Sri Digambar Jain Temple | Delhi

శ్రీ దిగంబర్ జైన్ ఆలయం , ఢిల్లీ :

ఢిల్లీ లోని దర్శించదగిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద కలదు. ఈ ఆలయం పూర్తిగా ఎర్ర కోట మాదిరిగా ఆలయ నిర్మాణం ఉంటుంది.  ఈ ఆలయం పురాతన ఆలయం. గౌరి శంకర్ ఆలయం పక్కనే ఈ దేవాలయం కూడా ఉంటుంది. పురాతన మరియు ప్రసిద్ధ జైన దేవాలయం.

ఆలయ చరిత్ర : 

ఈ ఆలయం పూర్తిగా ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. అప్పటి పాత ఢిల్లీ మొఘల్ చక్రవర్తి షాజహాన్ (1628-1658) ఆయన కాలంలో స్థాపించారు. జైన పండితుడు బల్భద్ర జైన్ భారతదేశంలోని దిగంబర్ జైన మందిరాల సంకలనం ప్రకారం, మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో ఈ ఆలయం నిర్మించబడింది. మొఘల్ సైన్యానికి చెందిన ఒక జైన అధికారి వ్యక్తిగత ఆరాధన కోసం తన ఇంటిలో తీర్థంకర విగ్రహాన్ని ఉంచినట్లు చెబుతున్నారని బల్భద్ర జైన్ పేర్కొన్నారు. క్రమంగా ఇతర జైన సైన్యం అధికారులను ఆకర్షించడం ప్రారంభించింది, తదనంతరం, 1656 లో ఈ స్థలంలో ఒక జైన దేవాలయం నిర్మించబడింది.  ప్రస్తుత ఆలయ భవనాలు మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత నిర్మించబడ్డాయి మరియు 1878 నాటివి.


1931 లో, ఆచార్య శాంతిసాగర్, దిగంబర జైన సన్యాసి ఢిల్లీ కి  వచ్చారు. ఎనిమిది శతాబ్దాల విరామం తర్వాత సందర్శించిన తొలి దిగంబర సన్యాసి ఆయన. ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా ఒక స్మారక చిహ్నం కూడా ఉంది.ఈ ఆలయంలో మారియొక్క విశేషం కూడా ఉన్నది.  ఈ దేవాలయం పక్కనే  ప్రపంచంలోని ఏకైక సంస్థగా పిలువబడే బర్డ్స్ హాస్పిటల్ కలదు. దాని యొక్క నివాహన ఖర్చు మొత్తం ఈ ఆలయం వారే చూసుకుంటున్నారు. 1957 లో ఆచార్య దేశభూషణ్ మహారాజ్ సూచనల మేరకు 1957 లో నిర్మించారు, ఈ దేవాలయం లోనే ప్రత్యేక  కాంప్లెక్స్‌లో ఒక పుస్తక దుకాణం కూడా ఉంది.


ఆలయ దర్శన సమయం :

ఉదయం       : 5.30 - 11.30
సాయంత్రం  : 5.30-8.30

వసతి వివరాలు :

ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి వసతి సౌకర్యాలు లేవు కానీ దగ్గరలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

మొదట ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి చాందిని చౌక్ బస్ స్టాండ్ చేరుకోవాలి అక్కడి నుంచి నడుచు కుంటూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి సమీపంలోనే లాల్ కిలా అనే మెట్రో స్టేషన్ కలదు. 

విమాన మార్గం :

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

శ్రీ దిగంబర్ జైన్ ఆలయం
నేతాజీ సుభాష్ మార్గ్,
ఎర్ర కోట రోడ్డు 
చాందిని చౌక్
ఢిల్లీ.
పిన్ కోడ్ : 110006

key Words : Sri Digambar Jain Temple , Famous Temples In Delhi , Hindu Temples Guide

Comments