Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** అక్టోబర్ నెలకు ఉచిత దర్శనం మరియు 300 రూపాయల టికెట్స్ మొత్తం బుక్ అయ్యాయి*** అలిపిరి మెట్లమార్గం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతుంది . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . అరుణాచలం లో శుక్ర , శని ఆదివారాలలో భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. 

అదివో అల్లదివో శ్రీ హరి వాసము | Annamayya Keerthanalu | Hindu Temples Guide


అన్నమయ్య కీర్తనలు :

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము ||

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము ||

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ ||


మరికొన్ని అన్నమయ్య కీర్తనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Related Postings :



keywords : Annayyamayya Keerthanlu , annamayya history, annamayya lyrics, annamayya keerthanas pdf , annamayya telugu lyrics, keerthanalu, Hindu Temples Guide

Comments

Popular Posts