Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. *** ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్ఎస్ఓ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల. ***కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి. @.. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం..కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆఫ్‌లైన్ కౌంటర్లను మూసివేస్తున్నారు. ప్రతి భక్తుడు తప్పనిసరిగా వెబ్‌సైట్ ద్వారా ఏదైనా (ఉచిత దర్శనంతో సహా) ఆన్‌లైన్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలి. ఇప్పుడే బుక్ చేసుకోండి.***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి | Sanatana dharma | Hinduism | Hindu Temple Guide


అన్నమే ప్రాణం.

ఆకాశంలో వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వి. పంచభూతాల సృష్టి క్రమమిది. పృథ్వి నుండి ఔషధులు, ఓషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం ఉద్భవించాయి. అన్నమే ప్రాణం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మంగా భావించాలి. అన్నం లేకుండా ఎక్కువ కాలం ప్రాణం నిలబడదు. అన్నాన్ని పారవేయకూడదు, ప్రశంసించాలి. అన్నాన్ని వృద్ధి చేసుకోవాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది. అన్నం వల్లనే ప్రాణ రక్షణ, శరీర రక్షణ. ప్రాణ, శరీరాల రక్షణ జరిగితేనే మానవుడు సాధకుడు కాగలుగుతాడు.

Also Readపూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

అన్నమును నిషేధింపరాదు. అన్నం ఉండీ కూడా లేదని చెప్పడాన్ని నిషేధం అంటారు. ఇంటికి వచ్చిన అతిథికి భోజనం లేదనక.. సిద్ధంగా ఉన్న అన్నాన్ని అతిథికిచ్చుట గృహస్థుల ధర్మం. నీరు భోజ్యవస్తువులలోనిది కాబట్టి నీరు కూడా అన్నమే. నీరు జీవనాధారం. అన్నాన్ని తినేది అగ్ని. అది మనలోని జఠరాగ్ని. జలాగ్నులు పరస్పరాశ్రితాలు. అంటే.. నీటిలోన అగ్ని, అగ్ని యందు నీరు ఉన్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్నమును ఎక్కువగా సమకూర్చుకోవాలి, పోగు చేసి పెట్టుకోవాలి. అన్నాన్ని ఎక్కువగా దానం చేయాలి. దానం చేసే గుణం ఉన్న వారికే సకలైశ్వర్యాలు లభిస్తాయంటుంది యుజుర్వేదం. ‘కేవలాఘో భవతి కేవలాదీ’ (ఋగ్వేదం).. తన పొట్ట మాత్రమే నింపుకొనేవాడు పాపాన్నే ఒడిగట్టుకుంటాడు. ఎవడు కేవలం తన కోసమే అన్నం వండుకుంటాడో వాడు నరకం పొందుతాడని శుక్ర నీతిసారం చెబుతోంది. అతిథి లేకుండా భోజనం చేయడం కేవలం పాపాన్ని భుజించినట్లే అంటుంది విష్ణుపురాణం.

Also Readహిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు

ఒకానొకప్పుడు శునక పుత్రుడైన శౌనకుడు, కక్షసేనుని కుమారుడు అభిప్రతారి భోజనం చేయడానికి కూర్చుంటారు. వారికి భోజనం పెట్టే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి అన్నం కోసం యాచిస్తాడు. వారు తనకు భిక్ష వేయకపోవడంతో.. ‘‘ఈ బ్రహ్మాండంలో గొప్పవి నాలుగున్నాయి. అవి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం. ఈ నాలుగింటిని వాయువు తనలో ఇముడ్చుకొంటుంది. అట్లే పిండమున, శరీరమున వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనసు అనే నాలుగు ఇంద్రియాలు ముఖ్యమైనవి. ఈ నాలుగింటినీ ప్రాణం తనలో ఇముడ్చుకొంటుంది. వాయువు, ప్రాణం మిగిలిన వాటిన తమలో కలుపుకోనుటకు చూస్తుంటాయి. సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు అఖిల భువానాన్ని ఏలుతూ తానే రక్షకుడు, భక్షకుడు అవుతున్నాడు. అట్టి దేవుని మహిమ చేతనే పిండమున ప్రాణము, బ్రహ్మాండమున వాయువు తమ స్వీయ కర్మలను చేస్తున్నాయి. అంతటా ఉండి వెలుగుతూ, అన్నింటినీ అందజేస్తున్న ఆ పరమ పురుషుని ఈ మనుష్యులు గుర్తించరు.  ఈ అన్నం ఆ దేవత కొరకే. ఆ ప్రాణరూప బ్రహ్మము కొరకే నేను అన్నము అర్థించాను. కానీ మీరు ఇవ్వలేదు. మీరు అన్నం ఇవ్వనిది నాకు కాదు.. ఆ ప్రాణరూప బ్రహ్మానికే అన్నం ఇవ్వకుండా తిరస్కరించారు’’ అని చెప్పాడా బ్రహ్మచారి. 

Also Readమరణం తరువాత ఏం  జరుగుతుంది? 

దీంతో వారికి జ్ఞానోదయం కలిగి అతడికి భిక్ష పెట్టారు. అందరిలోనూ ఉండే జీవాత్మే ఆ పరమాత్మ అని.. ఆ పరమాత్మే అన్ని దిక్కులకూ వ్యాపించి అన్నాన్ని గ్రహిస్తున్నాడని, కాబట్టి అన్నార్తులకు లేదనకుండా అన్నం పెట్టాలని తెలిపే కథ ఇది.

Famous Posts:

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు 


ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 


దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది


భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.


ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు


చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?

Sanatana dharma, అన్నం, annam importance, What is Sanatana Dharma?, అన్నదానం, annapurna stotram benefits, annapoorneshwari story, annapurneshwari photos, annapurneshwari devi

Comments

Popular Posts