ వాసరే
(ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి Ex: ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.)

శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరుణే,

ఏవం గుణవిశేషణ విశిష్టాయాం,

శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రా
(Ex: భారద్వాజస )

అహం __________ నామ ధేయా
(భర్త పేరు చదువు కోవాలి) (Ex: సత్య ప్రకాష్)

ధర్మ పత్ని ______________ నామ ధేయా,
(Ex: లక్ష్మీ శైలజ)

సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త దురితక్షయ ద్వారా,

శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం,

క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,
సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం,
సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే,

{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను.}

****

కలశారాధన

అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.

{కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేటితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను.}

కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మా
మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా
వసుంధరా ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చ
సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ
గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు.

{శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన నీరు చల్లవలెను}

ఆత్మానం సంప్రోక్ష్య, పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య.
శంఖపూజ
శంఖం అందుబాటులో ఉంటేనే ఇది చేయండి. ప్రత్యేకంగా అభిషేకం చేయాలనుకుంటే శంఖం ముందుగా తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోండి. కలశంలోని నీళ్ళను కొంచెం శంఖంలోకి తీసుకుని, శంఖానికి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి, శంఖం నీటిలో గంధం మరియు అక్షతలు వేసి, శంఖం మీద ఒక పువ్వు పెట్టి ఈ శ్లోకం చదవాలి. తర్వాత ఆ నీళ్ళను తిరిగి కలశంలో పోసి, శంఖాన్ని దేవతా ప్రతిమ వద్ద ఉంచండి.

ఘంటపూజ
ఘంటకి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి ఒక పుష్పం, అక్షతలు వేసి ఈ శ్లోకం చదవాలి.

ఘంటానాదం
ఘంటకి నమస్కారం చేసి కుడిచేతిలో తీసుకుని ఈ శ్లోకం చదువుతూ వాయించాలి.

తరవాత గణపతి పూజ ఉంటుంది. లఘు పూజకానీ, షోడశోపచార పూజ కానీ చేయవచ్చు. పిమ్మట ప్రధాన దేవతార్చన ఉంటుంది.

ఉపచారాలు – వాటి పద్ధతులు

ఉపచారం అంటే సేవ. చేసే ప్రతి ఉపచారానికి భావన ముఖ్యం. భావన బలంగా ఉంటే కేవలం అక్షతలు వేసినా దేవతకు విశేష ఉపచారం చేసినట్లే. దేవతకి మనం దాసులం అని భావన చేస్తూ ఈ ఉపచారాలు చేయాలి. షోడశోపచార పూజలో పదహారు ఉపచారాలు ఉంటాయి. వాటిలో అయిదు ఉపచారాలు పంచోపచారాలలో కూడా వస్తాయి.

పంచోపచారాలు-
౧. గంధం
౨. పుష్పం
౩. ధూపం
౪. దీపం
౫. నైవేద్యం

పంచోపచార పూజ చేయాలనుకుంటే సంకల్పం లో “పంచోపచార పూజాం కరిష్యే” అని చదువుకోవాలి. తర్వాత ధ్యాన శ్లోకాలు చదివి పైన ఇచ్చిన అయిదు ఉపచారాలు చేయాలి. ఉపచార విధానం ఈ క్రింద ఇవ్వబడింది.

షోడశోపచారాలు 

౧. ధ్యానం
దేవతా స్వరూపాన్ని పూర్ణంగా ఊహచేసి, కుడి చేతిలో అక్షతలు పట్టుకుని మీరు పూజ చేయాలనుకున్న దేవాతా స్వరూపాన్ని వర్ణించే ధ్యానశ్లోకాలు చెప్పుకోవాలి. తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

౨. ఆవాహనం
ధ్యానంలో గోచరమైన స్వరూపాన్ని మన కళ్ళకు ఎదురుగా ఉన్న ప్రతిమలోకి వచ్చినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

౩. ఆసనం
ఆవాహన చేసిన దేవతా స్వరూపానికి మన ఎదురుగా ఒక స్థానంలో కూర్చుని ఉండడానికి వీలుగా ఒక సింహాసనం ఊహించి, మన ఎదురుగా దాన్ని వేసినట్టు, దేవతా స్వరూపం ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు ఊహించాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

౪. పాద్యం
సింహాసనం లో కూర్చుని ఉన్న దేవతా స్వరూపం కాళ్ళ క్రింద పెద్ద పళ్ళెం పెట్టి గంగాది సర్వతీర్థాలలోంచి మంచి నీరు తెచ్చి దానిలో గంధం కలిపి ఆ పాదాలమీద పోసినట్టు, తర్వాత ఆ నీళ్ళు తల మీద పోసుకున్నట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని నీళ్ళు దేవతా మూర్తి పాదాల మీద జల్లాలి.

౫. అర్ఘ్యం
మన ఎదురుగా ఉన్న దేవతా స్వరూపానికి మన దోసిట నిండా నీళ్ళు తీసుకుని, ఆ దేవతా స్వరూపం యొక్క చేతులలో పోసినట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని కొద్ది నీరు తీసుకుని అరివేణంలో విడవాలి.

౬. ఆచమనీయం
పూజ పూర్వాంగం లో మనం ఆచమనం చేసినట్టు, దేవతా స్వరూపం కూడా ఆచమనం చేస్తున్నట్టు భావన చేయాలి. కుడి చేతితో కలశం లో నీళ్ళు ఉద్దరిణతో తీసుకుని, దేవతా స్వరూపం నోటికి అందించినట్టు భావన చేసి, అరివేణంలో మూడుసార్లు విడవాలి.

అభిషేకం (స్నానం)
అభిషేకం లో మూడుభాగాలు – పంచామృత అభిషేకం, ఫలోదక అభిషేకం, శుద్ధోదక అభిషేకం. పంచామృత అభిషేకానికి ఐదు పదార్థాలు కావాలి – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార లేదా చక్కెర. ఇవి కలిపికానీ విడివిడిగా కానీ అభిషేకం చేయవచ్చు. ఫలోదకం కోసం కొబ్బరినీళ్ళు కానీ పళ్ళరసాలు గానీ వాడవచ్చు. శుద్ధోదకం కోసం కలశం నీళ్ళు వాడాలి. దేవతా మూర్తిని ఒక పెద్ద పళ్ళెం లో పెట్టి, ఉన్న పదార్థాలతో అభిషేకం చేయాలి. పంచామృత స్నానం, ఫలోదక స్నానం సాధ్యం కాకపోతే కలశంలోని నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. విడిగా అభిషేకం చేయడం కుదరకపోతే, కలశంలోని నీళ్ళను అందులో ఉన్న పువ్వుతోగానీ మామిడాకులతో గానీ తీసుకుని దేవతా మూర్తి మీద చిలకరించవచ్చు. బ్రహ్మాండం మొత్తం వ్యాప్తమైన దేవతస్వరూపానికి అభిషేకం చేస్తున్నట్టు భావన చేయాలి.

స్నానం అయ్యాక కలశంలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో విడవాలి. ఇది “స్నానానంతరం శుద్ధాచమనీయం” అన్నప్పుడు చేయాలి.

అభిషేకం జరిగిన తరువాత దేవతామూర్తిని శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమతో బొట్టు పెట్టి తిరిగి సింహాసనంలో పెట్టాలి.

యజ్ఞోపవీతం
దేవతా మూర్తికి యజ్ఞోపవీతం వేసినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా ప్రతిమ పాదాల వద్ద వేయాలి.

వస్త్ర యుగ్మం
సింహాసనం లో ఉన్న దేవతకి దివ్య వస్త్రాలు సమర్పించినట్టు భావన చేయాలి. పురుష స్వరూపానికి శ్రేష్ఠమైన పంచె, కండువ ఇచ్చినట్టు, స్త్రీ స్వరూపానికి నాణ్యమైన చీర, రవిక ఇచ్చినట్టు భావన చేయాలి. ఇక్కడ శ్లోకం చెప్పాలి. కుదిరితే నిజమైన వస్త్రాలు, లేకపోతే ప్రత్తితో చేసిన వస్త్రాలు, లేకపోతే అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి. ఇచ్చిన వస్త్రాలను ఆ దేవతా స్వరూపం వేసుకున్నట్టు భావన చేయాలి. భావన మాత్రం ఉన్నతంగా ఉండాలి.

ఆభరణం
మంచి బంగారు ఆభరణాలతో దేవతను అలంకరించినట్టు భావన చేయాలి. కుదిరితే ఆభరణం చూపాలి, లేదా కుడి చేతితో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, దేవత మూర్తి పాదాల వద్ద వేయాలి.

గంధం
దేవతా స్వరూపం యొక్క చేతులకు, కాళ్ళకు, కంఠానికి గంధం రాసినట్టు భావన చేయాలి. కుడి చేతితో ఒక పువ్వు తీసుకుని, దానిని గంధంలో ముంచి, శ్లోకం చదివి, దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

పుష్పం
మంచి పువ్వులతో చేసిన మాలని దేవతా స్వరూపం మెడలో వేసినట్టు, దోసిట నిండా పరిమళం విరజిమ్ముతున్న పువ్వులు తీసుకుని ఆ పాదాల మీద వేసినట్టు భావన చేయాలి. అంగ పూజలో ఒక్కొక్క అంగానికి పువ్వు వేస్తున్నట్టు భావన చేయాలి. అష్టోత్తరనామావళి గానీ సహస్రనామావళి గానీ చదువుకోవచ్చు.
నోటితో నామాలు చెప్తూ కుడి చేతితో పువ్వులను మూర్తి పాదాల వద్ద వేస్తూ అలంకారం చేయాలి.

ధూపం
శ్లోకం చెప్పి అగరవత్తులు, లేక సాంబ్రాణి వెలిగించి దేవతకు చుట్టూ తిప్పి, పక్కన పెట్టాలి. ఆ పరిమళం పూజా ప్రాంతం మొత్తం వ్యాపించినట్టు భావన చేయాలి.

దీపం
వెలిగించిన దీపాన్ని దేవతకు చూపాలి. మూడవ దీపం పెట్టడానికి కుదిరితే పెట్టాలి లేకపోతే మొదట వెలిగించిన దీపాలనే చూపాలి. కుడి చేతితో అక్షతలు దీపానికి చూపి అవి దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

నైవేద్యం
నివేదన కోసం తెచ్చిన పదార్థాలను ఒక పళ్ళెం లో పెట్టి, శ్లోకం చెప్తూ కలశం లోని నీళ్ళను వాటిపై చిలకరించాలి. కలశంలోని పువ్వుని కానీ మామిడాకులను కానీ కుడి చేతితో పట్టుకుని, గాయత్రీ మంత్రం చదివిన తరువాత నైవేద్యం చుట్టూ తిప్పి “స్వాహా” అన్నప్పుడు దేవతా మూర్తి నోటికి అందివ్వాలి. దేవతా స్వరూపం అవి తిన్నట్లు భావన చేయాలి.

తినడం అయ్యాక చేతులు, కాళ్ళు, ముఖం (నోరు) కడిగినట్టు భావన చేసి, కలశంలో నీళ్ళను ఉద్దరిణతో అరివేణంలోకి విడవాలి. తర్వాత ఆచమనీయం అన్నప్పుడు మూడుసార్లు కలశం లోని నీరు అరివేణంలోకి విడవాలి.

తాంబూలం
నివేదన అయ్యక తమలపాకును చుట్టి దేవత స్వరూపనికి ఇచ్చినట్టు, అది ఆ దేవత నోటిలో పెట్టుకుని నమిలినట్టు భావన చేయాలి. శ్లోకం చెప్పి, కుడి చేతితో తాంబూలం ఆకులు, వక్కలు తీసుకుని దేవతా మూర్తికి ఒక ప్రక్కగా ఉంచాలి. తాంబూలం లభ్యం కాని పక్షంలో అక్షతలు తీసుకుని శ్లోకం చదివి, ఆ దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

నీరాజనం
లేచి నిలబడి, హారతి వెలిగించి, ఘంట వాయిస్తూ, దేవతా స్వరూపానికి పాదాల నుంచి మూర్తికి కుడి చేతి వైపుగా మూడుమార్లు తిప్పాలి. హారతి తిప్పుతున్నప్పుడు ఆ దీప కాంతిలో మీరు అలంకరించిన దేవతా మూర్తిని పరిశీలించి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత హారతిపళ్ళెం పక్కన పెట్టి, దానికి ఒక ప్రక్క కలశంలోని నీళ్ళను చిలకరించి, హారతిని కళ్ళకు అద్దుకుని, కలశంలో నీళ్ళు ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో విడవాలి.

మంత్రపుష్పం – 
అక్షతలు, పువ్వులు చేతిలోకి తీసుకుని, ఇచ్చిన శ్లోకం గానీ మంత్రపుష్పంగానీ చదివి, దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం చేయాలి.

ప్రదక్షిణ
మళ్ళీ అక్షతలు తీసుకుని, శ్లోకం చెప్తూ, మనకు కుడివైపుగా మూడుసార్లు ప్రదక్షిణగా తిరగాలి. చేతిలోని అక్షతలు దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం చేయాలి.
పునః పూజ
రాజయోగ్యమైన ఉపచారాలు చేస్తున్నట్టు భావన చేయాలి. శ్లోకాలు చెప్పి అక్షతలని కుడి చేతితో తీసుకుని దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.

అర్పణ
అక్షతలు కుడి చేతిలోకి తీసుకుని ఉద్ధరిణతో కలశం లోని నీరు తీసుకుని, శ్లోకం చెప్పి, అరివేణంలోకి విడవాలి.

తీర్థస్వీకరణ
శ్లోకం చదువుకుంటూ అభిషేక జలాన్ని కానీ, లేకపోతే కలశం లోని నీటిని గానీ ఉద్ధరిణతో తీసుకుని, మూడు సార్లు కుడి అరచేతిలో వేసుకుని శబ్దం రాకుండా తాగాలి.

“ఓం శాంతిః శాంతిః శాంతిః” అన్నప్పుడు దేవతా మూర్తి పాదల వద్ద ఉన్న అక్షతలు తీసుకుని శిరస్సు మీద వేసుకుని, కళ్ళుమూసుకుని నమస్కారం చేసి మన చుట్టూ ప్రశాంతత నెలకొన్నట్టు భావన చేయాలి.

ఇది క్లుప్తంగా ఇవ్వబడిన పూజా విధానం. మరింత వివరంగా మీ పెద్దలవల్లగానీ, పురోహితులవల్లగానీ, గురువు వద్దగానీ తెలుసుకోగలరు.

|| స్వస్తి ||

శుభం భూయాత్...
పూజా విధానము సంపూర్ణం

Keywords:
Poojavidhi,Prati roju Pooja Vidhaanam ప్రతిరోజూ పూజావిధానం ,Simplest way to perform Daily Puja at Home.Simplest way to perform Daily Puja at Home,Nitya pooja vidhanam,nitya pooja vidhanam in english,daily pooja mantras in telugu,nitya pooja vidhanam in kannada,ayyappa daily pooja vidhanam at home in telugu pdf,nitya puja vidhi in telugu pdf,how to do pooja at home daily in telugu pdf,puja ela cheyali,nitya pooja vidhanam in telugu audio free download,What is Meant by Pooja and Pooja Vidhi,Nitya pooja vidhanam , నిత్య పూజ ఎలా చేయాలి?, రోజు పూజ ఎప్పుడు, ఎలా చెయ్యాలో మీకు తెలుసా?, Nitya Pooja Rahasyalu, Importance of Nitya Pooja Vidhanam PDF Download.

Comments

  1. Maa husband ki job ledhu machi job kavali plz help

    ReplyDelete
  2. Maa husband ki job ledhu machi job kavali plz help

    ReplyDelete
  3. Ma babu 12 th studying Chad uvu meda interest Ravalli baga chadavali

    ReplyDelete
  4. Manam nitya pooja lo a devuniki ayte abahanadi shodashopachara pooja chestamo a devuni stotram matrame cheyala vere devuni stotralu kuda chaduvukovalante ela. Lakshmi narayanulni avahana cheste vala stotralu kakunda durga stotralu kani hanuman stotralu kani cheyocha

    ReplyDelete

Post a Comment