Drop Down Menus

Bhagavad Gita 8th Chapter 19-28 Slokas and Meaning in Telugu |సరళమైన తెలుగు లో భగవద్గీత 

శ్రీమద్ భగవద్ గీత అష్టమోఽధ్యాయః
అథ అష్టమోఽధ్యాయః |

భూతగ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ‖ 19 ‖


భావం : పార్ధా! ఈ జీవకోటి పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది.

పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ‖ 20 ‖
భావం : ఈ అవ్యక్తప్రకృతికి అతితమై, అగోచరం, శాశ్వతమూ అయినా పరబ్రహ్మతత్వం సమస్త భూతాలు నశించిన నశించదు.

అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ‖ 21 ‖
భావం : అగోచరుడని, శాశ్వతుడనీ చెప్పే ఆ పరమాత్మ పరమగతిగా భావిస్తారు. నాకు నిలయమైన పరమపదాన్ని పొందినవాళ్ళకు మళ్ళీ పునర్జన్మ లేదు.  

పురుష స్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ‖ 22 ‖
భావం : అర్జునా! సమస్తభూతాలాను తనలో ఇముడ్చుకొని,సకలలోకాలలో వ్యాపించి వున్న పరమాత్మను ఆచంచలమైన భక్తి వల్లనే పొందవచ్చు.

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ‖ 23 ‖
భావం : భరతవీర! యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏవేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను.  

అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ‖ 24 ‖
భావం : అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఆరుమసాల ఉత్తరాయణం - వీటిలో మరణించే బ్రహ్మాపాసకులకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది.  

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ‖ 25 ‖
భావం : పొగ, రాత్రి, కృష్ణపక్షం, ఆరుమసాల దక్షిణాయనంలలో గతించిన యోగి చంద్రజ్యోతిని పొంది, మళ్ళీ మానవలోకంలోకి వస్తాడు. 

శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః ‖ 26 ‖
భావం : శుక్ల, కృష్ణ అనే రెండింటిలో జగత్తులో శాశ్వతమార్గాలుగా భావిస్తున్నారు. శుక్లమార్గంలో పయనించిన వాడికి జన్మరహిత్యమూ, కృష్ణమార్గంలో పోయినవాడికి పునర్జన్మమూ కలుగుతాయి.

నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ‖ 27 ‖
భావం : పార్ధా! ఈ రెండుమార్గాలూ యోగి ఎవడూ మొహంలో పడడు.  అందువల్ల నీవు నిరంతరం ధ్యానయోగంలో వుండు. 


వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ‖ 28 ‖
భావం : దీనినంతా గ్రహించిన యోగి వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలకు చెప్పబడ్డ పుణ్యఫలాలను అధిగామించి, అనాది అయిన పరమపదం పొందుతాడు. 

8వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 8th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments