ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు............!!
ఆదివారం నాడు ఏం చేయ కూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం....
అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు .
నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో నానుడి అయింది -అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది.
ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము , చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం , మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు.
Also Read : అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి..
అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి.
పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. ఆదివారం నాడు విధిగా సూర్య ఉపాసన చేసేవారు.
Also Read : నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?
మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి" అంటూ మన సూర్యాష్టకం లో ఉంది.
మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. అందరికి చెప్పడానికి శక్తీ సరిపోదు. వందమందితో ఒకరిద్దరు గుర్తించినా ఈ పోస్ట్ సార్ధకత పొందినట్టే. .
Famous Posts:
> ఉదయం నిద్రలేవగానే వేటిని చూడకూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?
> పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు
> గ్రహదోషాల నుండి విముక్తి కలగాలంటే
> పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?
> మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి
ఆదివారం, సూర్య, సూర్యాష్టకం , why are sundays special, sunday, importance of sunday essay, sanatana dharma telugu, సనాతన ధర్మం, sanatana meaning in telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment