Drop Down Menus

Sri Govindaraja Swamy Temple Information Telugu | Temple Timings, Accommodations Detaisl

గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి :
గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలో ఉన్న కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన్ని శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తిరుపతికి గోవిందరాజపట్నం అని మరొక పేరు కూడా ఉంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం ఉండడంతో ఈ పేరు మీదుగా గోవిందరాజపట్నం అనే పేరు వచ్చింది.  తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. 
ఆలయ నిర్మాణం :
ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఆలయ గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ, భాగవత గాథల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తరదిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకుని, శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభికమలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. కోనేరు నాలుగు ప్రక్కలా విశాలమైన మెట్లు కట్టారు. ఆలయం ప్రక్కనే "ఆలయ వాస్తు మ్యూజియం" ఉంది. ఇక్కడి మూల విగ్రహం మట్టితో చేసినందువలన అభిషేకం చేయకపోవడం ఒక విశేషం. తిరుమల లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలాగే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతులే పాటిస్తారు.

చరిత్ర :
ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైన సమచారాన్ని అందిస్తున్నాయి. అన్నింటికంటె పాత శాసనం ప్రకారం 1235లో మూడవ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. 1239లో వీర నరసింగ యాదవరాయలు భార్య ఆలయం రథం నిమిత్తం, మరి కొన్ని మరమ్మతుల నిమిత్తం కానుకలు సమర్పించింది. 1506లో విజయ నగర రాజుల సాళువ వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది.

క్రిమికంఠుడనే శైవుడైన రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడిచేసి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు. ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లాచెదురుగా పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. ఆ విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారుచేయించి తిరుపతిలో ప్రతిష్ఠచేసారు. చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవవిగ్రహ సహితంగా ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పరిచారు. తన శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే వున్న తటాకానికి ప్రక్కన ఆ దేవాలయ నిర్మాణం చేశారు. దేవాలయ నిర్మాణం అనంతరం రాజు ఆలయం చుట్టూ ఒక అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు రామానుజాచార్యుల పేరిట రామానుజపురం అని పేరు పెట్టారు. 1830ల నాటికి కూడా ఆలయం ఆచార్యపురుషుల అధీనంలోనే ఉండేది. ఒక కథనం ప్రకారం: చిదంబరంలో వున్న గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో 24-2-1130 లో ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనె శ్రీ ఆండాల్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. గోవింద రాజ స్వామి వారి విగ్రహం రాక ముందు నుండి అక్కడ పార్థ సారధి విగ్రహం వుండేది. దీని ఉత్తర దిశలో గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో వుత్సవ విగ్రహంగా వుండిన గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటిటి వరకు మూల విరాట్టయిన వరద రాజ స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది.

లీలలు :
సంతానం లేని ఒక కాశీ రాజు కుటుంబసమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకుని భక్తితో సేవించారట. స్వామి అనుగ్రించేందుకు, రాణి కలలో ప్రత్యక్షమై నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను. నీ ముక్కుకు ఉన్న నీనాసామణిని నాకు ఇవ్వు అన్నాడు. దానికి ఆమె స్వామివారితో నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని. నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట. అందుకు స్వామివారు అలా ఐతే- నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను - అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను. అంతేకాని మరే విధంగానూ కుదరదు అన్నాడని ప్రతీతి. ఈ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన వేంకటేశ్వరునికి అన్నగా భక్తులు సంభావిస్తూంటారు.

నిత్యం సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన,
తిరుమలలో స్వామి వారికి జరిగినట్టే గోవిందరాజస్వామికి కూడా నిత్యం సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన, నైవేద్యం, ఏకాంత సేవలు జరుగుతాయి. అలాగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా వైశాఖ మాసంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గోవిందరాజ స్వామి ఆలయం ప్రాంగణంలోనే గోదాదేవి, పార్థసారధి కల్యాణ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ దేవి ఇలా చాలా ఆలయాలను దర్శించుకోవచ్చు.
ఎలా వెళ్ళాలి: 
రోడ్డు ద్వారా తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 

రైలు మార్గం ద్వారా: దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది. 
వాయు మార్గం ద్వారా: తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

                

govindaraja swamy temple tirupati, sri govindaraja swamy temple tirupati andhra pradesh, govindaraja swamy images, sri govinda raja swamy temple timings, tirupati railway station to govindaraja swamy temple, sri govinda raja swamy temple tirupati andhra pradesh, govinda raja swamy temple images, sri kodandarama swamy temple tirupati timings, govindaraja swamy temple information telugu, tirumala, ttd, 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.