Drop Down Menus

Bhagavad Gita 9th Chapter 1-11 Slokas and Meaning in Telugu |సరళమైన తెలుగు లో భగవద్గీత 

శ్రీమద్ భగవద్ గీత నవమోఽధ్యాయః
అథ నవమోఽధ్యాయః |

శ్రీభగవానువాచ |

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |

జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ‖ 1 ‖


భావం : శ్రీ భగవానుడు : అశుభకారమైన సంసారబంధంనుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతి రహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని అసూయ లేని నీకు ఉపదేశిస్తున్నాను.


రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ‖ 2 ‖
భావం : విద్యలలో ఉత్తమం, పరమరహస్యము,పవిత్రమూ అయినా ఈ బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభసాధ్యం.


అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |

అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ‖ 3
భావం : అర్జునా! ఈ ధర్మం పట్ల శ్రద్ద లేని పురుషులు నన్ను పొందకుండా మరణ రూపమైన సంసారపధంలో పరిభ్రమిస్తారు.


మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |

మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ‖ 4 ‖

భావం : ఇంద్రియాలకు కనిపించని నా రూపం ఈ విశ్వమంతా వ్యాపించి వున్నది. సకలజీవులూ నాలో వున్నాయి. నేను మాత్రం వాటిలో లేను. 


న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |

భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ‖ 5 ‖
భావం : ఈశ్వర సంబంధమైన నా యోగశక్తి చూడు. భూతాలు నాలో లేవు. నా ఆత్మ సమస్త భూతాలను సృష్టించి పోషిస్తున్నప్పటికి వాటిలో వుండదు.    


యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |

తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ ‖ 6 ‖
భావం : సర్వత్ర సంచరించే మహావాయువు ఆకాశంలో నిరంతరం నిలిచి వున్నట్టే సర్వభూతాలు నాలో వున్నాయి అని తెలుసుకో.


సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ‖ 7 ‖
భావం : కౌంతేయ! ప్రళయకాలంలో ప్రాణికొటులన్ని నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టికాలంలో వాటిని మళ్ళీ నేను సృజిస్తునాను.   


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |

భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ‖ 8 ‖
భావం : ప్రకృతికి అధీనమై, అస్వతంత్రమైన సకలభూత సంఘాలన్నీటిని స్వాధీనంలో వుంచుకున్న నా ప్రకృతి తో మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను.   

న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |

ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ‖ 9 ‖
భావం : అయినప్పటికీ అర్జునా! వాటిపై ఆసక్తి లేని తటస్థుణి కావడం వల్ల ఈ కర్మలు బంధించలేవు.   


మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |

హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ‖ 10 ‖
భావం : కౌంతేయా! ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే ఆవిచ్చినంగా జగన్నాటకం జరుగుతుంది.    

అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ‖ 11 ‖
భావం : సమస్త ప్రాణకోటికి ప్రభువైన నా పరమతత్వం తెలియని మూఢులు మానవ రూపంలో వున్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. 

9వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 9th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.