Drop Down Menus

Gauri Shankar Temple | Delhi

గౌరీ శంకర్ ఆలయం , ఢిల్లీ :

ఈ ఆలయం చాందిని చౌక్ లోని  ప్రధాన రహదారిపై దిగంబర్ జైన్ లాల్ మందిర్ సమీపంలో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి పరమేశ్వరుడు. ఢిల్లీ లో చూడవలసిన ప్రధాన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఒక ఆర్మీ భక్తుని కోరిక మేరకు ఈ ఆలయం నిర్మించారు. ఫోటోగ్రఫీ వంటి వాటికి ఈ ఆలయంలో ప్రవేశం లేదు. ఈ ఆలయంలో పైన పీఠ స్థానంలో పార్వతి పరమేశ్వరుడు క్రింద లింగ రూపంలో దర్శించుకోవచ్చు. 

ఆలయ చరిత్ర :

ఈ ఆలయం 800 సంవత్సరాల క్రితమే నిర్మించారు అని అక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ ఈ ఆలయాన్ని శివ భక్తుడైన మరాఠా సైనికుడు అపాగంగాధార్ అతను నిర్మించాడు. అతను ఒకప్పుడు ఒక యుద్ధంలో  పాల్గొని  తీవ్రంగా గాయపడి ఉండగా తాను బతికి ఉంటే అందమైన ఆలయాన్ని నిర్మిస్తానని ప్రార్ధన చేసి మొక్కుకుంటాడు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర నిర్మాణం పైకప్పు దిగువ భాగంలో అతని పేరు హిందీలో చెక్కబడింది. చిన్నగా ఆలయానికి నిర్మించాడు. తరువాత కాలంలో 1959 లో, సేథ్ జైపుర ఆలయాన్ని పునరుద్ధరించాడు మరియు అతని పేరు ఆలయ కిటికీల మీద చూడవచ్చు.


ఆలయంలో గౌరీ-శంకర్ తో పాటు వారి ఇద్దరు కుమారులు గణపతి  మరియు కార్తీకేయ స్వామి విగ్రహాలు కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం లోపల భక్తుల కనుకలతో పాలరాతితో పునః నిర్మించారు. వెండితో చేయబడిన నాగభరణం కూడా గమనించారు. శివరాత్రి పండుగ రోజు ఈ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు దేవాలయంని వివిధ విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది.


ఆలయ దర్శన సమయం :

ఉదయం     : 6.00 - 11:00
సాయంత్రం : 4:30 - 8.30

వసతి వివరాలు :

ఈ ఆలయనికి సంబంధించి ఎటువంటి వసతి సౌకర్యాలు లేవు కానీ కొద్ది దూరంలోనే ప్రైవేట్ హోటల్ లు ఉన్నాయి.

ఆలయానికి చేరుకొనే విధానం :

రోడ్డు మార్గం :

అన్నీ ప్రధాన ప్రాంతాల నుంచి మొదట న్యూ ఢిల్లీచేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్ ఆటో చాందిని చౌక్ కి చేరుకొని ఈ ఆలయానికి నడక దారిలో కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలోనే చాందిని చౌక్ మెట్రో స్టేషన్ ఉన్నది.  ఈ స్టేషన్ నుంచి కేవలం  1 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. లేదా పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కూడా చేరుకోవచ్చు అక్కడి నుంచి ఆలయానికి 2.5 కి. మీ దూరంలో ఉన్నది.

విమాన మార్గం :

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామ :

గౌరీ శంకర్ ఆలయం ,
చాందిని చౌక్ రోడ్డు ,
పాత ఢిల్లీ మార్గ్ 
ఢిల్లీ
పిన్ కోడ్ : 110006.

Key Words : Gauri Shankar Temple, Famous Temples In Delhi, Lord Shiva , Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.