Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***సెప్టెంబర్ నెలకు-2022  శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 27.06.2022 10:00 PAM బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ***సెప్టెంబర్ నెలకు -2022 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా 27.06.2022 సాయంత్రం 04:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ***సీనియర్ సిటిజన్లు /ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్ కోటా జూలై-2022 కోసం, 28-06-2022 10:00 AM లోపు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

స్త్రీ పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్ధిక పరమైన సమస్యలు, ఆపదలు వస్తాయో తెలుసా? Hindu Temple Guide


శాస్త్రం ప్రకారం స్త్రీ, పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్ధిక పరమైన సమస్యలు, ఆపదలు వస్తాయో తెలుసా?  
తల స్నానం ,తలంటు స్నానం ఏరోజు చేస్తే ఏ ఫలితం వస్తుంది, అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని ఆరోగ్య సూచనలు చేసింది. వాస్తవానికి తలస్నానం అనేది అందరికి రోజు చేసే వీలు,వసతి కలుగదు . అలాంటి వారు వారనికి రెండు,మూడు రోజులు తలస్నానం చేసేవారికోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.
Also Readఇటువంటి లక్ష్మీదేవి ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి
తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదువ ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారు.

మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకోవాలి.భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.

మరికొన్ని దినాల్లో తలస్నానం చేస్తే అనారోగ్యమైన పరిస్థితి మరియు ఇతర విషయలలో ప్రతికూలంగా ఉంటుంది.కాబట్టి అన్ని విధములుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది. తలస్నానము ఏ రోజు చేస్తే మంచిది.
Also Read బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
ఈ విషయం గురించి మనం శాస్త్రరీత్యా దీనిని పరిశీలించినట్లైతే స్నానాలు ఉదయం పూటనే చేయాలి,సూర్యోదయంనకు పూర్వం చేస్తే చాలా మంచిది.పొద్దు పోయాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది.వృద్దులు,రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పులేదు.

శరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ముఖ్యంగా స్త్రీలు తల స్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు, జుట్టు చివర్లు ముడి వేసుకుని స్నానం చేయాలి,ఇలా చేస్తే శుభకరం,మంగళకరం. వారపు రోజులలో శుభ,అశుభ ఫలితాలను ఈ క్రింది తెలుప బడ్డాయి.
Also Read : దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది?
ఆదివారం నాడు తల స్నానం, తలంటు స్నానము చేసినచో ఆరోజు అనుకూలం కాదు. ఫలితం శరీర కాంతి(అందం) తగ్గుతుంది,కలత,అనారోగ్యం ఏర్పడుతుంది,దు:ఖప్రదం,సంతానంనకు కీడు. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కొరకు కొబ్బరినూనెలో ఏవేని కొన్ని పూలను కలిపి తలంటుకుని స్నానం దోష పరిహారం జరుగుతుంది.

సోమవారం తలస్నానం పనికిరాదు.ఫలితం కలవరము, కాంతిహీనం,భయం కలుగుతుంది.దోష పరిహారం కొరకు కొబ్బరినూనెలో మందారపూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోషపరిహారం కాగలదు.
Also Read: లాఫింగ్ బుద్దా విగ్రహం పెడితే ఏం ఫలితం ఉంటుంది 
మంగళవారం తలస్నానం అసలే పనికి రాదు. చేస్తే ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోష పరిహారం కొరకు నూనెలో చిటికెడు పుట్టమన్ను|ఆవు తోక్కిన మట్టిని కలిపి తలస్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది.

బుధవారం తలస్నానం చేస్తే ఫలితం శుభం. ఫలితం లాభం, కీర్తి, సంపద కలుగును, జ్ఞానము కలుగును, బుద్ధి వికసించును.
Also Readఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మిదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది.
గురువారం రోజు తలస్నానం చేసిన ఫలితము. అశాంతి, విద్యా లోపము, ధనవ్యయం,కీడు, శత్రువులు అధిక మవుతారు. దోష పరిహారం కొరకు నూనెలో గరిక కానీ పుష్పాలను కానీ కలిపి తలంటుకుని స్నానం ఆచరించిన దోషపరిహారం కాగలదు.

శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం. అశాంతి, వస్తు నాశనం, రోగ ప్రదం. దోష పరిహారం కొరకు నూనెలో చిటికెడు విభూతిని గానీ గోమయము గానీ కలిపి తలంటుకుని స్నానం చేస్తే దోషపరిహారం కాగలదు.

శనివారం తలస్నానం చేస్తే ఫలితం. ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, శుభకరమైనది. ఈ రోజు తప్పక అందరు తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది.
Also Readభార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
శాస్త్ర ప్రకారము తలస్నానం, తలంటు స్నానమును బుధవారం, శని వారం రోజుల్లో చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పండగ పర్వదినాలలో,పుణ్యక్షేత్రాలలో,పుట్టినరోజు నాడు తలస్నానం చేయుటకు శాస్త్రప్రకారంగా ఎలాంటి నియమములు లేవు,అది ఏ వారమైనను నిస్సంకోచకంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రము సూచిస్తుంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు ఇది గమనించాలి.

వారానికి రెండు సార్లు చేసే వాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్థాయి.ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేసే వారు,వారానికి రెండుసార్లు స్నానం చేసే వారైన కనీసం నెలలో కనీసం నాలుగు సార్లు అయిన స్నానపు నీటిలో చిటికెడు పసుపు,కర్పూరం పోడి వేసుకొని తల స్నానం చేయడం వలన గ్రహ దోష నివారణలకు చక్కని తరుణోపాయంగా ఉపయోగపడుతుంది.
Also Readలక్ష్మీ దేవి మీ ఇంటికి  వచ్చేముందు మీకు ఈ సంకేతాలు కనిపిస్తాయి
పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుంది.
మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది.
బుధవారం తలం స్నానంతో లక్ష్మి దీవెనలు కలుగుతాయి.
గురువారం తలంటు స్నానంతో ఆర్ధిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి.
శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయి.
పురుషులు శనివారం తల స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది.
ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయి.
Famous Temples:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథతలస్నానం, పురుషులు, స్త్రీలు,  tala snanam niyamalu, vidupu snanam meaning in telugu, pattu snanam vidupu snanam, pattu snanam means, pattu snanam meaning in telugu, tala snanam eppudu cheyali, sachela snanam meaning in telugu, purudu rules in telugu, suchela snanam

Comments

Popular Posts