Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Amarnath Temple – History Telugu | Jammu and Kashmir Amarnath Yatra

అమర్నాథ్:
అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని  జమ్మూ కాశ్మీర్ లో ఉంది. 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.

రెండు మార్గాలు: 
అమర్నాథ్కు చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి దారిలో పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి... అక్కడి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. కాస్త దూరమైనా, శివుడు నడిచివెళ్లిన దారి కావడంతో చాలామంది యాత్రికులు ఈ మార్గాన్నే ఎంచుకొంటారు. ఇక శ్రీనగర్ నుంచి బాల్తాల్కు చేరుకుని అక్కడి నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు చేరుకోవడం మరో మార్గం. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. సామాన్లంతా మనుషులే మోసుకువెళ్లాలి.

హెలికాప్టర్లూ ఉంటాయి: 
యాత్ర కోసం ఇన్ని కష్టాలు పడలేం అనుకునేవారికి జమ్ము, శ్రీనగర్, పెహల్గావ్ల నుంచి పంచతరణి వరకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డకట్టించే చలిలో, కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో... ఎంతో శ్రమకి ఓర్చి అమర్నాథ్ గుహకు చేరుకునేవారికి తగిన ఫలితం దొరుకుతుంది. దాదాపు 130 అడుగులుండే ఈ గుహలో ప్రవేశించాక కనిపించే శివలింగం జలరూపంలో ఉన్న శివుని దర్శించిన అనుభూతినిస్తుంది.

ఇలా వెళ్లాలి.... 
అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై సాధారణంగా రాఖీపౌర్ణమి రోజున ముగుస్తుంది. అలాగే ఈసారి కూడా జూన్ 28న మొదలై ఆగస్టు 7న ముగుస్తోంది. ఈ యాత్ర చేయాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ యాత్రను పర్యవేక్షించే Shri Amarnathji Shrine Board వెబ్సైట్ ద్వారా రిజిస్టరు చేసుకోవాలి. బోర్డు సూచించిన బ్యాంకులో తగిన దరఖాస్తు చేసుకుని, వాటికి మీ ఆరోగ్యం భేషుగ్గా ఉందనే వైద్యపరీక్షల నివేదికను కూడా జోడించాలి. ఆ పత్రాలన్నింటినీ అమర్నాథ్ యాత్ర అధికారికి పంపాలి. సదరు అధికారి అంగీకరించిన తర్వాతే, ఆయన సూచించిన రోజునే అమర్నాథ్కు ప్రవేశం లభిస్తుంది.


ఒకప్పుడు అమర్నాథ్ యాత్ర కోసం ఏటా లక్షలమంది యాత్రకులు ప్రయాణమయ్యేవారు. కానీ కశ్మీర్లో శాంతిభద్రతల సమస్యలు పెరిగినప్పుడల్లా, యాత్రికల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఆపదా రాకుండా ఉండటానికి మన భద్రతా బలగాలు వారిని దారిపొడుగూతా కంటికిరెప్పలా కాచుకుని ఉంటాయి. ఇక పెహల్గావ్ నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్రికుల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉంటాయి. పైగా సాక్షాత్తూ ఆ అమరలింగేశ్వరుడు మనల్ని కాచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడయ్యే! అందుకే భక్తులు ఆ అమర్నాథుని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఉవ్వళ్లూరుతూ ఉంటారు.

amarnath history, amarnath temple history in hindi, amarnath yatra route, amarnath temple video, amarnath yatra walking distance from baltal, amarnath yatra 2020, amarnath yatra 2020, amarnath yatra 2020 dates

Comments

Popular Posts