Drop Down Menus

భగినీ హస్త భోజనం విశిష్టత ఏమిటి ? సోదరి ఇంట భోజనం చేయాలంటారు ఎందుకు? Bhagini hastha bhojanam Significance in telugu

సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు.

కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ సోదరీ,సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం.

భగిని అంటే సోదరి.ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు.కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది.
ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష( రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెపుతారు.రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది.

"భయ్యా ధూజీ'' అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున.ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది.కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు.
చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది.చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.

ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు.వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి.ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది.

ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం ( అకాల మరణం ) లేకుండా ఉంటుంది.ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట.అందు వలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.
ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు.

యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అంటాడు.దీనికి కారణం ఉంది.

యముడు యమున సూర్యుని పిల్లలు.సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట.అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట.
అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదర,సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాలలో దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు.పురాణ కధలలో ఎదో అంతరార్ధాలు దాగి ఉన్నాయని గ్రహిస్తే ఆచారాలు ఆచరణలోకి వస్తాయి.

Famous Posts:

రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..? 

మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము

దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా? 

స్త్రీ మూర్తులకి ఇవి అవసరం..

శుక్రవారం విడిచిన దుస్తుల్నే_ధరిస్తే..? 

ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి  ? 

గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు 

భగినీ హస్త భోజనం, Bhagini Hastha Bhojanam, bhagini, bhagini hastha bhojanam 2020, bhagini hastha bhojanam 2020 date, Bhagini Hastha Bhojanam Vratha Katha telugu,

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.