Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

శ్రీ యమధర్మరాజు ఆలయం | ధర్మపురి | జగిత్యాల | Sri Yamadharmaraja Temple Information | Dharmapuri | Jagityala | Hindu Temples Guide

శ్రీ యమధర్మరాజు ఆలయం, ధర్మపురి, జగిత్యాల, కరీంనగర్ :

మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే  యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి  ఉంది అంటే నమ్మగలరా ?  అది కూడా  మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. కరీంనగర్ లోని జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఈ యమధర్మ రాజా ఆలయం ఉంది. ఇటువంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలోని యముని దర్శిస్తే మానసిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం. యముని  దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు. పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్కండేయుడికి,మహా పతివ్రత  సావిత్రికే  కాదు మనకీ వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న  యమ స్వామి.

ఆలయ చరిత్ర : 

ధర్మపురి అనగానే చాలా మంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అని తెలుస్తుంది. కానీ ఆ అలయంలోనే ఈ స్వామి కూడా కొలువై ఉన్నాడు. తమ జాతకకంలోని దోషాలు తొలిగించుకోవడానికి జాతకం  బాగాలేని వారు, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు  ఈ ఆలయం లోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని  తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం. ప్రతి  నెల భరణి  నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ. అంతేకాదు దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి. ఆ  రోజున ఇక్కడ  యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు.

ఆలయ ధర్శన సమయం : 

ఉదయం     : 7.00-2.00
సాయంత్రం : 3.00-8.30

వసతి సౌకర్యాలు :

ఈ ఆలయంలోనే దేవస్థానం వారి సత్రాలు కొద్ది దూరంలోనే కలవు.

ఆలయానికి చేరుకునే విధానం 

బస్ మార్గం :

ధర్మపురి బస్ స్టాండ్ దగ్గరలోనే కలదు. జగిత్యాల నుంచి ఈ ఆలయానికి 28 కి. మీ దూరంలో కలదు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గర గల రైల్వే స్టేషన్ మంచిర్యాల. ఈ స్టేషన్ నుంచి 45కి. మీ దూరంలో కలదు.

విమాన మార్గం :

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుంచి కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

శ్రీ యమధర్మరాజు ఆలయం,
ధర్మపురి గ్రామం
జగిత్యాల జిల్లా
కరీంనగర్.
పిన్ కోడ్ - 505527

Key Words : Sri Yamadharmaraja Temple Information, Dharmapuri,  Jagityala,  Hindu Temples Guide

Comments

Popular Posts