Drop Down Menus

శ్రీ చతుర్దశ దేవతాలయం | పాత అగర్తాలా | త్రిపుర | Sri Chaturdasha Temple Information | Tripura | Hindu Temples Guide

శ్రీ చతుర్దశ దేవతాలయం, పాత అగర్తలా, త్రిపుర :

అగర్తాలా లోని ప్రసిద్ద ఆలయాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ ఆలయం పాత అగర్తాలా లో కలదు. ఈ ఆలయ గోపురం బౌద్ధ ప్రభావం యొక్క ఆనవాళ్లను వెల్లడించే విధంగా ఈ ఆలయం నిర్మాణం ఉంటుంది. అగర్తాలా నగరానికి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని చౌద దేవతా మందిరం అని ఇక్కడి ప్రాంత స్థానికులు పిలుస్తారు.

ఆలయ చరిత్ర : 

ఈ ఆలయాన్ని 1761 లో త్రిపుర రాజు కృష్ణ మాణిక్య దేబ్బర్మ చేత చతుర్దాషా దేవతా అని పిలువబడే పద్నాలుగు దేవతల గౌరవార్థం నిర్మించబడింది మరియు ఈ దేవతలను ఖార్చి పూజలో ఆచారంగా పూజిస్తారు. చతుర్దాషా అనగా 14 అని అర్దం. ఈ ఆలయం పద్నాలుగు దేవతలు అంటే “చతుర్దాషా దేవతలకి” అంకితం చేయబడింది. వారు  లాంప్రా, అఖాత్రా, బిఖాత్రా, బురాసా, తుమ్నైరోక్, బోనిరోక్, సంగ్రోమా, మ్వాటైకోటర్, ట్విమా, సోన్‌గ్రామ్, నోక్సమ్వటై, మెయిలుమా, ఖులుమా మరియు స్వాకల్మ్‌వటై అనే పద్నాలుగు దేవతల పేర్లు.  త్రిపుర ప్రాంత రాజు కృష్ణ మాణిక్య దేబ్బర్మ ఈ ఆలయాన్ని నిర్మించారు.


పురాణాల ప్రకారం చతుర్దాషా ఆలయ చరిత్రకు సంబంధించిన పద్నాలుగు మంది ఈ ఆలయానికి ప్రధాన దేవతలు, ఎందుకంటే వారు త్రిపుర రాజకుటుంబం పూజించిన దేవతలు. వీరందరినీ కలిసి పూజించే ఆచారం రాజులు ఈ ప్రాంతాన్ని పాలించే రోజుల నుండి ఉన్నది.  అందువల్ల, ఆలయంలోని ఆరాధనకు పూజారులు అందరూ సమాన హక్కు కలిగి ఉంటారు.

పూర్వం ఈ ఆలయం పై అనేక మంది ఆక్రమణదారులు నగరాన్ని ఆక్రమించారు. త్రిపుర రాజు తన రాజధానిని హౌరా నది ఒడ్డున ఉన్న అగర్తలాకు మార్చవలసి వచ్చింది. రాజు కృష్ణ మాణిక్య దేబ్బర్మ తన అసలు రాజధాని ఉదయపూర్ ను విడిచిపెట్టి అగర్తల వద్ద కొత్త రాజధానిని ఏర్పాటు చేసినప్పుడు, దేవతల విగ్రహాలు కూడా ఈ స్థలాన్ని విడిచిపెట్టి అతనితో పాటు తన కొత్త రాజదానికి తీసుకొని రావాలని తన మంత్రులతో చెప్పగా రాజు వారి అభ్యర్థనను హృదయపూర్వకంగా తీసుకొని అగర్తలాకు తీసుకువచ్చి కొత్తగా నిర్మించిన ఆలయంలో వాటిని ఏర్పాటు చేశారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం     : 6.00-12.00
సాయంత్రం : 3.30-7.30 

వసతి సౌకర్యాలు :

ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలో అగర్తాలా బస్ స్టాండ్ కలదు. జిల్లా నుంచి సాధారణ బస్సులు ఈ ఆలయానికి అందుబాటులో ఉన్నాయి. నుంచి ఈ ఆలయానికి 55కి. మీ దూరంలో కలదు.

రైలు మార్గం :

సమీప రైల్వే స్టేషన్ అయిన మాటబరీ అనే రైల్వే స్టేషన్ కలదు. అనే రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం :

అగర్తలా విమానాశ్రయం సమీప విమానాశ్రయం ఇక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 55 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు.

ఆలయ చిరునామా :

శ్రీ చతుర్దశ దేవతాలయం
పాత అగర్తలా,
త్రిపుర.
పిన్ కోడ్ - 799012

Key Words : Sri Chaturdasha Temple Information , Famous Temples In Tripura, Agartala, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.